ఏపీలో సార్వత్రిక ఎన్నికల అనంతరం తెలుగుదేశం మరియు జనసేన ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత పెన్షన్ పెంచుతామని హామీని ఇవ్వడం జరిగింది.అనుకున్నట్లు గానే పెన్షన్ ని పెంచి ఇచ్చింది కూటమి ప్రభుత్వం.
Table of Contents
పధకం పేరు | పెన్షన్ కానుక |
రాష్ట్రము | ఆంధ్రప్రదేశ్ |
అర్హులు | వృద్ధాప్య,వితంతువులు,చేనేత కార్మికులు,కల్లుగీత కార్మికులు,మత్స్యకారులు,ఒంటరి మహిళలు, సాంప్రదాయ చెప్పులు..etc |
ప్రయోజనం | 4,000 (6,000) వికలాంగులకు |
దరఖాస్తు చేయు విధానం | offline మోడ్ |
అధికారిక వెబ్సైటు | ఇంకా అందుబాటులోకి రాలేదు |
ఏపీ ప్రభుత్వం ద్వారా పెన్షన్ లబ్ధిదారులు
- వృద్ధాప్య,వితంతువులు,చేనేత కార్మికులు,కల్లుగీత కార్మికులు,మత్స్యకారులు,ఒంటరి మహిళలు, సాంప్రదాయ చెప్పులు కుట్టేవారు.
- వికలాంగులు దివ్యాంగులు
- డయాలసిస్ ఉన్న వ్యక్తులు
- వృద్ధాప్య ,చేనేత, మత్స్యకారులు,వికలాంగులు కేటగిరికి సంబంధించిన పింఛన్దారులు మరణిస్తే కుటుంబాన్ని పోషించేందుకు జీవిత భాగస్వామికి పెన్షన్ మంజూరు చేయబడుతుంది.
ప్రభుత్వ పెన్షన్ పొందేందుకు అర్హతలు
- మొత్తం కుటుంబ ఆదాయం గ్రామీణ ప్రాంతాల్లో నెలకు పదివేలు మరియు పట్టణ ప్రాంతాల్లో నెలకు 12,000 కంటే తక్కువగా ఉండాలి.
- కుటుంబానికి నాలుగు చక్రాల వాహనం ఉండకూడదు.
- కుటుంబం యొక్క మొత్తం భూమి 3 ఎకరాల తడి 10 ఎకరాల పొడి రెండు కలిపి 10 ఎకరాల కంటే తక్కువగా ఉండాలి.
- కుటుంబంలో సభ్యులు ఎవరు ప్రభుత్వ ఉద్యోగి అయి ఉండకూడదు.
- నెలవారి విద్యుత్ వినియోగం 3 యూనిట్లు కంటే తక్కువగా ఉండాలి.
- 750 చదరపు అడుగుల కంటే ఏరియా కలిగి ఉన్న మున్సిపల్ ప్రాంతాల్లోని కుటుంబం మాత్రమే అర్హులు.
- కుటుంబం సభ్యులు ఎవరూ కూడా ఆదాయపు పన్ను చెల్లించకూడదు.
50 సంవత్సరాలు పూర్తయితేనే పెన్షన్ వస్తుంది
SC,ST,మైనార్టీలకు కూడా వస్తుంది.
దరఖాస్తు ప్రక్రియ
- గ్రామ సచివాలయం ద్వారా పెన్షన్ కి దరఖాస్తు చేసుకోవచ్చు.
- గ్రామ సచివాలయం వెల్ఫేర్ అసిస్టెంట్ ద్వారా కూడా దరఖాస్తు చేయవచ్చు.
డౌన్లోడ్ అప్లికేషను ఫారం
అవసరమైన పత్రాలు
- ఆధార్ కార్డు
- వితంతువులయితే భర్త మరణ ధ్రువీకరణ పత్రాలు
- వైకల్యం కలిగిన సర్టిఫికెట్
- వీవర్స్ సర్టిఫికేట్
- కుల ధ్రువీకరణ పత్రం
- వయస్సు పుట్టిన తేదీ రుజువు
- వివాహ ధ్రువీకరణ పత్రం
- మెడికల్ బోర్డు సర్టిఫికెట్
- లింగ గుర్తింపు ధ్రువీకరణ పత్రం
- ఫిషరీస్ శాఖ నుంచి సర్టిఫికెట్