Ap Spouse Pensions 2026-Application Process,Required Documents
Ap Spouse Pensions 2026 :కూటమి ప్రభుత్వము అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్త పింఛన్ల విభాగంలో Ap spouse Pensions ప్రవేశ పెట్టడం జరిగింది.ఈ పెన్షన్లు ప్రతినెల కొత్త దరఖాస్తులు చేయబడతాయి.పెన్షన్ పొందుతున్న కుటుంబ పెద్ద చనిపోయిన తర్వాత ఆ పెన్షన్ నిలుపుదల చేయకుండా ఆ కుటుంబ అవసరాలకు సహాయంగా నిలిచేందుకు కుటుంబ పెద్ద భార్య పేరు మీద ఇచ్చే పెన్షన్ స్పౌజ్ పెన్షన్స్ అని ప్రభుత్వము తెలియజేయడం జరిగినది.
నవంబర్ 2024 నుంచి ఈ పింఛన్లను ప్రభుత్వము అందుబాటులోకి తీసుకురావడం జరిగినది.ప్రతి నెల కూడా పెన్షన్ ముగింపు సమయంలో అధికారులు పింఛన్ లబ్ధిదారులు పింఛన్ పొందని ఎడల వారి యొక్క వివరాలు నమోదు చేయు సమయంలో పెన్షన్ పొందుతున్న వ్యక్తి మరణించినట్లు అయితే ఆ పింఛన్ రద్దు చేయకుండా Spouse పెన్షన్ కు అర్హత ఉంటే దరఖాస్తు చేస్తారు.
Overview Of ap spouse pensions
| అంశం | వివరాలు |
|---|---|
| పథకం పేరు | AP Spouse Pension |
| మాసం వారీ పెన్షన్ మొత్తం | ₹4,000 (సోషల్ సెక్యూరిటీ పెన్షన్‌గా) |
| అర్హులు ఎవరు? | పింఛన్ పొందిన వ్యక్తి మరణించి, ఆయన భార్య బతికుండాలి. |
| ఎలా అప్లై చేయాలి? | గ్రామ / వార్డు సచివాలయం ద్వారా దరఖాస్తు |
| అప్లికేషన్ | సచివాలయంలో అందుబాటులో ఉంటుంది |
| పింఛన్ ఎక్కడ జమ అవుతుంది? | నేరుగా లబ్ధిదారు చేతికి ఇవ్వబడుతుంది |
| స్థితి తెలుసుకునే వెబ్సైట్ | sspensions.ap.gov.in |
Ap Spouse Pensions 2026 Spouse pensions Aim
ఈ పింఛన్లు ప్రవేశపెట్టడానికి గల ముఖ్య కారణము కూటమి ప్రభుత్వము కుటుంబ పెద్ద మరణించినట్లయితే ఆ కుటుంబానికి ఆర్థిక సహాయం అందించడం కోసం అందుబాటులోకి తీసుకురావడం.
Spouse pensions Eligibility
ఈ పథకం అందుకోవడానికి కొన్ని ప్రాధమిక అర్హతలు ఉన్నాయి:
- దరఖాస్తుదారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నివాసి అయి ఉండాలి.
- భర్త పెన్షన్ (ఏ పెన్షన్ అయినా)పొందుతూ మరణించి ఉండాలి.
- దరఖాస్తుదారు నిర్ధేశిత వయస్సు కనీసం 30 సంవత్సరాలు కలిగి ఉండాలి.
- కుటుంబ ఆదాయం పేద రేఖకు దిగువన (BPL) ఉండాలి.రేషన్ కార్డ్ కలిగి ఉండాలి.
- కుటుంబంలో ఇంకొకరు ప్రభుత్వ పింఛన్ పొందకూడదు(వికలాంగుల పెన్షన్ పొందుతూ ఉండవచ్చు).
- కుటుంబంలో ప్రభుత్వ ఉద్యోగి ఉండరాదు.
- కుటుంబంలో ఆదాయపు పన్ను చెల్లింపుదారు ఉండరాదు.
- కుటుంబంలోని సభ్యులకు ఫోర్ వీలర్ ఉండకూడదు(ట్రాక్టర్ కు మినహాయింపు ఉంది).

Ap Spouse Pensions 2026
Application process (Step-by-Step Process)
- గ్రామ లేదా వార్డు సచివాలయానికి వెళ్లండి
ముందుగా గ్రామ వార్డు సచివాలయానికి వెళ్లి అక్కడ ఉన్న వెల్ఫేర్ అసిస్టెంట్ గారిని సంప్రదించండి. వారి ఆధ్వర్యంలోనే మీ పింఛను దరఖాస్తు ప్రక్రియ జరుగుతుంది. - ఫారమ్ నింపండి (Fill the Form)
వెల్ఫేర్ అసిస్టెంట్ గారు ఇచ్చిన అప్లికేషన్ పూర్తి వివరాలు రాయండి. అప్లికేషన్ ఫారం తో పాటు తగు డాక్యుమెంట్స్ జతపరచాల్సి ఉంటుంది. - పత్రాలు జత చేయండి (Attach Documents)
కింద పేర్కొన్న అవసరమైన పత్రాలను ఫారమ్‌తో కలిపి ఇవ్వాలి. - సమర్పించండి (Submit Application)
ఫారమ్‌ను సచివాలయ వాలంటీర్‌కి ఇవ్వండి. వారు మీ వివరాలను ఆన్లైన్లో నమోదు చేస్తారు. - పరిశీలన (Verification)
సచివాలయ సిబ్బంది మీ ఇంటికి వచ్చి (kyc) అన్ని వివరాలు పరిశీలిస్తారు.
తరువాత MPDO లేదా మునిసిపల్ కమిషనర్ స్థాయిలో ఆమోదం జరుగుతుంది. - పింఛన్ మంజూరు (Approval)
ఎంపీడీవో/మున్సిపల్ కార్యాలయం కు వెళ్లిన మీ అప్లికేషన్ గనుక ఆమోదించబడినట్లైతే వచ్చే నెల నుంచి అనగా మీరు దరఖాస్తు చేసిన తరవాత నెల నుంచి మీకు పింఛన్ అందించబడుతుంది మరియు పింఛన్ మంజూరు పత్రము అందుతుంది.
Required Documents
- అప్లికేషన్ ఫారం (Application form)
- పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోలు (Pass port size photos)
- దరఖాస్తుదారుని ఆధార్ కార్డు (Applicant aadhar card)
- రేషన్ కార్డు (ration card)
- ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ (అవసరమైతే) (family member certificate)
- భర్త మరణించిన మరణ ధ్రువీకరణ పత్రం (husband death certificate)
- భర్త పింఛన్ ఐడి (Husband pension ID)
- భర్త ఆధార్ కార్డు (Husaband aadhar card)
- పనిచేస్తున్న మొబైల్ నెంబర్ (Mobile Number)
ముఖ్య సూచనలు
- అప్లికేషన్లో అన్ని వివరాలు సరిగా ఉండాలి.
- మరణ ధృవీకరణ పత్రం తప్పనిసరి.
- బ్యాంక్ ఖాతా తప్పనిసరిగా మీ పేరుతో ఉండాలి.
| Application Manual | Click Here |
| Circular | Click Here |
| Application | Click Here |
Application Download చేసే విధానం
- ముందుగా పైన ఉన్న application పక్కన ఉన్న Click here పైన క్లిక్ చెయ్యండి.
- Download చేయడానికి ఒక మెయిల్ అడుగుతుంది.
- మెయిల్ క్లిక్ చెయ్యండి.
- మొబైలు లోకి అప్లికేషన్ డౌన్లోడ్ అవుతుంది.దీన్ని పూరించి మీరు గ్రామ వార్డ్ సచివాలయం లో దానికి తగిన డాక్యుమెంట్స్ జత పరచాలి.
తరచూ అడిగే ప్రశ్నలు
Spouse పెన్షన్ భార్యకు మాత్రమేనా?
అవును.
Spouse పెన్షన్ భర్త పెన్షన్ పొందుతూ ఉంటేనే వస్తుందా?
అవును పింఛన్ పొందుతున్న భర్త మరణించిన తర్వాత భార్యకు ప్రభుత్వం అందించే పింఛన్ Spouse పెన్షన్.
భర్త ఏ పెన్షన్ పొందుతూ ఉండొచ్చు?
భర్త ఏ పెన్షన్ పొందుతూ ఉన్న (వృద్ధుల పెన్షన్, వికలాంగుల పెన్షన్, మెడికల్ పెన్షన్, వృత్తుల వారీగా వచ్చే పెన్షన్) ఆయన మరణించిన ఎడల భార్య ఉంటే Spouse పెన్షన్ అందుతుంది.
Spouse పెన్షన్/ Widow పెన్షన్ ఒక్కటేనా?
కాదు. పెన్షన్ పొందుతున్న భర్త మరణించితే భారీ ఇచ్చే పెన్షన్ Spouse పెన్షన్. భర్త పెన్షన్ పొందకుండా ఉన్న మరణిస్తే నిర్దేశిత వయసు కలిగిన భార్యకు ఇచ్చే పెన్షన్ Widow Pension (వితంతువుల పెన్షన్)











