Talliki Vandanam Payment Staus: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒకటవ తరగతి నుంచి ఇంటర్మీడియట్ రెండవ సంవత్సరం వరకు చదువుతున్నటువంటి విద్యార్థులకు తల్లికి వందనం Talliki Vandhanam Payment స్టేటస్ పథకానికి సంబంధించిన నిధులను ప్రభుత్వం జమ చేయడం జరిగినది.2025-2026 విద్యా సంవత్సరానికి సంబంధించిన తల్లికి వందనం పేమెంట్ విద్యార్థుల యొక్క తల్లి ఖాతాలకు జమ కావడం జరిగింది.అయితే ఈ Payment ఎలా తెలుసుకోవాలి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం.
తల్లికి వందనం పేమెంట్ 15000/- లో 2000/- పాటశాల,కళాశాల మరమత్తులకు విరమించుకుని మిగిలిన 13,000 మాత్రమే ఖాతాలకు జమ చేయడం జరిగినది.ఇంట్లో ఎంతమంది చదువుతూ ఉంటే అంతమందికి నిధులు విడుదల చేయడం జరిగినది.ఇంట్లో 2 ఉంటే ఇద్దరికీ కలిపి 26,000 జమ అయ్యింది.3 ఉంటే 39,000 జమ అయినది.
తల్లికి వందనం పథకానికి సంబంధించిన పేమెంట్ను 2 విధాలుగా తెలుసుకోవచ్చు.
- NBM పోర్టల్
- Whatsapp governance (వాట్సాప్ మనమిత్ర)
Table of Contents
NBM పోర్టల్ ద్వారా చెకింగ్
తల్లి యొక్క ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి Talliki Vandanam Payment వివరాలను మీ మొబైల్ లోనే తెలుసుకోవచ్చు.ఈ క్రింద చెప్పిన విధంగా ప్రయత్నించండి.
గమనిక: మీరు మొబైల్ ద్వారా పేమెంట్ స్టేటస్ తెలుసుకోవాలనుకుంటే ముందుగా మీ మొబైల్ లోనే Google Crome ఓపెన్ చేసి Desktop site ఆన్ లో ఉంటే ఆఫ్ చేసి ప్రయత్నించండి.ఈ NBM Portal Link లింకు మీద క్లిక్ చెయ్యండి
👆పైన చూపిన విధంగా ఆఫ్ చేయండి.
👆పైన చూపిన విధంగా ముందుగా తల్లికి వందనం స్కీం ఎంచుకోండి.
👆పైన చూపిన విధంగా 2025-2026 విద్యా సంవత్సరాన్ని ఎంచుకోండి.
👆పైన చూపిన విధంగా తల్లి యొక్క ఆధార్ నెంబర్ను ఎంటర్ చేయండి.
👆పైన చూపిన విధంగా రెడ్ కలర్ లో ఉన్న నెంబర్ను ఎంటర్ Captcha లో ఎంటర్ చేయండి.
👆పైన చూపిన విధంగా Get OTP అనే ఆప్షన్ ఎంచుకోగానే మీకు ఈ విధంగా మెసేజ్ రావడం జరుగుతుంది.Ok పైన క్లిక్ చేయండి. ఇప్పుడు మీ తల్లి ఆధార్ కి లింక్ అయి ఉన్న మొబైల్ నెంబర్ కి OTP వెళ్తుంది.
మీ మొబైల్ కి వచ్చిన OTP Verify చేసుకోమని మీకు మెసేజ్ వస్తుంది.👆పైన చూపిన విధంగా.OK పైన క్లిక్ చేసి వెరిఫై చేసిన తర్వాత మీకు వివరాలు వస్తాయి.
👆పైన చెప్పిన విధంగా వివరాలు వస్తాయి మీరు గమనించినట్లయితే పేమెంట్ డీటెయిల్స్ నందు స్టేటస్ నందు బ్యాంకు పేరు, రీమార్క్స్ నందు అకౌంట్ వివరాలు చూపిస్తాయి.
Whatsapp Governance ద్వారా చెకింగ్
Whatsapp Governance వాట్సాప్ మనమిత్ర ద్వారా తల్లికి వందనం పేమెంట్ అలా చెక్ చేసుకోవాలో ఈ క్రింద విధంగా చెప్పిన విధంగా ప్రయత్నించండి.
మనమిత్ర వాట్సాప్ గవర్నమెంట్ ద్వారా మీరు తల్లికి వందనం పేమెంట్ తెలుసుకోవాలనుకుంటే ముందుగా మీ మొబైల్ లో మనమిత్ర వాట్సాప్ గవర్నమెంట్ నెంబర్ ఉండాలి.
9552300009 ఈ నెంబర్ సేవ్ చేసుకోండి.
👆పైన చూపిన విధంగా HI అని మెసేజ్ ని Send చేయండి
HI అది మెసేజ్ Send చేసిన తర్వాత మీకు Reply 👆పైన చెప్పిన విధంగా సేవను ఎంచుకోండి అని వస్తుంది. సేవను ఎంచుకోండి పైన Click చేయండి.
దయచేసి ఒక సేవను ఎంచుకోండి అని ఒక మెసేజ్ వస్తుంది 👆దానిపైన క్లిక్ చేయండి
👆పైన చూపిన విధంగా తల్లికి వందనం పథకాన్ని ఎంచుకోండి.
👆పైన చూపిన విధంగా తల్లికి వందనం 2025 స్థితిని సెలెక్ట్ చేసుకోండి
👆పైన చూపిన విధంగా తల్లి ఆధార్ నెంబర్ను నమోదు చేయండి.
👆పైన చూపిన విధంగా తల్లి యొక్క ఆధార్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత నిర్ధారించండి మీద క్లిక్ చేయండి.
ఇక్కడితో తల్లికి వందనం పేమెంటు చూసుకునే విధానం పూర్తవుతుంది.
Talliki Vandhanam 2nd Phase Amount
తల్లికి వందనం పథకానికి సంబంధించి 2 విడత పేమెంట్ July 5 తేదీన ప్రభుత్వం విడుదల చేయనుంది. వీరికి మాత్రమే అమౌంట్ విడుదలవుతుంది.
- 2025-26 విద్యా సంవత్సరంలో 1తరగతిలో చేరిన పిల్లలు.
- పదవ తరగతి పూర్తి చేసుకుని Inter మొదటి సంవత్సరంలో చేరిన పిల్లలు.
- మొదటి విడత పేమెంట్ విడుదల అయినప్పుడు అమౌంట్ పడని వారికి అవకాశం
తల్లికి వందనం పేమెంట్ రాకపోవడానికి గల కారణాలు
- విద్యార్థికి 75% హాజరు లేకపోవడం
- విద్యార్థి యొక్క తల్లి బ్యాంకు ఖాతాలకు NPCI లింక్ లేకపోవడం.
- విద్యార్థి ఇంటర్మీడియట్ పూర్తయిపోయి ఉండడం
- 2025-26 విద్యా సంవత్సరంలో విద్యార్థి పదవ తరగతి పూర్తి చేసుకుని డిప్లమా/పాలిటెక్నిక్ జాయిన్ అవ్వడం.
- కుటుంబం విద్యుత్ వినియోగం 12 నెలల సరాసరి 300 యూనిట్లకు మించి ఉండడం.
- కుటుంబంలో ప్రభుత్వ ఉద్యోగి ఉండడం.
- కుటుంబంలో ఆదాయపు పన్ను చెల్లించువారు ఉండడం..
- కుటుంబంలో సభ్యులకు నాలుగు చక్రాల వాహనం కారు కలిగి ఉండడం.
- కుటుంబంలో సభ్యులు ప్రభుత్వ ఉద్యోగం చేసి రిటైర్ అయ్యి పెన్షన్ పొందుతున్న వారు కలిగి ఉండడం.