AP Spouse Pensions:Eligibility,Application Process in Telugu:Ap ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన Spouse Pensions కి అప్లికేషన్ చేసుకునే విధానం,కావలసిన డాక్యుమెంట్స్ పూర్తి వివరాలు క్రింద ఇవ్వబడిన అంశాల ద్వారా మీరు తెలుసుకోవచ్చు.
Table of Contents
Spouse pensions Overview
Spouse Pensions అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా పింఛన్ పొందుతున్నటువంటి మగవారు మరణించినప్పుడు వారి యొక్క భార్యకు పింఛన్ ఇచ్చే కేటగిరీని Spouse pensions అని అంటారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ క్యాటగిరీ పింఛన్లను నవంబర్ 2024 నుంచి అందుబాటులోకి తీసుకువచ్చింది.
పథకం పేరు | NTR bharosa pension scheme |
కేటగిరి | Spouse Pensions |
ప్రయోజనం | ప్రతి నెల 4,000 పింఛను |
అర్హులు | పింఛను పొందుతూ భర్త మరణించిన స్త్రీలు |
అప్లికేషన్ చేయువిధానం | గ్రామ/వార్డ్ సచివాలయం ద్వారా చేయవచ్చు |
Website లింకు | వెబ్సైట్ లింకు |
Spouse Pensions అర్హులు
ఏపీ ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన Spouse Pensions కి అర్హులు ఈ క్రింద తెలుపబడిన అంశాలు కలిగి ఉండాలి.
- Spouse Pensions పొందాలంటే భర్త ఏపీ ప్రభుత్వం ద్వారా పింఛన్ పొందుతూ ఉండి మరణించి ఉండాలి.
- మహిళలకు మాత్రమే Spouse Pensions.
- ఆంధ్రప్రదేశ్లో నివసిస్తూ ఉండాలి.
- రేషన్ కార్డు కలిగి ఉండాలి.
- ప్రభుత్వ ఉద్యోగి అయి ఉండకూడదు. కుటుంబంలో (రేషన్ కార్డులో) సభ్యులు ఎవరూ కూడా ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ ఉండకూడదు.
- కుటుంబంలో సభ్యులు ఆదాయపు పన్ను చెల్లింపుధారు అయి ఉండకూడదు.
- విద్యుత్ వినియోగం 12 నెలల సరాసరి 300 యూనిట్లు మించి ఉండకూడదు.
- భూమి మాగాని 3 ఎకరాలు/మెట్ట 7 ఎకరాలు మించి ఉండకూడదు.
- పట్టణ ప్రాంతాల్లో 1000 చదరపు అడుగుల విస్తీర్ణం కలిగిన స్థలం ఉండకూడదు.
- భర్త మరణించిన తర్వాత వేరొకరితో వివాహం చేసుకున్నవారు దరఖాస్తు చేసుకోకూడదు.
కావాల్సిన డాక్యుమెంట్స్
Spouse Pensions కి దరఖాస్తు చేసుకోవాలనుకుంటే ఈ డాక్యుమెంట్స్ తప్పనిసరిగా ఉండాలి.
- ఆధార్ కార్డు
- రేషన్ కార్డు
- భర్త మరణించిన ధృవీకరణ పత్రం
- పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు
- పనిచేస్తున్న మొబైల్ నెంబర్
- భర్త పింఛను ఐడి
- కుల ధ్రువీకరణ పత్రం
ధరఖాస్తు ఫారం
దరఖాస్తు ఫారం ను మీ గ్రామ/వార్డు సచివాలయంలో ఉన్నటువంటి డిజిటల్ అధికారి/వెల్ఫేర్ అధికారి ఇస్తారు.దరఖాస్తు ఫారం లో అడిగిన వివరాలను పూర్తిగా రాసి వాటితో పాటు డాక్యుమెంట్స్ ను ఇవ్వాల్సి ఉంటుంది.
దరఖాస్తు చేసుకునే విధానం
Spouse pensions కి దరఖాస్తు చేసుకోవాలనుకుంటే మీరు గ్రామ వార్డు సచివాలయంలో ఉన్నటువంటి వెల్ఫేర్ అధికారి/డిజిటల్ అసిస్టెంట్ వారి వద్దకు వెళ్లి దరఖాస్తును చేసుకోవచ్చు.
- ముందుగా అప్లికేషన్ ఫారం ను నింపాలి.
- నింపిన అప్లికేషన్ ఫామ్ తో పాటు పైన తెలిపిన డాక్యుమెంట్స్ జిరాక్స్ అటాచ్ చేయాలి.
- అప్లికేషన్ ఫారం, డాక్యుమెంట్ జిరాక్స్ మీ సచివాలయం వెల్ఫేర్ అధికారి/డిజిటల్ అసిస్టెంట్ గారికి ఇవ్వాలి.
- అధికారులు వారి యొక్క లాగిన్ ద్వారా Spouse pensions కి దరఖాస్తు చేస్తారు.
- మీ మొబైల్ నెంబర్ కి OTP ద్వారా మీ దరఖాస్తులను పూర్తి చేస్తారు.
ప్రయోజనం
Spouse pensions ద్వారా భర్త పింఛన్ పొందుతూ మరణిస్తే వారి భార్యలకు పింఛన్ పొందే అవకాశం ఉంటుంది. కేవలం 25 రోజుల వ్యవధిలో ప్రభుత్వం ద్వారా మీరు అర్హులు అయితే పింఛన్ ₹4,000 పొందవచ్చు.
- ప్రతినెల 1 తేదీన పింఛను సచివాలయం అధికారులు ఇంటికి వచ్చి ఇవ్వడం జరుగుతుంది.
- మీరు గత నెలలో Spouse Pensions కి దరఖాస్తు చేసుకొని ఉండినట్లయితే మీ వివరాలను పరిశీలన చేసి మీరు అర్హులైతే మీకు పింఛన్ మంజూరు పత్రంతో పాటు పింఛను నగదు ₹4,000 రూపాయలు వచ్చే నెలలో ఇస్తారు.Example (మీరు జనవరిలో దరఖాస్తు చేసుకుంటే ఫిబ్రవరి నెలలో పింఛను వస్తుంది)
కొత్తగా సర్వే
తాజాగా కూటమి ప్రభుత్వం ఈ Spouse Pensions కేటగిరీ లోకి 2019 నుంచి నవంబర్ 2024 మధ్యలో అర్హులైన వారి యొక్క వివరాల సేకరణకు సర్వే నిర్వహించబోతున్నవి.ఈ సర్వేలో ఎవరిని ఎంపిక చేయబోతున్నారో గుర్తు వివరాలు తెలుసుకుందాం రండి.
- 2019 నుంచి నవంబర్ నెల 2024 మధ్యలో పింఛన్ పొందుతూ మరణించిన మగవారి లిస్టు ప్రభుత్వము వెరిఫికేషన్ చేయబోతుంది.
- ఈ వెరిఫికేషన్ లో వారి భార్యలు అందుబాటులో ఉంటే వారి యొక్క వివరాలను నమోదు చేసుకుంటారు.
- నమోదు చేసుకున్న వివరాల ద్వారా జూలై నెలలో దరఖాస్తులకు అవకాశం కల్పిస్తారు.
- లబ్ధిదారులు దరఖాస్తులను సమర్పించిన తర్వాత వచ్చే నెల నుంచి వారికి పింఛన్ అందించడం జరుగుతుంది.
తరచుగా అడిగే ప్రశ్నలు
- Spouse Pensions అర్హులు ఎవరు?
ఎవరైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా పింఛన్ పొందుతున్నటువంటి మగవారు మరణించినట్లయితే వారి భార్యలు అందుబాటులో ఉంటే వారు మాత్రమే Spouse పింఛన్లకు అర్హులు.
- Spouse Pensions దరఖాస్తు ఎలా చేయాలి?
Spouse Pensions కి దరఖాస్తు చేయాలనుకుంటే కేవలం మీ గ్రామ వార్డు సచివాలయంలో ఉన్నటువంటి Welfare అధికారి/డిజిటల్ అధికారి ద్వారా అప్లికేషన్ ఫారం నింపి నికి తగిన డాక్యుమెంట్స్ ను ఇచ్చి దరఖాస్తు చేసుకోగలరు.