NTR Bharosa Pensions Scheme 2026: ఆంధ్రప్రదేశ్లో ఇస్తున్న పింఛన్ల వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం..రాష్ట్రంలో ఎన్ని రకాల పింఛన్లు ఉన్నాయో మీకు తెలుసా? అయితే వివరాలు తెలుసుకునే దానికి ఈ పోస్టుని పూర్తిగా చదవండి. NTR Bharosa Pensions Scheme 2026 ఈ పోస్టులో మీకు పింఛన్ల రకాలు,పింఛన్లకు సంబంధించిన దరఖాస్తుల ప్రక్రియ,కావలసిన డాక్యుమెంట్స్ గురించి పూర్తిగా అందించడం జరిగింది.
పథకం ప్రధాన అంశాలు
| పథకం పేరు | ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పథకం |
| రాష్ట్రం పేరు | ఆంధ్ర ప్రదేశ్ |
| శాఖ పేరు | పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ |
| పింఛన్ల రకాలు | 29 రకాల పింఛన్లు అందుబాటులో ఉన్నాయి |
| అధికారిక పోర్టల్ | Click here |

పింఛన్ల రకాలు
👉 ఆంధ్రప్రదేశ్లో పింఛన్లను ఇచ్చే డబ్బులు ఆధారంగా నాలుగు రకాలుగా వస్తున్నాయని చెప్పుకోవచ్చు.
NTR Bharosa Pensions Scheme 2026 – Type based on benefit Amount
| 4000/- ఇస్తున్న పింఛన్లు | 12 రకాల పింఛన్లు ఉన్నాయి |
| 6000/- ఇస్తున్న పింఛన్లు | 2 రకాల పింఛన్లు ఉన్నాయి |
| 10,000/- ఇస్తున్న పింఛన్లు | 9 రకాల పింఛన్లు ఉన్నాయి |
| 15,000/- ఇస్తున్న పింఛన్లు | 2 రకాల పింఛన్లు ఉన్నాయి |
| 5,000/- ఇస్తున్న పింఛన్లు | 2 రకాల పింఛన్లు ఉన్నాయి |
4000/- ఇస్తున్న పింఛన్లు
🔰 వృద్ధాప్య పింఛన్
- ఈ పింఛన్లను ప్రభుత్వము వయస్సు ఆధారంగా ఇస్తుంది.
- వయస్సు 60 సంవత్సరాలు పైబడిన వారికి పింఛన్లకు అర్హులు.
- ఓటమి ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో 50 సంవత్సరాలు దాటిన వారికి {BC} కూడా పింఛన్లు అందిస్తామని చెప్పింది.
🔰 వితంతువుల పింఛన్లు
- ఈ పింఛన్లను ప్రభుత్వము భర్త మరణించిన ధ్రువీకరణ పత్రం ఆధారంగా అందిస్తుంది.
- ఈ పింఛన్లకు వయస్సు కనీసం 35 సంవత్సరాలు పైబడి ఉండాలి.
🔰 చేనేత పింఛన్
- చేనేత కార్మికులకు అందించే సర్టిఫికెట్ ఆధారంగా పెన్షన్ అందిస్తుంది.
- ఈ పింఛన్లకు వయస్సుతో సంబంధం లేకుండా సర్టిఫికెట్ ఉంటే పెన్షన్ వస్తుంది.
🔰 మత్స్యకార భరోసా పింఛన్
- చేపలు పట్టే వారికి ప్రభుత్వం అందించే సర్టిఫికెట్ ఆధారంగా పింఛన్ అందిస్తుంది.
- . ఈ పింఛన్లకు కూడా వయసుతో సంబంధం లేకుండా కేవలము సర్టిఫికెట్ ఆధారంగానే పెన్షన్ వస్తుంది.
🔰 సాంప్రదాయ చెప్పులు కుట్టే వారికి పింఛన్
- సాంప్రదాయం చెప్పులు కుట్టేవారు వీరికి సంబంధించి సంబంధిత శాఖలు అందించే సర్టిఫికెట్ ఆధారంగా పెన్షన్ అందించబడుతుంది.
🔰 కల్లుగీత కార్మికుల పింఛన్
- కల్లుగీత కార్మికులకు ప్రభుత్వం ద్వారా సర్టిఫికెట్ తెచ్చుకుంటే పెన్షన్ వస్తుంది.
🔰 డప్పు కళాకారుల పింఛన్
- డప్పు కళాకారులకు సంబంధించిన శాఖ నుంచి సర్టిఫికెట్ ఆధారంగా పింఛన్ అందించబడుతుంది.
🔰 ట్రాన్స్ జెండర్ పింఛన్
- Medical రిపోర్ట్ ఆధారంగా పెన్షన్ అందించబడుతుంది.
🔰 హెచ్ఐవి బాధితులకు పింఛన్
- HIV Medical రిపోర్ట్ ఆధారంగా పెన్షన్ అందించబడుతుంది.
🔰 కళాకారుల పింఛన్
- వీధి నాటకాలు, అంతరించిపోతున్న కలలను అనుసరిస్తున్న కళాకారులకు సంబంధిత శాఖ అందించే సర్టిఫికెట్ ఆధారంగా పెన్షన్ అందించబడుతుంది.
🔰 ఒంటరి మహిళ పింఛన్
- గ్రామాల్లో లేదా పట్టణాల్లో విఆర్ఓ గారు అందించే డిక్లరేషన్ ఆధారంగా వీరికి పెన్షన్ అందించబడుతుంది.
🔰 Spouse పింఛన్
- పెన్షన్ పొందుతున్న భర్త మరణించిన స్త్రీలకు భర్త మరణ ధ్రువీకరణ పత్రం ద్వారా భర్త పెన్షన్ భార్యకు ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది.
6000/- ఇస్తున్న పింఛన్లు
👉 Disabled పింఛన్లు
- పుట్టుకతో శరీర భాగాలకు వైకల్యం కలిగిన వారికి సదరం సర్టిఫికెట్ ఆధారంగా పింఛన్ అందించబడుతుంది.
- 22 రకాల వైకల్యాలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము సదరం సర్టిఫికెట్లను జారీ చేస్తుంది.
👉 Multideformity Leprosy పింఛన్లు
- కుష్టు వ్యాధి కలిగిన బాధితులకు సంబంధించి మెడికల్ రిపోర్ట్స్ ఆధారంగా అందించబడుతుంది.
10,000/- ఇస్తున్న పింఛన్లు
📍 దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు అందించే పింఛన్లు
- కిడ్నీ,లివర్,గుండె మార్పిడి చేసుకున్న బాధితులు.
- దీర్ఘకాలిక వ్యాధులు కలిగిన బాధితులు.
- నరాల బలహీనత కలిగిన బాధితులు.
- హిమోఫోలియా వ్యాధి కలిగిన బాధితులు.
- తలసీమియా వ్యాధి కలిగిన బాధితులు.
- CKDU – Private.
- CKDU – Govt.
- CKD – Serum Creatinine
- CKD – Esimated GFR
- CKD – Small Contacted kidney
15,000/- ఇస్తున్న పింఛన్లు
📌 పక్షవాతం
- పక్షవాతం వచ్చిన వారికి సదరం సర్టిఫికెట్ ఆధారంగా ఇస్తున్న పింఛన్లు.
- సదరం సర్టిఫికెట్ పర్సంటేజ్ 85% కంటే ఎక్కువ ఉన్న పక్షవాతం కలిగిన బాధితులు.
- మంచానికే పరిమితమై ఉన్న బాధితులు.
📌 ప్రమాద బాధితులు
- ప్రమాదాల కారణంగా శరీర భాగాలు కోల్పోయిన బాధితులకు సదరం సర్టిఫికెట్ ఆధారంగా ఇస్తున్న పింఛన్లు.
- సదరం సర్టిఫికెట్లో పర్సంటేజ్ 85% కంటే ఎక్కువగా ఉండాలి.
- . మంచానికే పరిమితమై ఉండాలి.
5,000/- ఇస్తున్న పింఛన్లు
👉 Sainik welfare Pensions
- భారత సైనిక దళం నుంచి రిటైర్ అయిన వ్యక్తులకు అందిస్తున్న పింఛన్లు.
👉Amaravathi Landless poor people
- రాజధాని అమరావతి కోసము భూమిని ఇచ్చిన రైతులకు ప్రభుత్వం తరఫున అందిస్తున్న పింఛన్లు.

🟢వీరికి మాత్రమే పింఛన్
🔰 ఆంధ్రప్రదేశ్ నివాసితులై ప్రభుత్వం నిర్ణయించిన తగిన డాక్యుమెంట్స్ సబ్మిట్ చేసిన వారికి మాత్రమే పెన్షన్ వస్తుంది.
🔴వీరికి పింఛన్ రాదు
🔰 ఆంధ్రప్రదేశ్ లో లేనివారు అంటే ఆధార్ కార్డు ఆంధ్రప్రదేశ్ అడ్రస్ లేనివాళ్లు.
🔰 కుటుంబంలో గవర్నమెంట్ జాబ్ చేసే వాళ్ళు ఉంటే పింఛన్లు రావు.
🔰 ఇంట్లో కరెంటు గడిచిన 12 నెలలుగా 300 యూనిట్లు పైన వాడి ఉంటే పెన్షన్లకు అప్లై చేస్తే Reject అవుతాయి.
🔰 కుటుంబంలో ఎవరికైనా కారు ఉంటే పెన్షన్ కి అప్లై చేస్తే రాదు.
🔰 పట్టణాలలో స్థలాలు 1000 చదరపు అడుగుల కంటే ఎక్కువగా ఉంటే రాదు.
🔰 రేషన్ కార్డు ఉన్నవాళ్లకే పింఛన్లు వస్తాయి.
💻APPLY చేసుకోండి ఇలా
👉 స్వర్ణ గ్రామం & స్వర్ణ వార్డు ద్వారా దరఖాస్తులను చేసుకోవచ్చు.
👉 అప్లికేషన్ తో పాటు పింఛన్ కి సంబంధించిన డాక్యుమెంట్స్ ని ఇవ్వాల్సి ఉంటుంది.
👉 ప్రస్తుతము కొత్త పింఛన్లకు అవకాశం కేవలము Spouse పింఛన్లకు మాత్రమే ఉంది.
📝ఇవ్వాల్సిన పత్రాలు
👉 అప్లికేషన్
👉 అప్లికేషన్ చేసే వ్యక్తి ఆధార్ కార్డు
👉 రేషన్ కార్డు
👉 Caste సర్టిఫికెట్
👉 పెన్షన్ కి సంబంధించిన డాక్యుమెంట్
- వృద్ధాప్య పింఛన్ ( Adhar card )
- వితంతువుల పింఛన్లు ( Husband death certficate )
- చేనేత పింఛన్ ( weavers Certificate )
- మత్స్యకార భరోసా పింఛన్ ( Fisheries Certificate )
- సాంప్రదాయ చెప్పులు కుట్టే వారికి పింఛన్ ( Collaber certificate )
- కల్లుగీత కార్మికుల పింఛన్
- డప్పు కళాకారుల పింఛన్
- ట్రాన్స్ జెండర్ పింఛన్ ( Transgender Certificate )
- హెచ్ఐవి బాధితులకు పింఛన్ ( HIV Victime proof )
- కళాకారుల పింఛన్ ()
- ఒంటరి మహిళ పింఛన్ ( VRO Declaration )
- Spouse పింఛన్ ( Husband death Certificate )
- Disabled పింఛన్లు ( Sadarem Certificate )
- Multideformity Leprosy పింఛన్లు ( Sadarem Certificate )
- దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు అందించే పింఛన్లు ( Medical Certificate )
- పక్షవాతం ( Sadarem certificate )
- ప్రమాద బాధితులు ( Sadarem certificate )
- Sainik welfare Pensions ( Proof Of sainik )
- Amaravathi Landless poor people ( Ammaravathi people )
👉 ఆధార్ అప్డేట్ హిస్టరీ
👉 మొబైల్ నెంబర్
NTR Bharosa Pensions Scheme 2026 Links
NTR Bharosa Pensions Scheme 2026 Site Link Click Here
ముగింపు
NTR Bharosa Pensions Scheme 2026 పింఛన్లకు ప్రభుత్వము దరఖాస్తుల స్వీకరణ కోరితే తప్పనిసరిగా పైన తెలిపిన డాక్యుమెంట్స్ అన్ని కూడా మీరు సరైన సమయంలో అందించి పింఛన్లకు దరఖాస్తులను సమర్పించవచ్చు.
NTR Bharosa Pensions Scheme 2026 Faqs
📍 తెలంగాణ వాళ్లు అప్లై చేసుకోవచ్చా?
లేదు. ఆంధ్రప్రదేశ్ వాళ్లు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి.
📍 రేషన్ కార్డు లేని వాళ్ళు దరఖాస్తు చేసుకోవచ్చా ?
లేదు. రేషన్ కార్డు ఉంటేనే దరఖాస్తు ముందుకు వెళుతుంది.
📍 సదరం సర్టిఫికెట్ రాలేదు కానీ పింఛన్ దరఖాస్తు చేసుకోవచ్చా ?
సదరం సర్టిఫికెట్ ఆధారంగా వచ్చే పింఛన్ల కు మీరు దరఖాస్తు చేసుకోవాలనుకుంటే మీ దగ్గర తప్పనిసరిగా సదరం ఉండాలి.











