Apsrtc Jobs Notification 2024: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగుల పట్ల ఒక శుభవార్త తెలియజేసింది. ఆంధ్రప్రదేశ్ రోడ్డు రవాణా సంస్థలో ఖాళీగా ఉన్న 7,545 ఉద్యోగాల భర్తీ కొరకు త్వరలోనే నోటిఫికేషన్ విడుదల చేయనుంది. ఉద్యోగ వివరాలు జీతభత్యాలు అర్హత ప్రమాణాలు కింది విధంగా తెలియజేయడం జరిగింది.
Table of Contents
ఉద్యోగ సంస్థ పేరు | ఆంధ్రప్రదేశ్ రోడ్డు రవాణా సంస్థ |
ఉద్యోగం పేరు | డ్రైవరు, కండక్టర్ |
ఉద్యోగ ఖాళీల సంఖ్య | 7,545 |
జీతం వివరాలు | 15,000 – 25,000 |
అర్హతలు | 10th,Inter |
అధికారిక వెబ్సైటు | https://www.apsrtc.ap.gov.in/Recruitments.php |
ఆంధ్రప్రదేశ్ రోడ్డు రవాణా సంస్థ ఉద్యోగ కాలనీలను భర్తీ చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించింది ఇందులో భాగంగా రాష్ట్ర రవాణా శాఖ పై తొలి సమీక్ష సమావేశంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గారు ఆర్టీసీ పైన అవగాహన సదస్సును ఏర్పాటు చేశారు. త్వరలో ఉద్యోగ ఖాళీల వివరాలు తెలియచేయాలని అధికారులకు స్పష్టం చేశారు.
ఉద్యోగం వివరాలు
ఆంధ్రప్రదేశ్ రోడ్డు రవాణా సంస్థ విభాగంలో ఎక్కువ సంఖ్యలో డ్రైవర్లు మరియు కండక్టర్ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నట్లు ఆర్టిసి అధికారులు ప్రభుత్వానికి తెలియజేశారు. దాదాపు 7,545 ఉద్యోగ ఖాళీలు ఉన్నట్లు నివేదన తెలియజేశారు.
ఉద్యోగ విద్యా అర్హతలు
✅డ్రైవర్ ఉద్యోగాలకు : 10th – Inter పాసైన వారు ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తుదారుడు తప్పనిసరిగా Heavy డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి. డ్రైవర్ గా పనిచేసిన అనుభవం కలిగిన వారికి ఎక్కువ అవకాశం ఉంటుంది.
✅కండక్టర్ ఉద్యోగాలకు : 10th – Inter పాస్ అయిన వారు ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తుదారునికి అనుభవం అవసరం లేదు.
జీతం వివరాలు
డ్రైవర్ ఉద్యోగాలకు – 15000 – 25000
కండక్టర్ ఉద్యోగాలకు – 15000 – 25000
దరఖాస్తు చేసుకునే విధానం
డ్రైవర్ మరియు కండక్టర్ ఉద్యోగాలకు దరఖాస్తుదారుడు అధికారిక వెబ్సైట్లో నోటిఫికేషన్ విడుదల చేసినప్పుడు అధికారిక వెబ్సైట్ నుంచి దరఖాస్తు చేయవలసి ఉంటుంది. ఇది మొత్తం కూడా ఆన్లైన్ విధానంలో దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. దరఖాస్తు చేయు సమయంలో దరఖాస్తుదారునికి దరఖాస్తు ఫీజు కూడా ఉంటుంది.
పరీక్షలు
✅డ్రైవర్ ఉద్యోగానికి సంబంధించి డ్రైవింగ్ సంబంధిత పరీక్షలు ఉంటాయి.
✅కండక్టర్ ఉద్యోగానికి సంబంధించి రాత పరీక్ష ఉంటుంది.
ఎంపిక విధానం
డ్రైవర్ మరియు కండక్టర్ ఉద్యోగాలకు సంబంధించి ఎంపిక అనేది డ్రైవింగ్ సంబంధిత పరీక్షలో మరియు రాత పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించిన వారికి ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.