సంక్రాంతి కానుకగా కొత్త రేషన్ కార్డులు జారి|Ap ration cards Application 2024

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డు లేనటువంటి పేదలకు కూటమి ప్రభుత్వం ఒక శుభవార్తను తెలియజేసింది.సంక్రాంతి కానుకగా రాష్ట్రంలో రేషన్ కార్డు లేనటువంటి పేద ప్రజలకు రేషన్ కార్డులు మంజూరు చేయుటకు విడుదల తేదీని ప్రభుత్వం ఫిక్స్ చేసింది.కొత్త రేషన్ కార్డుల కొరకు దరఖాస్తు చేసుకొనుటకు డిసెంబర్ 2వ తేదీ నుంచి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది.

DEC 2 నుంచి దరఖాస్తుల ప్రారంభం 

కొత్త రేషన్ కార్డుల కొరకు,రేషన్ కార్డులో ఉన్నటువంటి లబ్ధిదారుల తొలగింపునకు మరియు రేషన్ కార్డులో ఉన్నటువంటి వారినే కాకుండా మరి కొంతమందిని చేర్చుకొనుటకు ప్రభుత్వము వివిధ రకాల సర్వీసులతో డిసెంబర్ 2 నుంచి గ్రామ వార్డు సచివాలయాల ద్వారా దరఖాస్తులను స్వీకరించనుంది.కావున ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలి.

సూపర్ SIX పథకాలు రావాలన్నా, కొత్త పింఛన్లు రావాలన్నా, విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ డబ్బులు పడాలన్న ప్రతి పథకానికి అర్హత కలిగిన ఒకే ఒక కార్డు రేషన్ కార్డు.కాబట్టి పేద ప్రజలు తప్పకుండా రేషన్ కార్డు కొరకు దరఖాస్తు చేసుకోండి.

దరఖాస్తు ఫారం డౌన్లోడ్ చేయండి ఇలా 

కొత్త రేషన్ కార్డుల కొరకు దరఖాస్తు చేసుకోవాలనుకున్నవారు ఈ క్రింది లింక్ మీద క్లిక్ చేసినట్లయితే మీకు అప్లికేషన్ ఫామ్ మీ మొబైల్ లో డౌన్లోడ్ అవుతుంది.డౌన్లోడ్ చేసుకున్న అప్లికేషన్ ఫారం ని పూర్తిగా నింపి దానికి తగిన డాక్యుమెంట్స్ ఇచ్చి గ్రామ వార్డు సచివాలయం అధికారుల ద్వారా Apply చేసుకోవచ్చు.

Download Application Form here

దరఖాస్తు ఫామ్ తో పాటు ఇవ్వాల్సిన డాక్యుమెంట్స్ 

  • దరఖాస్తు ఫామ్ 
  • రేషన్ కార్డు సభ్యులు అందరితో దిగిన ఫోటో 
  • రేషన్ కార్డులో సభ్యులందరి ఆధార్ కార్డులు 

వివిధ రకాల రేషన్ కార్డ్ సర్వీసులు 

కూటమి ప్రభుత్వం డిసెంబర్ రెండవ తేదీ నుంచి కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తులను కోరడమే కాకుండా వివిధ రకాల సర్వీసులను అందుబాటులోకి తీసుకురావడం జరుగుతుంది అందులో ముఖ్యమైనవి ఇవే. 

  • రేషన్ కార్డులో లబ్ధిదారులను తొలగింపు:-మీ రేషన్ కార్డు లో ఉన్నటువంటి లబ్ధిదారుల్లో ఎవరైనా సరే మరణించిన ఎడల అటువంటి వారిని తొలగింపునకు ప్రభుత్వం దరఖాస్తులను కోరుతుంది. 
  • రేషన్ కార్డులో లబ్ధిదారులను జతచేయడం:-మీ రేషన్ కార్డులో ఉన్నటువంటి లబ్ధిదారులే కాకుండా మరికొంతమందిని జతపరచుకొనుటకు కూడా కోటమీ ప్రభుత్వం డిసెంబర్ రెండవ తేదీ నుంచి దరఖాస్తులను కోరుతుంది. ముఖ్యంగా వివాహం చేసుకున్నటువంటి వారు భార్యను వారి యొక్క కుటుంబ రేషన్ కార్డులోకి చేర్చుకొనుటకు ఈ అవకాశం సద్వినియోగం చేసుకోవచ్చు. 
  • కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తులు:- ఈ సర్వీస్ అనేది కొత్తగా వివాహం చేసుకున్న లబ్ధిదారులు వారి యొక్క కుటుంబాల రేషన్ కార్డుల నుంచి తొలగించి వీరికి మాత్రమే విడిగా రేషన్ కార్డు పొందుటకు అవకాశం. కాబట్టి కొత్తగా వివాహం చేసుకున్న లబ్ధిదారులు కొత్త రేషన్ కార్డు పొందాలంటే మీరు వెంటనే మ్యారేజ్ సర్టిఫికెట్ రెడీగా చేసుకున్నట్లయితే వెంటనే మీకు రేషన్ కార్డు మంజూరు అయ్యే అవకాశం ఎక్కువ శాతం ఉంది.

పాత రేషన్ కార్డులకు కూడా కొత్త కార్డులు 

YSRCP ప్రభుత్వం ఆధ్వర్యంలో పొందిన పాత రేషన్ కార్డుల స్థానంలో కొత్త రేషన్ కార్డులు కూడా మంజూరు చేయనున్న ప్రభుత్వం. 

గత ప్రభుత్వం ఇచ్చిన రేషన్ కార్డులకు గత ప్రభుత్వ అధికారుల ఫోటోలు ఉండడంతో ప్రభుత్వము పాత రేషన్ కార్డులు మంజూరైనటువంటి వారందరికీ కూడా కొత్త రేషన్ కార్డులు మంజూరు చేస్తామని చెప్పింది. 

పూర్తిగా మారిన రేషన్ కార్డు డిజైన్ 

ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అందుబాటులోకి తీసుకువస్తున్న రేషన్ కార్డు యొక్క డిజైన్ పూర్తిగా మారనుంది. సరికొత్త డిజైన్తో రేషన్ కార్డులు అందుబాటులోకి రానున్నాయి. 

మంజూరు తేదీ 

కొత్త రేషన్ కార్డులకు డిసెంబర్ 2వ తేదీ నుంచి దరఖాస్తు చేసుకున్నటువంటి వారికి దాదాపు 24వ తేదీ డిసెంబర్ వరకు దరఖాస్తులను స్వీకరణ జరుగుతుంది. జనవరి సంక్రాంతి కానుకగా రేషన్ కార్డులను మంజూరు చేయాలని ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. 

Leave a Comment