Ap NTR bharosa New pensions Application|ap schemes|New pensions updates

ఏపీలో కొత్తగా పింఛన్లు కొరకు ఎదురు చూస్తున్న ప్రజలకు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం శుభవార్తను అందించింది. కొత్త పింఛన్లకు దరఖాస్తు చేసుకొనుటకు ఈ తేదీ నుంచి గ్రామ వార్డు సచివాలయాల ద్వారా దరఖాస్తులను స్వీకరించనున్నట్లు సమాచారం పూర్తి వివరాలను తెలుసుకుందాం రండి. 

ఏపీలో కొత్తగా పింఛన్లకు దరఖాస్తు చేయుటకు ముందుగానే కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తు ప్రక్రియను ప్రభుత్వం ప్రారంభించనుంది.డిసెంబర్ 2వ తేదీ నుంచి గ్రామ వార్డు సచివాలయాల ద్వారా కొత్త రేషన్ కార్డులు కొరకు దరఖాస్తు చేసుకున్నందుకు ఆన్లైన్ సర్వీస్ అందుబాటులోకి తీసుకురానుంది.పూర్తి వివరాలు ఈ లింక్ మీద క్లిక్ చేసి చూడండి. 

డిసెంబర్లో కొత్త పింఛన్లకు దరఖాస్తులు 

డిసెంబర్ నెలలోనే రాష్ట్ర ప్రభుత్వం ద్వారా అర్హులైన పేద ప్రజలకు కూటమి ప్రభుత్వం కొత్త పింఛన్లను మంజూరు చేయాలని నిర్ణయించింది. దీని కొరకు ముందుగా ప్రభుత్వ జీవోను విడుదల చేసి తర్వాత గ్రామ వార్డు సచివాలయాల ద్వారా దరఖాస్తులను స్వీకరించనుంది. 

దరఖాస్తులను స్వీకరించిన 45 రోజుల తర్వాతనే కొత్త పింఛన్లను లబ్ధిదారుల వివరాలను అందుబాటులోకి తీసుకురానుంది. ఈ 45 రోజుల కాలవ్యవధిలో కొత్త పింఛన్లకు స్వీకరించిన దరఖాస్తులను పరిశీలన ప్రక్రియ జరగనుంది. ఇందులో ప్రభుత్వం నిర్ణయించిన ప్రాథమిక ప్రమాణాలు అనగా అర్హతలు ప్రకారం ఉంటేనే మీకు పింఛన్ మంజూరు చేయడం జరుగుతుంది. 

కొత్త పింఛన్లకు అర్హతలు 

  • ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నివాసి అయి ఉండాలి. అనగా ఆధార్ కార్డు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చిరునామా కలిగి ఉండాలి. 
  • ఆ రేషన్ కార్డు లబ్ధిదారులు మాత్రమే కొత్త పింఛన్లకు అర్హులు. 
  • వృద్ధాప్య పింఛనుకు దరఖాస్తు చేసుకునే వారు వయస్సు 60 సంవత్సరాలు తప్పనిసరి. SC,ST,BC, మైనార్టీలకు కులాలకు వయస్సు 50 సంవత్సరాలుగా కూటమి ప్రభుత్వం పరిగణించింది.
  • వికలాంగులు గనుక దరఖాస్తు చేసుకుంటే వికలాంగత్వం నిర్ణయించేటువంటి సదరం సర్టిఫికెట్ తప్పనిసరి ఉండాలి. 
  • దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు దరఖాస్తు చేసుకుంటే ప్రభుత్వ ఆసుపత్రి ద్వారా ఇచ్చిన మెడికల్ సర్టిఫికెట్ తప్పనిసరి ఉండాలి.
  • కుటుంబంలో అనగా రేషన్ కార్డులో ఉన్నటువంటి వారు ప్రభుత్వ ఉద్యోగి అయి ఉండకూడదు. 
  • మీ కుటుంబంలో మీ రేషన్ కార్డులో ఉన్నటువంటి వారు పన్ను చెల్లింపు దారులు Income tax payer ఉండకూడదు. 
  • వ్యవసాయ భూమి ఏడు ఎకరాలకు మించి ఉండకూడదు. 
  • 4 చక్రాల వాహనం ఉండకూడదు. ట్రాక్టరు టాక్సీ కి మినహాయింపు ఉంది. 
  • మీ కుటుంబంలో ఎవరు కూడా ప్రభుత్వం నుంచి పెన్షన్ పొందకూడదు. అనగా ఒక రేషన్ కార్డుకు ఒక పింఛన్. 

50 సంవత్సరాల వారికి పింఛన్ 

కూటమి ప్రభుత్వం గనుక అధికారంలోకి వస్తే తప్పనిసరిగా 50 సంవత్సరాలకే వృద్ధాప్య పెన్షన్ ఇస్తామని చెప్పింది. కాబట్టి కొత్త పింఛన్లకు ఎవరైనా సరే SC,ST,BC, మైనార్టీల కులాలకు చెందినవారు వృద్ధాప్య పెన్షన్ కు దరఖాస్తు చేసుకొనుటకు వయస్సు 50 సంవత్సరాలు పూర్తి అయి ఉంటే సరిపోతుంది.

గమనిక : మీ కుటుంబంలో ప్రభుత్వం ద్వారా ముందుగానే 60 సంవత్సరాల పెన్షన్ తీసుకునే వాళ్ళు ఉంటే మీకు 50 సంవత్సరాల పెన్షన్ రాదు. ఎవరికైనా ఒకరికే పెన్షన్ వస్తుంది. 

కొత్త పింఛన్లకు అప్లికేషన్ ఫారం 

కొత్త పింఛన్లకు దరఖాస్తు చేయాలనుకున్న వారు అప్లికేషన్ ఫారం నింపి దానితోపాటు కొన్ని రకాల పత్రాల జెరాక్స్లను జతపరిచి గ్రామ వార్డు సచివాలయంలో ఉన్న వెల్ఫేర్ అసిస్టెంట్ గారి దగ్గర ఇవ్వాలి. వారి ద్వారానే కొత్త పింఛన్లకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు చేయబడతాయి. 

దరఖాస్తు ఫారం / అప్లికేషన్ ఫారం డౌన్లోడ్ చేయాలంటే ఈ లింక్ మీద క్లిక్ చేయండి. 

DOWNLOAD APPLICATION FORM

 అప్లికేషన్ తో పాటు ఇవ్వాల్సిన పత్రాలు 

  • లబ్ధిదారుని ఆధార్ కార్డు/ఆధార్ అప్డేట్ హిస్టరీ 
  • రేషన్ కార్డు జిరాక్స్ 
  • 3 పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు 
  • ఇన్కమ్ సర్టిఫికెట్ (ఆదాయ ధ్రువీకరణ పత్రం)
  • క్యాస్ట్ సర్టిఫికెట్ (కుల ధ్రువీకరణ పత్రం) 
  • పింఛన్ రకాన్ని బట్టి సర్టిఫికెట్ (ఓటర్ ఐడి, సదరం సర్టిఫికెట్, మెడికల్ సర్టిఫికెట్ etc..)
  • గడిచిన ఆరునెల కరెంటు బిల్లుల జిరాక్స్లు 

Leave a Comment