AP FREE SWEING MACHINE SCHEME-2026: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు మహిళా దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఒక కొత్త పథకాన్ని ప్రారంభించబోతున్నట్లు సమాచారం. ఈ పథకాన్ని ఆదరణ 3.O ప్రభుత్వము ప్రారంభించనుంది. ఈ పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు ఉచిత కుట్టుమిషన్లు మరియు శిక్షణను ఇవ్వనుంది. గతంలో ఆదరణ 2.O పథకం ద్వారా లబ్ధిదారులు గుర్తింపబడి శిక్షణ పూర్తి చేసుకొని ఉచిత కుట్టుమిషన్లను పొందారు. ప్రస్తుతము మార్చి నెలలో ఈ AP FREE SWEING MACHINE SCHEME-2026 పథకానికి సంబంధించినటువంటి దరఖాస్తుల ప్రక్రియను ప్రారంభించింది. పూర్తి వివరాలు వివరంగా ఇచ్చాను,పూర్తిగా చూడండి.
Overview of Adarana 3.O Scheme
| అంశాలు | వివరణ |
| పథకం పేరు | ఆదరణ 3.O |
| ప్రయోజనం | మహిళలకు ఉచిత కుట్టు మిషన్లు, శిక్షణ |
| అర్హులు | రాష్ట్రంలో బలహీన వర్గాలకు చెందిన మహిళలు |
| దరఖాస్తు విధానం | గ్రామ వార్డు సచివాలయాల ద్వారా |
| శిక్షణ కాలం లేదు | 30-60 రోజుల వ్యవధి (75% హాజరు తప్పనిసరి) |
అర్హతలు
- మహిళలు ఆంధ్రప్రదేశ్ నివాసితులై ఉండాలి.
- మహిళల వయస్సు 18 సంవత్సరాలనుంచి 50 సంవత్సరాల మధ్యలో ఉండాలి.
- ఆధార్ కార్డు తప్పనిసరి.
- మహిళలకు రేషన్ కార్డు తప్పనిసరి.
- గ్రామీణ ప్రాంతాల్లోని మహిళల కుటుంబ సంవత్సర 2 లక్షల రూపాయల లోపల ఉండాలి.
- పట్టణ ప్రాంతాల్లోని మహిళల కుటుంబ సంవత్సర ఆదాయము 1.5 లక్షల లోపు ఉండాలి.
- వితంతువులకు,వికలాంగులకు మొదటి ప్రాధాన్యత ఉంటుంది.
అప్లికేషన్ చేయు విధానం
- Offline ద్వారా దరఖాస్తు చేయు విధానం:
- అప్లికేషన్ చేయు తేదీ వరకు వేచి ఉండాలి.
- అప్లికేషన్ గ్రామ,వార్డు సచివాలయంలోని అధికారుల ద్వారా స్వీకరించబడుతుంది.
- అప్లికేషన్ తో పాటు తగిన డాక్యుమెంట్స్ ని ఇచ్చి దరఖాస్తు చేయించుకోవాలి.
- ప్రస్తుతానికి అప్లికేషన్ చేయు తేదీ వెలువడ లేదు.
- Online ద్వారా దరఖాస్తు చేయు విధానం:
- Apobmms వెబ్ సైట్ ద్వారా దరఖాస్తుల స్వీకరణ జరుగుతుంది.
- Candidate login ద్వారా దరఖాస్తులు సమర్పించవచ్చు.
కావలసిన డాక్యుమెంట్స్
- ఆధార్ కార్డు (చిరునామా రుజువు కొరకు)
- రేషన్ కార్డు
- ఆదాయ ధ్రువీకరణ పత్రం
- కుల ధ్రువీకరణ పత్రం
- పనిచేస్తున్న మొబైల్ నెంబర్
- పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు
- అప్లికేషన్ ఫారం

శిక్షణ & ప్రయోజనం
- దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు తమ మండల పరిధిలో ఉన్న శిక్షణ కేంద్రానికి రావాల్సి ఉంటుంది.
- శిక్షణ కాలం పూర్తయ్యేంతవరకు ప్రతిరోజు హాజరు వేయించుకోవాలి.
- శిక్షణ కాలపరిమితి 30 రోజుల నుంచి 60 రోజుల మధ్యలో ఉంటుంది.
- శిక్షణ కాలపరమితి పూర్తి అయిన తర్వాత మీకు సర్టిఫికెట్ రావడం జరుగుతుంది.
- సర్టిఫికెట్ వచ్చిన 30 రోజుల వ్యవధిలో మీకు ఉచిత కుట్టు మిషన్ అందించబడుతుంది.
గతంలో పొరపాట్లు
- గతంలో కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల కారణంగా చాలామంది లబ్ధిదారులు తమ శిక్షణ కాలం పూర్తి చేసుకున్న…వారికి సరైన సమయంలో సరియైన సమయంలో కుట్టుమిషన్లు అందించలేకపోయింది.
- కారణం:
- కేంద్రం పథకం అయినా PM విశ్వకర్మ పథకానికి దరఖాస్తు చేసుకోవడం మరియు రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన ఆదరణ 2.O దానికి దరఖాస్తులు చేసుకోవడం.
AP FREE SWEING MACHINE SCHEME-2026 LINKS
| Website Link | Click here |
| Application Link | Coming soon |
FAQs AP FREE SWEING MACHINE SCHEME-2026
ఈ పథకం ఎప్పుడు ప్రారంభిస్తారు?
మహిళా దినోత్సవం సందర్భంగా ఈ పథకాన్ని ప్రారంభించినట్లు సమాచారం.
మహిళలు అందరికీ అవకాశం ఉంటుందా?
అవును.మహిళలు అందరికీ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించునుంది.
ఏ వయసు కలిగిన మహిళలు దరఖాస్తు చేయవచ్చు?
దరఖాస్తు చేయాలనుకున్న మహిళల యొక్క వయస్సు 18 నుంచి 50 సంవత్సరాల మధ్యలో ఉండాలి.
శిక్షణ ఉంటుందా ? కాలపరిమితి ఎంతవరకు ?
దరఖాస్తు చేసిన అభ్యర్థులకు శిక్షణ ఉంటుంది. శిక్షణ కాలం 30 నుంచి 60 రోజుల మధ్యలో ఉంటుంది.












