టిడిపి+జనసేన ప్రభుత్వం లో ఇచ్చే పధకాలు ఇవే…!TDP+Janasena Schemes List 2024

AP లో సార్వత్రిక ఎన్నికల్లో కూటమి ఘనవిజయం సాదించింది.తెలుగుదేశం,జనసేన కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్నాయి.ఈ సందర్భంగా కూటమి (TDP+JANASENA+BJP) ప్రకటించినటువంటి ఈ ఉమ్మడి మేనిఫెస్టోలో భాగంగా రైతులకు,మహిళలకు,విద్యార్థులకు మరియు నిరుద్యోగులకు మేలు చేకూరే విధంగా కొన్ని పథకాలను అమలు చేయబోతుంది.ఇందులో పూర్తి వివరాలను తెలుసుకుందాం …..

  • ప్రతినెల 1500 అకౌంట్లోకి : రాష్ట్రవ్యాప్తంగా 18 నుంచి 59 సంవత్సరాల వరకు ఉన్నటువంటి ప్రతి మహిళకు ఆడబిడ్డ నిధి అనే పథకం కింద ప్రతి నెల 1500 రూపాయలు నేరుగా వారి యొక్క బ్యాంక్ అకౌంట్ లోకి జమ చేయనట్లు కూటమి ఉమ్మడి మేనిఫెస్టోలో తెలియచేయడం జరిగింది.
  • ఉచిత బస్సు ప్రయాణం: మన పొరుగు రాష్ట్రాలు అయినటువంటి తెలంగాణ కర్ణాటకలో మాదిరిగానే ఉచిత బస్సు ప్రయాణం సౌకర్యం కల్పిస్తామని ఉమ్మడి మేనిఫెస్టోలో తెలియజేశారు.
  • మహిళలకు వడ్డీ లేని రుణాలు: టిడిపి ప్రభుత్వం అధికారంలోకి వస్తే పొదుపు మహిళలకు తప్పకుండా 10 లక్షల రూపాయల వరకు వడ్డీ లేని రుణాలను ఇస్తామని హామీగా ఇచ్చారు. 
  •  అన్నదాత పథకం : తెలుగుదేశం జనసేన ప్రభుత్వం రైతుల ఖాతాలోకి 20వేల రూపాయల ఆర్థిక సాయం ప్రతి సంవత్సరం కూడా రైతుల అకౌంట్లోకి జమ చేస్తామని హామీగా ఇచ్చారు. గతంలో రైతు భరోసా మరియు పిఎం కిసాన్ కలుపుకొని 13500 వచ్చేవి. ఇకపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహాయాలు అన్ని కలుపుకొని 20వేల రూపాయలు మేరుగా రైతుల అకౌంట్లోకి జమ చేయబోతున్నారు. 
  • తల్లికి వందనం పథకం: గత ప్రభుత్వం అమ్మబడి పథకం ద్వారా 15000/- విద్యార్థుల యొక్క తల్లి ఖాతాలోకి జమ చేసేది. ఇప్పుడు తెలుగుదేశం జనసేన ప్రభుత్వం కూడా తల్లికి వందనం పథకం ద్వారా విద్యార్థుల యొక్క తల్లి ఖాతాల్లోకి 15వేల రూపాయలు నేరుగా వేయబోతున్నారు. అయితే కుటుంబంలో ఎంతమంది పిల్లలు చదువుకుంటున్న అంతమందికి కూడా ఈ పథకం వర్తించనుంది 👌
  • ఫీజు రియంబర్స్మెంట్ : పై చదువులు చదివేటువంటి విద్యార్థులకు సంబంధించి కాలేజ్ ఫీజు రియంబర్స్మెంట్ డబ్బులు నేరుగా కాలేజ్ అకౌంట్ కి వేసేటట్లు ఒక కొత్త పథకాన్ని ప్రవేశపెట్టనుంది.తెలుగుదేశం జనసేన ప్రభుత్వం.
  •  నిరుద్యోగ భృతి : రాష్ట్రవ్యాప్తంగా నిరుద్యోగులకు 3000 రూపాయలు చొప్పున ఎవరైతే డిగ్రీ ఉత్తీర్ణులై ఉద్యోగం కోసం ఎదురుచూసేటువంటి నిరుద్యోగులకు ఈ నిరుద్యోగ భృతి అనే పథకం వర్తించనుంది.
  • తొలి సంతకం డీఎస్సీ పైనే : తాము అధికారంలోకి వస్తే తప్పకుండా 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలను ఇస్తామని తొలి సంతకం డీఎస్సీ పైనే చేస్తానని చంద్రబాబు నాయుడు గారు హామీ అయితే ఇచ్చారు.

ఈ పథకాలే కాకుండా రాష్ట్ర ప్రజలకు మేలు చేకూరే విధంగా కొన్ని హామీలను రాజధాని అమరావతిగా కొనసాగించడము రాష్ట్రంలో కొన్ని ప్రాంతాలను అభివృద్ధి పరచడము ఇలా చాలా హామీలను తెలుగుదేశం జనసేన ప్రభుత్వము ఉమ్మడి మేనిఫెస్టో తెలియజేయడం జరిగింది.

Leave a Comment