Table of Contents
AP Backlog Jobs Recruitment – 2026: ఆంధ్రప్రదేశ్లోని దివ్యాంగులకు ఉద్యోగ అవకాశాలు వస్తున్నాయి. వివిధ శాఖలలో బ్యాక్ లాగ్ ఉద్యోగ నియామకం గురించి ఉమ్మడి కృష్ణ జిల్లా నుంచి నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. ఈ ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకునుటకు పూర్తిగా చదవండి. ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ కేటగిరీలకు రిజర్వ్ చేయబడినటువంటి 38 బ్యాక్లాగ్ పోస్టులకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు.ఉద్యోగాలను విద్యా అర్హతల్లో వచ్చిన మార్కుల ఆధారంగా ఎంపిక చేస్తారు.
| Download Notification | Click Here |
| Download Application Form | Click Here |
వివిధ జిల్లాల నుంచి వచ్చే AP Backlog Jobs Recruitment – 2026 నోటిఫికేషన్లను మీరు తెలుసుకోవాలి అనుకుంటే ఇప్పుడే మా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి.
AP Backlog Jobs Recruitment – 2026 Overview
| అంశం | వివరాలు |
|---|---|
| స్కీమ్ / నియామకం పేరు | AP Backlog Vacancies Recruitment 2026 |
| నిర్వహించే సంస్థ | ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం |
| లక్ష్యం | రిజర్వేషన్ కోటాలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయడం |
| ప్రధాన లబ్ధిదారులు | దివ్యాంగులు (PWD), SC, ST, BC అభ్యర్థులు |
| అర్హత | 7వ తరగతి నుంచి డిగ్రీ వరకు (పోస్టును బట్టి మారుతుంది) |
| వయస్సు | సాధారణంగా 18–42 సంవత్సరాలు (ప్రభుత్వ నిబంధనలు వర్తిస్తాయి) |
ఉమ్మడి కృష్ణాజిల్లా నుంచి నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది.ఈ జిల్లాలో ఉన్నటువంటి ప్రత్యేకించిన 38 ఉద్యోగాలకు సంబంధించి దరఖాస్తుల ఆహ్వానాలు జరుగుతున్నాయి. వాటి వివరాలు ఈ క్రింది విధంగా ఉన్నవి.
AP Backlog Jobs Recruitment – 2026 Group- 4 ఉద్యోగాలు
| ఉద్యోగం పేరు | విద్యా అర్హత |
| జూనియర్ అసిస్టెంట్ | గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి డిగ్రీ |
| జూనియర్ ఆడిటర్ | గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి డిగ్రీ |
| టైపిస్ట్ | గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి డిగ్రీ |
| మేటర్నిటీ అసిస్టెంట్ | ఇంటర్మీడియట్ + ANM Course |
AP Backlog Jobs Recruitment – 2026 గ్రూప్ – 4 (మినహా)
| ఉద్యోగం పేరు | విద్యా అర్హత |
| మెసెంజర్ | 7th pass |
| ఆఫీస్ సబార్డినేట్ | 7th pass |
| సప్లయర్ | 7th pass |
| సానిటరీ మేస్త్రి | 7th pass |
| హెల్పర్ | 7th pass |
| చైన్ మెన్ | 7th pass |
| ఆయా | 7th pass |
| వాచ్మెన్ | 5th pass |
| స్వీపర్ | చదవడం రాయడం వచ్చి ఉండాలి |
| క్లీనర్ | చదవడం రాయడం వచ్చి ఉండాలి |
| PH వర్కర్ | చదవడం రాయడం వచ్చి ఉండాలి |
| Non – PH వర్కర్ | చదవడం రాయడం వచ్చి ఉండాలి |

ముఖ్య సూచనలు
వయస్సు
- ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసేటువంటి అభ్యర్థి యొక్క వయస్సు 18 సంవత్సరాలు పైబడి దరఖాస్తు చేయుచున్న సమయానికి 52 సంవత్సరాలు దాటి ఉండకూడదు.
వైకల్యం
- విభిన్న ప్రతిభావంతుల ఉద్యోగాలు అనేవి కనీసము దరఖాస్తుదారునికి 40 శాతం కంటే వైకల్యం శాతం ఎక్కువగా ఉండాలి.
దరఖాస్తు చేసుకునే విధానం
దరఖాస్తు చేయదలుచుకున్న అభ్యర్థులు ఈ క్రింద ఇవ్వబడిన చిరునామాకు పోస్ట్ ద్వారా దరఖాస్తు చేసుకో వచ్చును. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేయాలి అనుకున్న వారు తప్పనిసరిగా చివరి తేదీ లోపల దరఖాస్తులను పోస్టు ద్వారా పంపించాలి.
చివరి తేదీ : 30-03-2026
అడ్రస్ 🔻
- సహాయ సంచాలకులు,విభిన్న ప్రతిభావంతులు హిజ్రాలు మరియు వయోవృద్ధుల సంక్షేమ శాఖ కార్యాలయం, కలెక్టర్ వారి కార్యాలయం ఆవరణము, చిలకలపూడి, మచిలీపట్నం.
గమనిక: కవర్ మీద విభిన్న ప్రతిభావంతులో బ్యాక్లాగ్ ఉద్యోగం పేరు రాసి ప్రతి పోస్టునకు వేరువేరుగా దరఖాస్తు చేసుకోవచ్చు.
దరఖాస్తు తో ఇవ్వాల్సిన పత్రాలు
- దరఖాస్తు ఫారం
- పుట్టిన తేదీ ధ్రువపత్రం
- సదరం సర్టిఫికెట్
- విద్యా అర్హత కలిగిన పత్రాలు
- ఎంప్లాయిమెంట్ కార్డ్
- 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు స్టడీ సర్టిఫికెట్లు
- కుల ధ్రువీకరణ పత్రం
- నివాస ధ్రువీకరణ పత్రం
- రేషన్ కార్డు
- దరఖాస్తు ఫారం కు రెండు పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు అతికించాలి.
ఎంపిక విధానం
- ఈ ఉద్యోగాలకు ఎంపిక విధానం పూర్తిగా విద్యా అర్హతల్లో వచ్చిన మార్కుల ఆధారంగా ఎంపిక చేయబడతారు.
- స్థానికులకు అవకాశం.
FAQs AP Backlog Jobs Recruitment – 2026
1. బ్యాక్ లాక్ ఉద్యోగాలు ఎవరికి?
బ్యాక్ లాగ్ ఉద్యోగాలు విభిన్న ప్రతిభావంతులు (PWD) కొరకు ప్రత్యేకంగా కేటాయించబడినవి SC,ST,BC కూడా వర్తిస్తాయి.
2. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు ఎలా చేయాలి ?
ఈ ఉద్యోగాలకు దరఖాస్తులను పోస్టు ద్వారా ఉద్యోగ నోటిఫికేషన్ లో తెలుపబడిన చిరునామాకు పంపించాల్సి ఉంటుంది.
3. పోస్ట్ ద్వారా ఒరిజినల్ documents పంపించాలా..?
లేదు. ప్రతి డాక్యుమెంట్ నకలు Zerox copies పంపిస్తే చాలు. వెరిఫికేషన్ సమయంలో మీరు నేరుగా సంబంధిత ఆఫీస్ కి వెళ్లి ఒరిజినల్ డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ చేయించుకోవాలి.
4. ఎంపిక విధానం ఎలా ఉంటుంది ?
ఈ ఉద్యోగాలకు ఎంపిక విధానం పూర్తిగా విద్యార్హతుల్లో వచ్చిన మార్కుల ఆధారంగా ఉంటుంది.
5. Disability ఎంత ఉండాలి ?
40% కంటే ఎక్కువగా ఉండాలి మరియు వినికిడి లోపం ఉన్నవారు దరఖాస్తు చేసుకున్నట్లయితే 60% నుంచి 70% వినికిడి లోపం ఉన్నటువంటి వాళ్ళు అర్హులు.
6. ఉద్యోగాలకు విద్యా అర్హతలు ఏమిటి ?
ఈ ఉద్యోగాలకు సంబంధించి విద్యా అర్హతలు సంబంధిత పోస్ట్ ఆధారంగా ఉంటాయి. కొన్ని సందర్భాలలో చదవడం రాయడం వచ్చిన చాలు. Min: 5th class to Max: Degree.




