Aasha Worker Jobs Notification 2025|Aasha Worker jobs application pdf

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Aasha Worker Jobs Notification : ఆంధ్రప్రదేశ్ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ,నేషనల్ హెల్త్ మిషన్ నందు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది.ఈ ఉద్యోగ నోటిఫికేషన్ లో ఆశా కార్యకర్తల ఉద్యోగాల కొరకు జిల్లాల వారీగా దరఖాస్తుల స్వీకరణకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

అర్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తులను మీ దగ్గరలో ఉన్న గ్రామ వార్డు సచివాలయాల ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సిందిగా జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారులు తెలియజేయడం జరిగినది.పూర్తి వివరాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి.

ఉద్యోగం పేరుఆశా కార్యకర్తలు
వయస్సు25 – 45 సంవత్సరాల మధ్యలో ఉండాలి.
విద్యార్హత10 తరగతి పాస్ అయి ఉండాలి
వైవాహిక స్థితిపెళ్లి అయినవారు,వితంతువులు, విడాకులు పొందిన వారు,నిరాశ్రయులు అర్హులు.
దరఖాస్తు చేయు విధానంగ్రామ/వార్డు సచివాలయాల ద్వారా ఆన్లైన్లో దరఖాస్తులను చేయవచ్చు
ఎంపిక ప్రక్రియమెరిట్ ఆధారంగా
జీతం వివరాలుఅందుబాటులో లేవు

రాష్ట్రంలో వైద్య ఆరోగ్య శాఖ నందు జిల్లాల వారీగా ఆశ వర్కర్ల ఉద్యోగాలకు (Aasha Worker Jobs) నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగినది. ఈ ఉద్యోగాలకు సంబంధించిన ఖాళీల వివరాలు జిల్లాల వారీగా ఈ క్రింది విధంగా ఉన్నాయి. 

పల్లె ప్రాంతాలలో – 868

అటవీ ప్రాంతాలలో – 154

పట్టణ ప్రాంతాలలో – 272

  • అల్లూరి సీతారామరాజు -124
  • కోనసీమ – 79
  • చిత్తూరు – 69
  • విశాఖపట్నం – 69
  • పశ్చిమగోదావరి – 65
  • పల్నాడు – 63
  • ప్రకాశం – 63 
  • అనకాపల్లి – 61
  • ఎన్టీఆర్/అనంతపురం – 58
  • బాపట్ల & ఏలూరు – 55
  • వైయస్సార్ కడప – 55
  • శ్రీకాకుళం – 49
  • కర్నూల్ – 46 
  • కాకినాడ – 42
  • గుంటూరు – 37
  • పార్వతీపురం మన్యం – 34 
  • నంద్యాల – 31
  • తూర్పుగోదావరి – 30
  • తిరుపతి – 27 
  • కృష్ణ – 26
  • అన్నమయ్య – 19
  • నెల్లూరు – 16 
  • విజయనగరం – 15

అర్హతలు 

జిల్లా వైద్య ఆరోగ్య శాఖ నందు NHM పథకంలో ఆశా వర్కర్లుగా ఉద్యోగ (Aasha Worker Jobs) పొందుటకు ఉండవలసిన అర్హతలు ఈ క్రింది విధంగా ఉన్నాయి. 

  • మహిళలకు మాత్రమే అవకాశం. 
  • వితంతువులు, విడాకులు పొందిన వారు, ఒంటరి మహిళలు వీరికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వబడును.
  • మీ పంచాయతీ లేదా మీ గ్రామం పరిధిలో ఉద్యోగ ఖాళీ గనుక ఉండినట్లయితే మీరు ఆ ప్రాంతంలో తప్పనిసరిగా నివాసితులై ఉండాలి. 
  • అభ్యర్థులు 25 – 45 మధ్యలో వయస్సు కలిగి ఉండాలి. 
  • పదవ తరగతి పాసై ఉండాలి. 
  • తెలుగు చదవడం,రాయడం వచ్చి ఉండాలి.
  • ఆరోగ్యం, పరిశుభ్రత, గర్భిణీ స్త్రీల ఆరోగ్యము వంటి సమస్యలపై అవగాహన కలిగి ఉండాలి.

కావాల్సిన డాక్యుమెంట్స్ 

  • ఆధార్ కార్డు 
  • రేషన్ కార్డు 
  • నివాస ధ్రువీకరణ పత్రం 
  • బ్యాంకు పాసు పుస్తకం 
  • పదవ తరగతి సర్టిఫికెట్ 
  • వైవాహిక స్థితికి సంబంధించిన సొంత డిక్లరేషన్. 
  • పాస్పోర్ట్ సైజ్ ఫోటో 
  • పనిచేస్తున్న మొబైల్ నెంబర్ 

ముఖ్య తేదీలు 

  • దరఖాస్తులను ఈనెల 15 తేదీ నుంచి స్వీకరించుచున్నారు చివరి తేదీ June 30

దరఖాస్తు చేసుకునే విధానం 

మహిళా అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలి అనుకుంటే ఈ క్రింది విధంగా ప్రయత్నించండి.

  • ముందుగా మీ యొక్క పంచాయతీ లేదా గ్రామ పరిధి నందు ఉద్యోగం (Aasha Worker Jobs) ఉన్నదా లేదా తెలుసుకోవాలి.దీని కొరకు మీరు క్రింద ఇవ్వబడిన నోటిఫికేషను డౌన్లోడ్ చేసుకోండి.
  • ఉద్యోగ అవకాశం గనుక ఉండి నట్లయితే మీరు మీ యొక్క గ్రామ మరియు వార్డు సచివాలయం నందు దరఖాస్తును సమర్పించవచ్చును. 
  • దరఖాస్తు చేయుటకు ముందుగా మీరు దరఖాస్తు ఫారం ను సంబంధింత అధికారికి సమర్పించాల్సి ఉంటుంది. 
  • దరఖాస్తు ఫారం ను చివరన ఇవ్వడం జరిగింది.

ఎంపిక విధానం 

  • ముందుగా దరఖాస్తులను స్వీకరించి వాటిని పరిశీలన చేస్తారు. 
  • పరిశీలించిన దరఖాస్తులలో మెరిట్ ఆధారంగా అభ్యర్థులను గుర్తించడం జరుగుతుంది. 
  • ఎంపికైన అభ్యర్థుల యొక్క వివరాలను గ్రామ వార్డు సచివాలయములకు పంపించడం జరుగుతుంది.

జీతం వివరాలు

(Aasha Worker Jobs) ఉద్యోగాలకు ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం 10 వేల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది.

Leave a Comment