Talliki Vandanam scheme 2026-తల్లికి వందనం పథకం వివరాలు

పథకం పరిచయం :

Talliki Vandanam scheme 2026: తల్లికి వందనం పథకం అనేది ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సూపర్ సిక్స్ పథకాల్లో ముఖ్యమైన పథకం. ఈ పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థుల యొక్క తల్లి ఖాతాలకు 13,000 చొప్పున జమ చేయబడుతుంది. ఈ పథకానికి సంబంధించిన పూర్తి అర్హతలను మరియు లబ్ధిదారుల యొక్క జాబితాను తెలుసుకొనుటకు ఈ సమాచారాన్ని పూర్తిగా చదవండి.

Talliki Vandanam scheme 2026 ముఖ్యమైన అంశాలు

పథకం పేరుతల్లికి వందనం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్ రాష్ట్రం (కూటమి ప్రభుత్వం)
ప్రధాన లక్ష్యంవిద్యార్థుల తల్లులకు ఆర్థిక సహాయం అందించడం
సంబంధిత శాఖమహిళా శిశు సంక్షేమ శాఖ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం
లబ్ధిదారులువిద్యార్థుల యొక్క తల్లులు (తల్లి లేని పక్షంలో సంరక్షకులు)
ఆర్థిక సహాయం13 వేల రూపాయలు
చెల్లింపు విధానంనేరుగా లబ్ధిదారుని ఖాతాల్లోకి జమ
అధికారిక వెబ్సైట్అందుబాటులో లేదు

🎯ప్రధాన లక్ష్యాలు

ఈ పథకానికి సంబంధించిన ప్రధాన లక్ష్యము గురించి మనలో చాలామందికి తెలియదు అయితే ఈ క్రింది తెలిపిన ముఖ్యమైన అంశాలు ఈ పథకానికి ప్రధాన అంశాలుగా ఉన్నాయి.

  • విద్యార్థులకు చదువుకొనుటకు నేరుగా ఆర్థిక సహాయం అందించడం.
  • విద్యార్థుల తల్లులకు ఆర్థిక సహాయం అందించడం.
  • కుటుంబానికి ఆర్థిక సహాయం అందించడం.
  • విద్యార్థులను బడికి పంపుటకు ఆర్థిక సహాయం అందించడం.
  • ఈ పథకం ద్వారా విద్యార్థులు చదువుకొనుటకు చొరవ చూపేందుకు ప్రభుత్వం ద్వారా నేరుగా ఆర్థిక సహాయం అందించబడుతుంది.
Talliki Vandanam scheme 2026

🟢వీరికి మాత్రమే పథకం

మీరు సులభంగా ఈ పథకానికి అర్హులా? కాదా? ఈ క్రింద తెలుపబడిన అంశాలను పరిశీలించండి.మీకే సులభంగా ఈ పథకానికి సంబంధించిన అర్హత తెలుస్తుంది.

  • విద్యార్థులు మరియు విద్యార్థి తల్లి ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ నివాసితులై ఉండాలి.
  • విద్యార్థులు విద్యా సంవత్సరంలో కచ్చితంగా 75% హాజరు తప్పనిసరి.
  • బలహీనవర్గాలకు చెందిన కుటుంబాలకు మాత్రమే ఈ పథకం అందించబడుతుంది.
  • ఆధార్ కార్డు లోని చిరునామా ఆంధ్రప్రదేశ్ కు చెందినదై ఉండాలి.
  • విద్యార్థి యొక్క తల్లికి ఖచ్చితంగా బ్యాంకు ఖాతా ఉండాలి.
  • బ్యాంకు ఖాతాకు తప్పనిసరిగా ఆధార్ లింక్ అయ్యి ఉండాలి.

🔴పథకం వీరికి రాదు

మనలో చాలామందికి తెలియని కొన్ని సందర్భాలు ఈ పథకానికి అనర్హుల జాబితాలోకి మన వివరాలు చేర్చబడతాయి ఆ వివరాలు ఈ క్రింది విధంగా ఉన్నవి.

👉 ఇతర రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు మరియు విద్యార్థి తల్లి.

👉 ఆధార్ కార్డు లోని చిరునామా ఆంధ్రప్రదేశ్ కు చెందని వారు.

👉 ప్రభుత్వ ఉద్యోగి ఉన్న విద్యార్థులు.

👉 కుటుంబంలో నాలుగు చక్రాల వాహనం కలిగిన విద్యార్థులు (Auto,Taxi,Tractor) మినహాయింపు ఉంది.

👉 3 యూనిట్లు కంటే ఎక్కువ విద్యుత్ వినియోగం ఉపయోగించిన వారు.

👉 7 ఎకరాల కంటే ఎక్కువ వ్యవసాయ భూమి కలిగిన కుటుంబాలు.

👉 పట్టణ ప్రాంతాల్లో 1000 చదరపు అడుగుల కంటే విస్తీర్ణం ఎక్కువ స్థలం కలిగిన విద్యార్థులు.

Talliki Vandanam scheme 2026

💻దరఖాస్తు విధానం

ఈ పథకానికి దరఖాస్తు చేయాలి అనుకుంటే కచ్చితంగా మీరు ఈ క్రింది అంశాలను పరిశీలించాలి.

  • దరఖాస్తులను మీరు నేరుగా గ్రామ వార్డు సచివాలయం ద్వారా సమర్పించవచ్చు.

📝అవసరమైన పత్రాలు

👉 తల్లి మరియు విద్యార్థి యొక్క ఆధార్ కార్డు

👉 విద్యార్థి యొక్క పాఠశాల మరియు కళాశాల వివరాలు

👉 రేషన్ కార్డు

👉 కుల ధ్రువీకరణ పత్రం

India Postal GDS Short list Pdf-2026
India Postal GDS Short list Pdf-2026:

👉 తల్లి యొక్క బ్యాంకు ఖాతా

👉పని చేస్తున్న మొబైల్ నెంబర్

15 వేల రూపాయలు కాదు 13వేల రూపాయలు మాత్రమే

👉 తల్లికి వందనం పథకానికి (Talliki Vandanam scheme 2026 ) సంబంధించి లబ్ధిదారులకు 15 వేల రూపాయలను ప్రకటించినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వము కేవలం 13 వేల రూపాయలు మాత్రమే విద్యార్థి యొక్క తల్లి ఖాతాల్లోకి జమ చేస్తుంది.

💵Talliki Vandanam scheme 2026 పేమెంట్ చూసుకునే విధానం

👉 తల్లికి వందనం పథకానికి సంబంధించిన డబ్బులను మీరు మీ Bank ఖాతాలకు పడినప్పుడు మీకు బ్యాంకు లింక్ అయినటువంటి మొబైల్ నెంబర్ కి మెసేజ్ రావడం జరుగుతుంది.

👉 NBM పోర్టల్ ద్వారా మీ పేమెంట్ స్టేటస్ చెక్ చేసుకోవచ్చు.

👉 తల్లికి వందనం డబ్బులు మీకు పడకపోతే మీరు ఫిర్యాదులు కూడా చేసుకోవచ్చు.

NBM పోర్టల్ ద్వారా ఇలా చూసుకోండి

Step 1: మీ మొబైల్ లో గూగుల్ క్రోమ్ ఓపెన్ చేయండి.

Step 2: search లో ఏపీ సేవ పోర్టల్ టైప్ చేసి సెర్చ్ చేయండి.

Step 3: పోర్టల్ చివరలో “BM Application Status” పైన click చేయండి.

Step 4: Scheme Option లో Talliki vandanam సెలెక్ట్ చేసుకోండి.

Step 5: Year Option లో ప్రస్తుత సంవత్సరాన్ని సెలెక్ట్ చేయండి.

Step 6: Adhar Number Option లో తల్లి యొక్క ఆధార్ నెంబర్ ను నమోదు చేయండి.

Step 7: Get Otp మీద క్లిక్ చేయండి.

Step 8: ఓటిపిని నమోదు చేయండి.

📌Talliki Vandanam scheme 2026 పేమెంట్ రాని సందర్భాలు

👉 ఇతర రాష్ట్రాల విద్యార్థులకు తల్లికి వందనం పథకానికి సంబంధించిన అర్హత ఉండదు.

👉 ఇచ్చిన బ్యాంకు ఖాతాకు ఆధార్ లింక్ లేకపోవడం వల్ల కూడా ఈ పథకానికి సంబంధించిన డబ్బులు మీ ఖాతాలకు పడవు.

👉 NPCI Status Active లో లేకపోవడం.

👉 Talliki Vandanam scheme 2026 పథకం విద్యార్థికి హాజరు శాతము 75% కంటే ఎక్కువగా ఉండకపోవడము.

AP POLYCET - 2026 Notification
AP POLYCET – 2026 NOTIFICATION:Application&Important dates

Talliki Vandanam scheme 2026 Important Links

BM Poral Link Click here

🔰ముగింపు

తల్లికి వందనం పథకం ద్వారా విద్యార్థుల యొక్క తల్లి ఖాతాలకు డబ్బులు జమ చేయడమే కాదు, ఆర్థిక భరోసా అందించడం ఈ పథకానికి ప్రధాన లక్ష్యంగా కూటమి ప్రభుత్వము అమలు చేస్తోంది.

📍తరచుగా అడిగే ప్రశ్నలు

🟢 తల్లికి వందనం పథకం ద్వారా ఎప్పుడు ప్రారంభించారు?

జవాబు: ఈ పథకాన్ని కూటమి ప్రభుత్వము జూన్ 12 2025 సంవత్సరంలో ప్రారంభించింది.

🟢 తల్లికి వందనం పథకం ద్వారా ఎంత డబ్బులు వస్తాయి?

జవాబు: 13 వేల రూపాయలు మాత్రమే విద్యార్థి యొక్క తల్లి ఖాతాలకు జమవుతాయి.

🟢 ఈ పథకం ద్వారా ఏ విద్యార్థులకు అర్హత లభిస్తుంది?

జవాబు: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గుర్తించబడినటువంటి పాఠశాల లేదా కళాశాలలో ఒకటవ తరగతి నుంచి 12వ తరగతి అంటే ఇంటర్మీడియట్ వరకు చదువుతున్నటువంటి విద్యార్థులకు మాత్రమే జమవుతాయి.

🟢 ఈ పథకం ద్వారా ఇంట్లో ఎంతమందికి డబ్బులు వస్తాయి ?

జవాబు: ఇంట్లో ఎంతమంది చదువుకుంటూ ఉంటే అంతమందికి డబ్బులను వేస్తారు.

🟢 బ్యాంకు అకౌంట్ తప్పనిసరి ఉండాలా ?

జవాబు: ఉండాలి ఉంటేనే మీ ఖాతాలకు DBT విధానంలో డబ్బులు జమ అవుతాయి.

🟢 DBT అంటే ఏమిటి ?

జవాబు: Direct Beneficiary Transfer ( నేరుగా లబ్ధిదారునికి చెల్లింపులు ).

🟢 మనమిత్ర వాట్సాప్ గవర్నమెంట్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చా?

జవాబు: అవును. ఫిర్యాదు చేయవచ్చు.

Leave a Comment