AP SC Corporation Loans 2025: Eligibility, Interest Rates& Application Process 

AP SC Corporation Loans 2025: Eligibility, Interest Rates& Application Process 

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం SC కులానికి చెందిన వారికి కార్పొరేషన్ ద్వారా రుణాలు ఇవ్వడానికి ఆన్లైన్ లో దరఖాస్తులను కోరుతుంది.ఈ కార్పొరేషన్ లోన్స్ పొందిన వారికి సబ్సిడీ కూడా లభించడం జరుగుతుంది.లోన్స్ కి సంభందించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.పూర్తి వివరాలు తెలుసుకుని అప్లికేషను ఇవ్వండి.

SC Corporation Loans & Subsidy Details 

SC Corporation Loans 2025 మూడు కేటగిరిలో అందించడం జరుగుతుంది.

  • 3 లక్షల లోపు రుణాలు 
  • 3 లక్షల పైగా రుణాలు 
  • 10 లక్షలు రుణాలు 

3 లక్షల లోపు రుణాలు:

3 లక్షల లోపు రుణాలు పొందాలంటే కచ్చితంగా కనీసము 1లక్ష రూపాయల నుంచి లోన్ పొందేందుకు దరఖాస్తు చేసుకోవాలి. ఈ వ్యాపారాల కొరకు మాత్రమే 3 లక్షల లోపు లోన్ వస్తుంది.ఇందులో 60%సబ్సిడీ ఉంటుంది.

Subsidy – 60%, Bank Loan-35% Beneficiary – 5%

  • పూల బొకే తయారీ అలంకరణ 
  • సేంద్రియ ఎరువులు & కంపోస్టింగ్ 
  • వెబ్సైట్ అభివృద్ధి & ఐటీ సేవలు 
  • lED బల్బ్స్ & శక్తి పొదుపు పరికరం అసెంబ్బ్లింగ్
  • ప్లంబింగ్ 
  • ఎలక్ట్రీషియన్ సేవలు 
  • నీటి బాటిల్స్ రీఫిల్ & శుద్ధికరణ 
  • నీటి రీసైక్లింగ్ &ఆఫ్ సైక్లింగ్ వ్యాపారం

3 లక్షల పైగా రుణాలు: 

మూడు లక్షల పైగా రుణాలు పొందాలనుకుంటే ఈ వ్యాపారాలకు మాత్రమే లోన్ అమౌంట్ వస్తుంది.ఇందులో 40%సబ్సిడీ ఉంటుంది.

Subsidy – 40%, Bank Loan-55% Beneficiary – 5%

  • మొబైల్ రిపేరింగ్ ఎలక్ట్రానిక్ సర్వీసెస్ 
  • సబ్బు & డిటర్జెంట్ తయారీ 
  • చేపల పెంపకం 
  • అడ్వెంచర్ టూరిజం 
  • మొబైల్ సర్వీసెస్ &కార్ వాష్ అండ్ సర్వీసెస్ 
  • బేకరీ 
  • సెరికల్చర్ 
  • RO ప్లాంట్ 
  • వెల్డింగ్ 
  • సోలార్ ఎనర్జీ ప్రొడక్ట్స్ సేల్స్ 
  • సోలార్ ప్యానెల్ అసెంబ్లింగ్ & ఇన్స్టాలేషన్ 
  • కొబ్బరి ఉత్పత్తుల తయారీ 
  • ఫోటోగ్రఫీ & వీడియోగ్రఫీ 
  • ఆయుర్వేద క్లినిక్ 
  • మెడిసిన్ స్టోర్ 
  • జనరిక్ మెడికల్ షాప్ 
  • బ్యూటీ పార్లర్ 
  • మెడికల్ ల్యాబ్ 

10 లక్షలు రుణాలు:

10 లక్షల రూపాయలు లోన్ పొందాలి అనుకున్న వాళ్లు ఈ యూనిట్ ఏర్పాటు కొరకు మాత్రమే అవకాశం ఉంది.ఇందులో 40%సబ్సిడీ ఉంటుంది.

Subsidy – 40%, Bank Loan-55% Beneficiary – 5%

  • EV బ్యాటరీ చార్జింగ్ యూనిట్ 

రవాణా సెక్టార్ :

వీటితోపాటు 3 లక్షల లోపు రుణాలు ద్వారా వాహనాలు కొనుగోలు చేసుకోవచ్చు.ఇందులో 50%సబ్సిడీ ఉంటుంది.

Subsidy – 50%, Bank Loan-45% Beneficiary – 5%

  • ప్యాసింజర్ ఆటో (3 వీలర్)
  • ప్యాసింజర్ ఆటో (4 వీలర్)
  • ప్యాసింజర్ కార్లు (4 వీలర్) 
  • గూడ్స్ ట్రక్

వ్యవసాయరంగం :

వ్యవసాయ రంగం లో 3 లక్షల వరకు లోన్ వస్తుంది.40% సబ్సిడీ ఉంటుంది.

  • డ్రోన్స్

Subsidy – 40%, Bank Loan-55% Beneficiary – 5%

Who Can Apply For SC Corporation Loans?

కింద తెలిపిన అర్హతలు ఉంటే సులువుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మీరు ఎస్సీ కార్పొరేషన్ లోన్ అందుకోవచ్చు. 

  • ఆంధ్రప్రదేశ్లో స్థిర నివాసి అయి ఉండాలి.
  • రేషన్ కార్డు కలిగి ఉండాలి.
  • 21 నుంచి 60 ఏళ్ల వయస్సు ఉండాలి.
  • ఆధార్ కార్డు తప్పనిసరిగా కలిగి ఉండాలి.
  • మొబైల్ నెంబర్ కలిగి ఉండాలి. 
  • చదువుతో సంబంధం లేదు. 
  • మెడికల్ షాప్ పెట్టాలనుకుంటే D ఫార్మసీ/B ఫార్మసీ/M ఫార్మసీ సర్టిఫికెట్లు ఉండాలి.

Required Dociuments For SC Corporation Loans 2025

  • క్యాస్ట్ సర్టిఫికెట్ 
  • రేషన్ కార్డు 
  • ఆధార్ కార్డు 
  • వాహనాలకు కొనుగోలుకు డ్రైవింగ్ లైసెన్స్ 
  • మొబైల్ నెంబర్ 
  • ఫార్మసీ సెక్టర్ కి సంబంధించి సర్టిఫికెట్లు 
  • బ్యాంక్ అకౌంట్ 

How To Apply For SC Corporation Loans 2025

SC Corporation Loans కి దరఖాస్తు చేయాలి అనుకున్న వాళ్లు. ఏప్రిల్ 11తేదీ నుంచి మే 20 తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా ఆన్లైన్ రిజిస్ట్రేషన్ల ప్రక్రియ జరుగుతుంది. మీ గ్రామ వార్డు సచివాలయంలో ఉన్నటువంటి DA/WEAS ద్వారా దరఖాస్తులు సమర్పించవచ్చు. 

Why Choose SC Corporation Loans in 2025?

రాష్ట్రవ్యాప్తంగా ఎస్సీ కులానికి చెందిన వారికి స్వయం ఉపాధి ఏర్పరచుకునేందుకు దాదాపు 50 శాతం సబ్సిడీతో అతి తక్కువ వడ్డీతో ప్రభుత్వం SC Corporation Loans ను అందించనుంది. కావున వ్యాపారం లేదా సొంత పనులు ప్రారంభించుకోవాలి అనుకునే వారికి ఇదొక చక్కని అవకాశం.

Leave a Comment