Free gas Cylinder 3rd phase|How to get Free gas cylinder: ఉచిత గ్యాస్ సిలిండర్ పథకాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము దీపం-2 పథకం ద్వారా ఆంధ్రప్రదేశ్లో గ్యాస్ సిలిండర్లు వినియోగిస్తున్న వారికి సంవత్సరానికి మూడు గ్యాస్ సిలిండర్ లను ఉచితంగా పంపిణీ చేయుచున్నది. మహిళలకు అక్టోబర్ 31 తేదీన 2024 సంవత్సరంలో దీపావళి సందర్భంగా ఈ పథకాన్ని ప్రారంభించారు. ఇప్పటివరకు 2 ఉచిత గ్యాస్ సిలిండర్ లను లబ్ధిదారులకు అందించారు.
పథకం పేరు | దీపం – 2 |
ప్రయోజనం | సంవత్సరానికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు |
లబ్ధిదారులు | అర్హులైన ఆంధ్రప్రదేశ్ నివాసితులు |
సబ్సిడీ | ₹835 + ₹25 (రాష్ట్రం + కేంద్రం) |
మార్గదర్శకం | DBT విధానంలో ఖాతాలకు జమ |
Table of Contents
పథకం ముఖ్య అంశాలు:
- అర్హులైన మహిళలకు సంవత్సరానికి మూడు దపాలుగా ఉచిత గ్యాస్ సిలిండలను అందజేయడం. ప్రతి నాలుగు నెలలకు ఒకసారి ఉచిత గ్యాస్ సిలిండర్ లను అందించడం.
- సూపర్ సిక్స్ పథకాలలో ఒక ముఖ్యమైన ప్రధాన అంశం ఈ దీపం-2 పథకం.
- మొత్తం ఈ పథకం ద్వారా సంవత్సరానికి ₹2,684 కోట్లు ప్రభుత్వం ఖర్చు చేయనున్నది.
ప్రయోజనం:
- ఈ ఉచిత గ్యాస్ సిలిండర్ ద్వారా ప్రస్తుతం 2 ఉచిత గ్యాస్ సిలిండర్లకు గాను మొదటగా లబ్ధిదారులు డబ్బులు చెల్లిస్తే Subsidy అమౌంట్ ఖాతాలకు చెల్లించేవారు.
- ఇందులో రాష్ట్ర వాటా ₹835 కేంద్రం వాటా ₹25 సబ్సిడీగా లబ్ధిదారుల యొక్క ఖాతాలకు చెల్లించేవారు.
- ప్రస్తుతం 3 గ్యాస్ సిలిండర్ నుంచి డబ్బులు చెల్లించకుండానే సబ్సిడీ మొత్తాలను బ్యాంకు ఖాతాలకు చెల్లిస్తామని అధికారులు చెప్తున్నారు.
ఉచిత గ్యాస్ సిలిండర్ పొందే విధానం:
- ముందుగా లబ్ధిదారులు గ్యాస్ కనెక్షన్ కొరకు దరఖాస్తు చేసుకోవాలి.
- దరఖాస్తు చేసుకొనుటకు ఈ రెండు మార్గాల ద్వారా అవకాశం
Meeseva ద్వారా
- మీకు దగ్గరలో ఉన్న మీసేవ కేంద్రాలకు వెళ్లి Ration కార్డుతో అప్లై చేయండి.
- ఆపరేటర్ మీ వివరాలను నమోదు చేసి అవసరమైన డాక్యుమెంట్స్ ని అప్లోడ్ చేస్తారు.
- చివరలో మీకు Acknowledge slip ఇస్తారు.
LPG గ్యాస్ Agency ద్వారా
- మీరు మీకు నచ్చిన గ్యాస్ ఏజెన్సీ ఆఫీస్ కి వెళ్లి డైరెక్టుగా వారు ఇచ్చే అప్లికేషన్ నింపి దరఖాస్తు చేసుకోవచ్చు.
- ఏజెన్సీ ఆపరేటర్ దగ్గర మీరు తగిన డాక్యుమెంట్స్ ఇవ్వాల్సి ఉంటుంది.
కావలసిన డాక్యుమెంట్స్
- ఆధార్ కార్డు
- తెల్ల రేషన్ కార్డ్
- బ్యాంకు ఖాతా వివరాలు
- Passport size ఫోటోలు
- మొబైల్ నెంబర్(ఆధార్ కి Link 🖇️ ఉండాలి)
అర్హతలు
- ఆంధ్రప్రదేశ్ నివాసితులకు మాత్రమే ఉచిత గ్యాస్ సిలిండర్.
- రేషన్ కార్డు కలిగిన వారికి మాత్రమే.
- గ్యాస్ కనెక్షన్ కలిగి ఉండాలి.
- గ్యాస్ కనెక్షన్ ఏజెన్సీ దగ్గర రేషన్ కార్డు, ఆధార్ కార్డు బ్యాంకు ఖాతా వివరాలు నమోదు చేసుకోవాలి.
Subsidy Amount checking Process
- మనమిత్ర వాట్సప్ కు Hi అని మెసేజ్ చేయండి.
- దయచేసి ఒక సేవను ఎంచుకోండి కానీ ఒక రిప్లై వస్తుంది.
- సేవను పెంచుకోండి అనే ఆప్షన్ ని క్లిక్ చేయండి.
- దీపం స్థితి Option ఎంచుకోండి.
- రేషన్ కార్డు నెంబర్ లేదా Lpg నంబర్ని ఎంటర్ చేయండి.
- నిర్ధారించండి అని ఆప్షన్ ని ఎంచుకోండి.
- మీ బ్యాంకు ఖాతా వివరాలు సబ్సిడీ పడిన వివరాలు ఓపెన్ అవుతాయి.
Offical website For Checking Subsidy Amount

పైన ఇమేజ్ లో చూపిన విధంగా మీకు గ్యాస్ సబ్సిడీ జమ అయినదా లేదా చూపించబడుతుంది.
తరచుగా అడిగే ప్రశ్నలు
గ్యాస్ సబ్సిడీ ఎంత అమౌంట్ పడుతుంది?
ప్రభుత్వము ఇచ్చే సబ్సిడీ గ్యాస్ యొక్క ధరపై ఆధారపడి ఉంటుంది. పైన ఇమేజ్ లో మీరు గమనించినట్లయితే మొదటి విడతలో ₹838 రెండవ విడతలు ₹888 రావడం జరిగింది.
గ్యాస్ సబ్సిడీ డబ్బులు పడకపోతే ఏం చేయాలి?
గ్యాస్ సబ్సిడీ డబ్బులు మీ ఖాతాలకు జమ కానప్పుడు మీరు మీ గ్యాస్ ఏజెన్సీ దగ్గరకు వెళ్లి ఆధార్ కార్డు రేషన్ కార్డు బ్యాంక్ అకౌంట్ వివరాలను అనుసంధానం చేయించుకోవాలి. ఇవన్నీ సక్రమంగా ఉన్నా కానీ NPCI లింక్ లేకపోవడం వల్ల కూడా మీ ఖాతాలకు సబ్సిడీ అమౌంట్ జమ కాదు.