Nirudhyoga Bruthi Scheme – 2025 : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నిరుద్యోగ యువతకు కూటమి ప్రభుత్వం నిరుద్యోగ భృతి కొత్త పథకాన్ని అమలులోకి తీసుకురానుంది.
విద్యను పూర్తి చేసుకొని ఉపాధి అవకాశాలు లేక ఖాళీగా ఉంటున్న నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడంతోపాటు ప్రతి నెల కూడా 3000 రూపాయలను వారి యొక్క ఖాతాలకు జమ చేయనుంది. ఈ పథకానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం.
ఈ ఏడాదిలోని నిరుద్యోగ భృతి పథకం (Nirudhyoga Bruthi Scheme): విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ గారు నిరుద్యోగ భృతి పథకాన్ని ఈ ఏడాదిలోనే నిరుద్యోగ యువతకు అందిస్తామని ప్రకటించారు. నిరుద్యోగ భృతి తో పాటు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉండే ఐదు సంవత్సరాలలో 20 లక్షల ఉద్యోగ అవకాశాలను కల్పిస్తామని హామీ ఇచ్చారు.
Table of Contents
పధకం పేరు | నిరుద్యోగ భృతి |
ప్రయోజనం | నిరుద్యోగులకు నెలకు 3,000/- |
ప్రధాన లక్ష్యం | 20 లక్షల ఉద్యోగాలు కల్పన |
అర్హులు | ఆంద్రప్రదేశ్ నిరుద్యోగ యువత |
విద్యార్హత | డిగ్రీ /డిప్లొమా చేసినవారు |
Webpage | ఇంకా అందుబాటులోకి రాలేదు |
అప్లికేషన్ విధానం | గ్రామ/వార్డ్ సచివాలయం లేదా మీసేవ కేంద్రాలు |
Eligibility
నిరుద్యోగ భృతి పథకానికి (Nirudhyoga Bruthi Scheme)సంబంధించి నిరుద్యోగ యువతకు ఉండవలసిన అర్హతలు ఈ క్రింది విధంగా ఉన్నవి.
- నిరుద్యోగ భృతి పథకానికి సంబంధించిన లబ్ధిదారులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నివాసితులై ఉండాలి.
- లబ్ధిదారుని వయస్సు 22 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాల మధ్యలో ఉండాలి.
- డిగ్రీ పూర్తి చేసుకున్న నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి పథకానికి సంబంధించిన ₹3,000 జమవుతాయి.
- నిరుద్యోగ లబ్ధిదారుడు తప్పనిసరిగా BPL/రేషన్ కార్డు కలిగి ఉండాలి.
- లబ్ధిదారుని కుటుంబంలో సభ్యులు ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ ఉండకూడదు.
- లబ్ధిదారుని కుటుంబం భూమి 3 ఎకరాలు మాగాణి/7 ఎకరాలు మెట్ట భూమి మించి ఉండకూడదు.
- లబ్ధిదారుడు విద్యను అభ్యసించిన తర్వాత ఎటువంటి ప్రైవేట్ సంస్థల్లో/ప్రభుత్వ సంస్థల్లో పని చేసి ఉండకూడదు.
- విద్య పూర్తి చేసుకున్న తర్వాత ప్రభుత్వ ఉద్యోగాలకు పోటీ పడినవారు/కాంపిటీటివ్ పరీక్షలు రాసిన వారు అర్హులు.
- PF అకౌంట్ లేనివారు అర్హులు.
Require Documents
- ఆధార్ కార్డు
- రేషన్ కార్డు
- కులదృవీకరణ పత్రం
- విద్యా అర్హత కలిగిన సర్టిఫికెట్ (Degre Certificate)
- పాస్పోర్ట్ సైజ్ ఫోటో
- నివాస ధ్రువీకరణ పత్రం
- పనిచేస్తున్న మొబైల్ నెంబర్
- నిరుద్యోగ దృవీకరణ పత్రం
- బ్యాంక్ పాస్ బుక్
Application Process
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము నిరుద్యోగ భృతి పథకానికి (Nirudhyoga Bruthi Scheme)సంబంధించిన దరఖాస్తులను Online లేదా Offline విధానంలో దరఖాస్తులను స్వీకరించవచ్చు.
- On-line దరఖాస్తుల స్వీకరణకు గ్రామ/వార్డు సచివాలయం లేదా మీసేవ కేంద్రాల ద్వారా దరఖాస్తులకు అవకాశము ఇవ్వవచ్చు.
- Off-Line విధానంలో దరఖాస్తులను స్వీకరించుటకు కేవలం గ్రామ వార్డు సచివాలయంలో ఉన్నటువంటి డిజిటల్ అసిస్టెంట్ అధికారి వద్ద అప్లికేషన్ ఫారం ద్వారా దరఖాస్తులను స్వీకరించవచ్చు.
గమనిక:దరఖాస్తుల స్వీకరణకు సంబంధించిన తేదీని ప్రభుత్వము ఇంకా ప్రకటించలేదు.
Benefits
నిరుద్యోగ భృతి పథకానికి (Nirudhyoga Bruthi Scheme)సంబంధించి ప్రతినెల నిరుద్యోగ యువత ₹3,000 అందించడంతోపాటు వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించడం ప్రధాన లక్ష్యంగా ఉంది.
- ప్రతినెల నిరుద్యోగులకు ₹3,000.
- నిరుద్యోగ యువతకు ప్రైవేటు కంపెనీల ద్వారా ఉద్యోగ అవకాశాలను కల్పించడం.
- 20 లక్షల ఉద్యోగాలను కల్పించడం.
Related Question
నిరుద్యోగ భృతి ఇంటిలో ఆందరికి వస్తుందా ?
నిరుద్యోగ భృతి ఇంటిలో ఒకరికి మాత్రమే అవకాశం ఇవ్వవచ్చు. ఎందుకంటే ఇంట్లో అందరికీ ఇవ్వాలంటే చాలా ఖర్చు తో కూడిన పధకం గా మారవచ్చు.
నిరుద్యోగ భృతి Application ఎప్పటి నుంచి ప్రారంభం?
నిరుద్యోగ భృతి పధకం ఈ ఏడాదిలో ప్రారంభిస్తాం అని నారా లోకేష్ గారు ప్రకటించారు. అసలైన తేదీ వివరాలు ఇంకా అందుబాటులోకి రాలేదు.
For more updates Join Our telegram Channel 👉 Telegram Link