Ap March scheme list 2026: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము మార్చి నెలలో Ap March Schemes 2026 అమలు చేయబోతున్నటువంటి ప్రభుత్వ పథకాలు ఇవే. ప్రత్యేకంగా మహిళల కొరకు రెండు కొత్త పథకాలను మహిళా దినోత్సవం సందర్భంగా అందించబోతుంది. ఆ పథకాలకు సంబంధించిన వివరాలతో పాటు మార్చి నెలలో అమలు చేయబోతున్నటువంటి పథకాలు యొక్క వివరాలు అందించాము పూర్తిగా చదవండి.
Ap March Schemes 2026
మార్చ్ నెల పింఛన్లు
మార్చి నెల పింఛన్లను ఒకరోజు ముందుగానే ప్రభుత్వము అందించబోతోంది. మార్చ్ ఒకటవ తేదీన సెలవు దినం కావడంతో ఒకరోజు ముందుగా అనగా ఫిబ్రవరి 28వ తేదీన పింఛన్లను ప్రభుత్వము గ్రామ వార్డు సచివాలయం అధికారుల ద్వారా పంపిణీ చేయిస్తుంది. ఫిబ్రవరి 28వ తేదీన పింఛన్లు తీసుకొని వారు తిరిగి మార్చి రెండో తేదీన పింఛను తీసుకోవచ్చు.
గమనిక: మార్చ్ 2వ తేదీన పింఛన్ల పంపిణీ పూర్తి అవుతుంది
పింఛన్ల పంపిణీ తేదీలు
| ఫిబ్రవరి 28వ తేదీ | 6.30 AM to 4.00 PM |
| మార్చ్ 2 తేదీ వరకు | 7.30 AM to 4.00 PM |
మహిళా దినోత్సవం కానుక
మహిళా దినోత్సవం కానుకగా మహిళల కొరకు ప్రభుత్వము రెండు కొత్త పథకాలను ప్రవేశపెట్టనుంది. ఈ పథకాలు కేవలం డ్వాక్రాలోని మహిళలకు మాత్రమే వర్తింప చేయబడుతాయి. డ్వాక్రా మహిళలు ఈ పథకాలకు దరఖాస్తులు చేయాలనుకుంటే కనీసము 6 నెలల సభ్యత్వం తప్పనిసరి.
- NTR విద్యాలక్ష్మి పథకం
- NTR కళ్యాణ లక్ష్మి పథకం
NTR విద్యాలక్ష్మి పథకం Key Points
- డ్వాక్రా లో ఉన్నటువంటి మహిళలకు వారి పిల్లల చదువుల కొరకు లోన్ సదుపాయం.
- 10,000 నుంచి 1,00,000 వరకు లోన్ సదుపాయం
- 4% పావలా వడ్డీతో లోన్ సదుపాయం.
- 48 వాయిదాలలో చెల్లింపులకు అవకాశం.
- గరిష్టంగా ఇద్దరు పిల్లలకు లోన్ సదుపాయం.
- దరఖాస్తు చేసుకున్న 48 గంటల్లో లబ్ధిదారుని ఖాతాల్లోకి నగదు జమ.
NTR కళ్యా లక్ష్మీ పథకం Key Points
- డ్వాక్రా లో ఉన్నటువంటి మహిళల కుమార్తెల వివాహ ఖర్చుల కొరకు లోన్ సదుపాయం.
- 10,000 నుంచి 1,00,000 వరకు లోన్ సదుపాయం.
- తక్కువ వడ్డీ 4% పావలా వడ్డీ.
- గరిష్టంగా 48 వాయిదాలలో చెల్లింపులు చేయవచ్చు.
- దరఖాస్తు చేసుకున్న వారం రోజుల వ్యవధిలో లబ్ధిదారుని ఖాతాల్లోకి నగదు జమ.
రైతుల పథకాలు
ఆంధ్రప్రదేశ్లోని రైతులకు మార్చి నెలలో Ap March Schemes 2026 రెండు పథకాలను కేంద్రం మరియు రాష్ట్ర ప్రభుత్వాలు అందించబోతున్నాయి.
- అన్నదాత సుఖీభవ పథకం (3rd Installment)
- PM కిసాన్ పథకం (22nd installment)
గమనిక: ఈ రెండు పథకాలకు సంబంధించిన విడుదల తేదీలు ఇంకా ప్రకటించలేదు. కానీ మార్చి నెలలో నగదు విడుదల చేస్తారని జాతీయ మీడియా పేర్కొనడం జరిగింది.
- ఈ రెండు పథకాల ద్వారా రైతులకు ఖాతాల్లోకి 6000 రూపాయలు జమ అవుతాయి.
- అన్నదాత సుఖీభవ పథకం ద్వారా 4,000 జమ.
- పీఎం కిసాన్ పథకం ద్వారా 2,000 జమ.
రైతులకు ఇవి తప్పనిసరి
- రైతులు తమ పట్టాదార్ పాస్ పుస్తకానికి ఆధార్ లింక్ చేసుకోవాలి.
- ఈ రెండు పథకాలకు సంబంధించి ఈ-పంట నందు ఈకే వేసి పూర్తి చేయాలి.
- బ్యాంకు ఖాతాలకు ఆధార్ తప్పనిసరి.
- NPCI లింక్ తప్పనిసరి.
- ఫార్మర్ రిజిస్ట్రీ ఐడి (రైతులకు ప్రత్యేక గుర్తింపు సంఖ్య) రిజిస్ట్రేషన్ తప్పనిసరి.
ఉగాది కానుక
రాష్ట్ర ప్రభుత్వం ఉగాది కానుకగా రాష్ట్రంలో ఇల్లు లేని పేదలకు ఇల్లు పంపిణీ చేయబోతుంది. Ap March Schemes 2026 ఇందులో ప్రధానంగా TIDCO ఇళ్లను పూర్తిచేసి గృహప్రవేశాలను చేయించనుంది. ఈ సంవత్సరము జూన్ నెల నాటికి 2.61 షల ఇండ్లను పూర్తి చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము లక్ష్యంగా పెట్టుకున్నది. ఇందులో భాగంగా ఉగాది కానుకగా TIDCO ఇళ్లను గృహప్రవేశాలను ప్రారంభించునుంది.
FOR MORE SCHEMES UPDATES JOIN TELEGRAM CLICK HERE












