AP FREE SWEING MACHINE SCHEME-2026: ADARANA 3.O SCHEME

NTR Bharosa Pensions Scheme 2026
NTR Bharosa Pensions Scheme 2026: పింఛన్ల రకాలు-పూర్తి వివరాలు

AP FREE SWEING MACHINE SCHEME-2026: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు మహిళా దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఒక కొత్త పథకాన్ని ప్రారంభించబోతున్నట్లు సమాచారం. ఈ పథకాన్ని ఆదరణ 3.O ప్రభుత్వము ప్రారంభించనుంది. ఈ పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు ఉచిత కుట్టుమిషన్లు మరియు శిక్షణను ఇవ్వనుంది. గతంలో ఆదరణ 2.O పథకం ద్వారా లబ్ధిదారులు గుర్తింపబడి శిక్షణ పూర్తి చేసుకొని ఉచిత కుట్టుమిషన్లను పొందారు. ప్రస్తుతము మార్చి నెలలో ఈ AP FREE SWEING MACHINE SCHEME-2026 పథకానికి సంబంధించినటువంటి దరఖాస్తుల ప్రక్రియను ప్రారంభించింది. పూర్తి వివరాలు వివరంగా ఇచ్చాను,పూర్తిగా చూడండి.

Overview of Adarana 3.O Scheme

అంశాలువివరణ
పథకం పేరుఆదరణ 3.O
ప్రయోజనంమహిళలకు ఉచిత కుట్టు మిషన్లు, శిక్షణ
అర్హులురాష్ట్రంలో బలహీన వర్గాలకు చెందిన మహిళలు
దరఖాస్తు విధానంగ్రామ వార్డు సచివాలయాల ద్వారా
శిక్షణ కాలం లేదు30-60 రోజుల వ్యవధి (75% హాజరు తప్పనిసరి)

అర్హతలు

  • మహిళలు ఆంధ్రప్రదేశ్ నివాసితులై ఉండాలి. 
  • మహిళల వయస్సు 18 సంవత్సరాలనుంచి 50 సంవత్సరాల మధ్యలో ఉండాలి. 
  • ఆధార్ కార్డు తప్పనిసరి.
  • మహిళలకు రేషన్ కార్డు తప్పనిసరి. 
  • గ్రామీణ ప్రాంతాల్లోని మహిళల కుటుంబ సంవత్సర 2 లక్షల రూపాయల లోపల ఉండాలి. 
  • పట్టణ ప్రాంతాల్లోని మహిళల కుటుంబ సంవత్సర ఆదాయము 1.5 లక్షల లోపు ఉండాలి.
  • వితంతువులకు,వికలాంగులకు మొదటి ప్రాధాన్యత ఉంటుంది.

అప్లికేషన్ చేయు విధానం

  1. Offline ద్వారా దరఖాస్తు చేయు విధానం:
    • అప్లికేషన్ చేయు తేదీ వరకు వేచి ఉండాలి. 
    • అప్లికేషన్ గ్రామ,వార్డు సచివాలయంలోని అధికారుల ద్వారా స్వీకరించబడుతుంది. 
    • అప్లికేషన్ తో పాటు తగిన డాక్యుమెంట్స్ ని ఇచ్చి దరఖాస్తు చేయించుకోవాలి. 
    • ప్రస్తుతానికి అప్లికేషన్ చేయు తేదీ వెలువడ లేదు. 
  2. Online ద్వారా దరఖాస్తు చేయు విధానం:
    • Apobmms వెబ్ సైట్ ద్వారా దరఖాస్తుల స్వీకరణ జరుగుతుంది. 
    • Candidate login ద్వారా దరఖాస్తులు సమర్పించవచ్చు. 

కావలసిన డాక్యుమెంట్స్

  • ఆధార్ కార్డు (చిరునామా రుజువు కొరకు)
  • రేషన్ కార్డు 
  • ఆదాయ ధ్రువీకరణ పత్రం 
  • కుల ధ్రువీకరణ పత్రం 
  • పనిచేస్తున్న మొబైల్ నెంబర్ 
  • పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు 
  • అప్లికేషన్ ఫారం 
AP FREE SWEING MACHINE SCHEME-2026

శిక్షణ & ప్రయోజనం

  • దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు తమ మండల పరిధిలో ఉన్న శిక్షణ కేంద్రానికి రావాల్సి ఉంటుంది. 
  • శిక్షణ కాలం పూర్తయ్యేంతవరకు ప్రతిరోజు హాజరు వేయించుకోవాలి. 
  • శిక్షణ కాలపరిమితి 30 రోజుల నుంచి 60 రోజుల మధ్యలో ఉంటుంది. 
  • శిక్షణ కాలపరమితి పూర్తి అయిన తర్వాత మీకు సర్టిఫికెట్ రావడం జరుగుతుంది. 
  • సర్టిఫికెట్ వచ్చిన 30 రోజుల వ్యవధిలో మీకు ఉచిత కుట్టు మిషన్ అందించబడుతుంది.

గతంలో పొరపాట్లు

  • గతంలో కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల కారణంగా చాలామంది లబ్ధిదారులు తమ శిక్షణ కాలం పూర్తి చేసుకున్న…వారికి సరైన సమయంలో సరియైన సమయంలో కుట్టుమిషన్లు అందించలేకపోయింది.
  • కారణం:
    • కేంద్రం పథకం అయినా PM విశ్వకర్మ పథకానికి దరఖాస్తు చేసుకోవడం మరియు రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన ఆదరణ 2.O దానికి దరఖాస్తులు చేసుకోవడం.

AP FREE SWEING MACHINE SCHEME-2026 LINKS

Website LinkClick here
Application LinkComing soon

FAQs AP FREE SWEING MACHINE SCHEME-2026

ఈ పథకం ఎప్పుడు ప్రారంభిస్తారు?

మహిళా దినోత్సవం సందర్భంగా ఈ పథకాన్ని ప్రారంభించినట్లు సమాచారం. 

Talliki Vandanam scheme 2026
Talliki Vandanam scheme 2026-తల్లికి వందనం పథకం వివరాలు

మహిళలు అందరికీ అవకాశం ఉంటుందా? 

అవును.మహిళలు అందరికీ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించునుంది.

ఏ వయసు కలిగిన మహిళలు దరఖాస్తు చేయవచ్చు? 

దరఖాస్తు చేయాలనుకున్న మహిళల యొక్క వయస్సు 18 నుంచి 50 సంవత్సరాల మధ్యలో ఉండాలి.

శిక్షణ ఉంటుందా ? కాలపరిమితి ఎంతవరకు ?

దరఖాస్తు చేసిన అభ్యర్థులకు శిక్షణ ఉంటుంది. శిక్షణ కాలం 30 నుంచి 60 రోజుల మధ్యలో ఉంటుంది.

Leave a Comment