HOW TO APPLY FOR AP FARMER REGISTRY|UNIQ FARMER ID|

రాష్ట్రవ్యాప్తంగా రైతు రిజిస్ట్రీకి UNIQ FARMER ID వ్యవసాయ శాఖ శ్రీకారం:

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ {UNIQ FARMER ID}కూడా 11 నెంబర్లతో యూనిక్ కోడ్ ను కేటాయించాలని కేంద్రం నిర్ణయించింది. ఆధార్ తో దేశంలో ప్రతి ఒకరిని గుర్తించిన విధంగానే ప్రతి రైతును గుర్తించేందుకు ఈ యూనిక్ కోడ్ నెంబర్ కేటాయించడం జరుగుతుంది.

రాష్ట్రవ్యాప్తంగా రైతు రిజిస్ట్రీకి {UNIQ FARMER ID} వ్యవసాయ శాఖ శ్రీకారం చుట్టింది. సోమవారం నుంచి రైతు సేవ కేంద్రాల ద్వారా రైతులు రైతు రిజిస్ట్రీకి {UNIQ FARMER ID} నమోదు చేసుకుంటున్నారు.

{UNIQ FARMER ID} నమోదుకు కావాల్సిన డాకుమెంట్స్

డాకుమెంట్స్ ప్రయోజానం
ఆదార్ కార్డురైతు చిరునామా కొరకు
పొలం పట్టారైతు పొలం వివరాల కోసం
బ్యాంకు ఎకౌంటు పథకాల ప్రయోజానం కొరకు
మొబైల్ నెంబర్ రైతు OTP వెరిఫికేషన్ కొరకు
అధికారిక WEBPAGEhttps://apfr.agristack.gov.in/farmer-registry-ap/#/

రైతు రిజిస్ట్రీ గుర్తింపు సంఖ్య నమోదు చేసుకునే విధానం

ప్రస్తుతం భూ-యజమానులు మాత్రమే రైతు రిజిస్ట్రీకి {UNIQ FARMER ID} నమోదు చేసుకునేందుకు అవకాశం కల్పించడం జరిగింది. మొదటగా పీఎం కిసాన్ లబ్ధిదారులకు రైతు రిజిస్ట్రీ నెంబర్లు {UNIQ FARMER ID} జారీ చేస్తారు. ఆ తర్వాత మిగిలిన భూ-యజమానులకు రైతు రిజిస్ట్రీ {UNIQ FARMER ID} నమోదు చేయడం జరుగుతుంది.

STEP-1 : ముందుగా రైతులు మీ దగ్గరలో ఉండే రైతు సేవా కేంద్రాలను సందర్శించాల్సి ఉంటుంది.
STEP-2 : రైతులు తమ వద్ద ఆధార్ కార్డు & ఆధార్ కార్డుకు లింక్ అయినా మొబైల్ ను తీసుకొని వెళ్లాల్సి ఉంటుంది.
STEP-3 : ముందుగా రైతు రిజిస్ట్రీ కోసం {UNIQ FARMER ID} AP Farmer Registry వెబ్సైట్ నందు వివరాలు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది.
STEP-4 : ఈ వెబ్సైట్ లాగిన్ లోకి వెళ్లి రైతు ఆధార్ నెంబర్ నమోదు చేసిన తర్వాత రైతు ఆధార్ నెంబర్ లింక్ అయినా మొబైల్ నెంబర్ కు OTP జనరేట్ అవ్వడం జరుగుతుంది.
STEP-5 : OTP జనరేట్ అయిన తర్వాత OTPని ఎంటర్ చేయాల్సి ఉంటుంది.
STEP-6 : తర్వాత రైతు మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. మొబైల్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత OTP జనరేట్ అవుతుంది. OTP వచ్చిన వెంటనే రెండోసారి OTPని ఎంటర్ చేయాల్సి ఉంటుంది.
STEP-7 : ఇప్పుడు మీ ముందు రైతు వివరాలు వెబ్సైట్లో కనిపిస్తాయి. తర్వాత రైతు యొక్క పొలం వివరాలు కనిపిస్తాయి.
STEP-8 : సర్వే నెంబర్లు సెలెక్ట్ చేసి సబ్మిట్ చేయంగానే రైతుకు మరోసారి OTP జనరేట్ అవుతుంది. OTPని ఎంటర్ చేసిన వెంటనే రైతుకు సంబంధించిన ఫార్మర్ రిజిస్ట్రీ నెంబర్ {UNIQ FARMER ID} జనరేట్ అవుతుంది.
STEP-9: ఈ రిజిస్ట్రీ నెంబర్ {UNIQ FARMER ID} రైతు మొబైల్ కు మెసేజ్ రూపంలో వెళ్లడంతో ఈ ప్రక్రియ పూర్తి అవుతుంది.

ప్రయోజనాలు:

  • రైతులకు రైతు రిజిస్ట్రీ నంబర్ నమోదు చేయడం ద్వారా చాలా ప్రయోజనాలు ఉన్నాయి.
  • ప్రతి రైతుకు జారీ చేసే ఈ యూనిట్ కోడ్ రైతు యొక్క పూర్తి వివరాలను తెలియజేస్తుంది.
  • రైతులకు సీజన్లో వచ్చే సబ్సిడీలు, రుణాలు, పంటల బీమా వంటి పథకాలను ఈ రిజిస్ట్రీ నెంబర్ కు అనుసంధానం చేయడం జరుగుతుంది.
  • కిసాన్ క్రెడిట్ కార్డు ద్వారా బ్యాంక్ అనుసంధానించిన ఆర్థిక సేవలను కూడా పొందవచ్చు.
  • రైతులు పండించిన పంటలకు కనీస మద్దతు ధర పొందేందుకు ఈ ఐడి ఉపకరిస్తుంది.
  • ఈ రిజిస్ట్రీ నంబర్ ద్వారా రైతులు దేశంలో ఎక్కడి నుంచైనా రుణాలు అర్హత, రుణ బకాయిలు, ప్రభుత్వ పథకాల డబ్బులు జమ వంటి వివరాలు వెంటనే తెలుసుకోవచ్చు.

రైతులకు విరివిగా రుణాలు ఇవ్వాలి

స్వర్ణాంధ్ర విజన్- 2047 బ్యాంకులు బాగా స్వాములు కావాలని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు గారు బ్యాంకర్ల సమావేశంలో మాట్లాడడం జరిగింది. బ్యాంకులు రైతులకు విరివిగా రుణాలు ఇవ్వాలని బ్యాంకర్ల సమావేశంలో అధికారులను చంద్రబాబునాయుడు గారు విజ్ఞప్తి చేశారు.

Leave a Comment