Table of Contents
NPCI Aadhaar Bank Mapping: How to Check, Update & Change Bank Account Easily
NPCI Aadhaar Bank Mapping : ఇప్పటి రోజుల్లో మనం ఫోన్ ద్వారా డబ్బులు పంపడం, QR Code స్కాన్ చేసి చెల్లించడం, ATM నుండి డబ్బులు తీసుకోవడం, ప్రభుత్వ సబ్సిడీలు పొందడం ఇవన్నీ డిజిటల్‌గా జరుగుతున్నాయి.
కానీ ఈ మొత్తం వ్యవస్థను ఎవరు చూసుకుంటారు?
మన Payments Safe & Fast గా జరగడానికి ఎవరు బాధ్యత వహిస్తారు?
ఈ నేపథ్యంలో చాలా కీలకమైన సంస్థే NPCI.
NPCI Aadhaar Bank Mapping – What Is NPCI
NPCI (National Payments Corporation of India) అనేది భారతదేశంలో డిజిటల్ ట్రాన్సాక్షన్లను పర్యవేక్షించే లాభ రహిత సంస్థ.
2008లో RBI (Reserve Bank of India) మరియు IBA (Indian Banks Association) కలిసి NPCIని స్థాపించారు.
NPCI ప్రధానంగా పేమెంట్ సిస్టమ్స్‌ను అభివృద్ధి చేసి వాటిని సేఫ్‌గా, ఫాస్ట్‌గా, అందరికీ అందుబాటులో ఉండేలా చూసే సంస్థ.
NPCI వల్ల మనం ఇప్పుడు ఉపయోగిస్తున్న ముఖ్యమైన సేవలు:
| Services | Explanation |
|---|---|
| UPI | PhonePe, Google Pay, Paytm లాంటి యాప్‌ల ద్వారా Instant Money Transfer |
| RuPay Card | భారతదేశం లోనే తయారైన డెబిట్ కార్డ్ |
| IMPS | 24/7 నేరుగా బ్యాంక్ అకౌంట్‌కు మనీ ట్రాన్స్ఫర్ |
| AEPS | Aadhaar ఆధారంగా డబ్బులు తీసుకోవడం & బ్యాలెన్స్ చెక్ |
| NACH | Gas Subsidies, Pensions, Scholarships లాంటి Government DBT Payments |
అంటే మనమిప్పుడు రోజూ వాడుతున్న Payments అన్నీ NPCI వల్లే జరుగుతున్నాయి.
What Is NPCI Mpping
NPCI Mapping అంటే మీ Aadhaar ఏ బ్యాంక్ అకౌంట్‌కు కనెక్ట్ అయి ఉందో రిజిస్ట్రేషన్ చేయడం.
ఇది ముఖ్యంగా DBT (Direct Benefit Transfer) పథకాల కోసం ఉపయోగపడుతుంది.
Examples
- గ్యాస్ సబ్సిడీ
- రైతు బంధు, PM-Kisan వంటి వ్యవసాయ సాయం
- పెన్షన్
- స్కాలర్షిప్లు
ఇవి అన్నీ మీ Aadhaar ద్వారా మీ బ్యాంక్ అకౌంట్‌కి వస్తాయి.
కాబట్టి Aadhaar NPCI లో సరైన బ్యాంక్‌తో లింక్ అయి ఉండడం చాలా ముఖ్యము.

How To Check Bank Mapping/Seeding Status
కొన్ని సార్లు సబ్సిడీ లేదా DBT మీ బ్యాంక్‌కు రాకపోవడానికి కారణం NPCI Mapping లో సమస్య కావచ్చు.
ఆందుకు ముందుగా మీ Aadhaar ఏ బ్యాంక్‌కి లింక్ అయి ఉందో చెక్ చేయాలి.
How To Check In Mobile
- మీ మొబైల్లో Dial చేయండి:
*99*99# - మీ Aadhaar నంబర్ ఎంటర్ చేయండి.
- స్క్రీన్‌పై మీ Aadhaar ఏ బ్యాంక్‌కి మ్యాప్ అయిందో చూపిస్తుంది.
How To Check Through UIDAI Website
- వెబ్సైట్ ఓపెన్ చేయండి.
- Aadhaar-Bank Linking Status ని సెలెక్ట్ చేయండి
- OTP ద్వారా వెరిఫై చేసి స్టేటస్ తెలుసుకోండి.
How To Link Bank Account To Aadhar
Aadhaar ఇంకా బ్యాంక్‌కి లింక్ కాలేదా?లేదా కొత్త అకౌంట్‌కి లింక్ చేయాలనుకుంటున్నారా?
అయితే ఈ విధానాల్లో ఏదైనా Follow చేయండి:
Through Branch
- Aadhaar కాపీ
- బ్యాంక్ పాస్‌బుక్
- మొబైల్ నంబర్
- Aadhaar Seeding Form
సమర్పిస్తే 24-72 గంటల్లో లింక్ అవుతుంది.
Through Your Net Banking App
- యాప్ → Service Requests → Aadhaar Seeding → Submit
How To Change Mapping One Account To Another Account
ఇది చాలా మందికి వచ్చే డౌట్.
ఉదాహరణకు, మీరు PM-Kisan సాయం ఇంకో బ్యాంక్‌కి రావాలని అనుకుంటే లేదా పాత బ్యాంక్ అకౌంట్ పనిచేయకపోతే ఈ స్టెప్స్ Follow చేయాలి.
- మీ Aadhaar ని కొత్త బ్యాంక్ బ్రాంచ్‌కి వెళ్లి లింక్ చేయండి.
- స్టాఫ్‌కి NPCI Mapping Update లేదా DBT Seeding చేయమని చెప్పండి.
- 24–48 గంటల్లో మ్యాపింగ్ కొత్త బ్యాంక్‌కి మారుతుంది.
Important Note:
Aadhaar ఒకేసారి ఒకే బ్యాంక్‌లో మాత్రమే NPCI కు మాపింగ్ అవుతుంది.అంటే Subsidy లేదా Government Money ఒక్క అకౌంట్‌కి మాత్రమే వస్తుంది.
How To Link UPI
UPI కూడా మీ బ్యాంక్ అకౌంట్‌కి Direct గా కనెక్ట్ అవుతుంది.
- UPI యాప్ ఓపెన్ చేయండి (PhonePe / GPay / Paytm)
- మీ మొబైల్ నంబర్ SIM Select చేయండి
- OTP ద్వారా Verify చేయండి
- బ్యాంక్ అకౌంట్ ఆటోమేటిక్‌గా డిటెక్ట్ అవుతుంది
అందుకే UPI కోసం Aadhaar అవసరం లేదు, కానీ DBT కోసం అవసరం.
| Service | Explination |
|---|---|
| UPI Limit | రోజుకు బ్యాంక్ ఆధారంగా ₹1,00,000 – ₹5,00,000 వరకు పంపొచ్చు |
| RuPay Cards | అంతర్జాతీయంగా కూడా ఇప్పుడు ఉపయోగించొచ్చు |
| AEPS | గ్రామాల్లో కూడా Aadhaar Fingerprint తో డబ్బులు తీసుకోవచ్చు |
| DBT Fail అవ్వడానికి కారణాలు | NPCI Mapping తప్పు • Bank Account Inactive • Aadhaar Seeding లేదు |
- NPCI భారతదేశం మొత్తం డిజిటల్ పేమెంట్ వ్యవస్థను నడిపించే ముఖ్య సంస్థ.
- Aadhaar ని సరైన బ్యాంక్ అకౌంట్‌కి లింక్ చేయడం చాలా ముఖ్యం.
- NPCI Mapping తప్పుగా ఉంటే DBT, Subsidy, Pension లలో సమస్యలు వస్తాయి.
- అవసరమైతే మీరు మీ మాపింగ్ను కొత్త బ్యాంక్‌కి సులభంగా మార్చుకోవచ్చు.
NPCI Aadhaar Bank Mapping అనేది మన బ్యాంక్ అకౌంట్‌కు ప్రభుత్వం నుండి వచ్చే సబ్సిడీలు, పథకాల డబ్బులు, పెన్షన్, స్కాలర్షిప్లు సరిగ్గా చేరడానికి చాలా ముఖ్యమైన వ్యవస్థ. మన Aadhaar ఏ బ్యాంక్ అకౌంట్‌కి లింక్ అయి ఉందో తెలుసుకోవడం, అవసరమైతే దాన్ని మార్చుకోవడం ప్రతి ఒక్కరికి తెలుసు ఉండాలి. ఎందుకంటే Aadhaar ఒకేసారి ఒకే బ్యాంక్ అకౌంట్‌తోనే NPCI Mapping అవుతుంది. పాత బ్యాంక్ అకౌంట్ పని చేయకపోతే లేదా కొత్త అకౌంట్ వాడాలనుకుంటే, సులభంగా బ్రాంచ్‌లో ఫారం ఇచ్చి Mapping Update చేసుకోవచ్చు.
ఈ ప్రక్రియను అర్థం చేసుకున్నాక సబ్సిడీలు ఆలస్యం అవడం, DBT ఫెయిల్ అవడం వంటి సమస్యలు పూర్తిగా దూరమవుతాయి. కాబట్టి మీ NPCI Mapping స్టేటస్‌ను చెక్ చేసుకుని, అవసరమైనచోట అప్డేట్ చేసుకోండి.
| UIDAI Offlicial Website | Click Here |
| NPCI Official Website | Click Here |
- NPCI Aadhaar Bank Mapping: How to Check, Update & Change Bank Account Easily – 2025
- AP November Pensions Update 2025: Distribution Date Changes, Pension Cancel List & Sadarem Slot Booking Details
- PM Shram Yogi Mandhan 2025 – ₹3,000 Monthly Pension for Unorganized Workers
- AP PMAY-G Survey Extension 2025 | Awaas+ 2024 Last Date Extended
- APSRTC ITI Apprenticeship 2025 – Apply Online for 277 Vacancies | Complete Guide & Dates




