Ap Indradhanassu Scheme – 2026:ఆంధ్రప్రదేశ్లోని దివ్యాంగులకు ప్రభుత్వము ఇంద్రధనస్సు అనే కొత్త పథకాన్ని ప్రారంభించబోతుంది. Ap Indradhanassu Scheme – 2026 ఈ పథకం ద్వారా దివ్యాంగులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత బస్సు ప్రయాణము సౌకర్యము ఉంటుంది. కొన్ని ప్రత్యేకమైన బస్సులలో 50% రాయితీతో ప్రయాణ సదుపాయం కల్పించనున్నారు. అసెంబ్లీ సమావేశాల్లో ఈ పథకానికి సంబంధించి ఆమోదం లభించింది. ఈ పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వేలాది మంది దివ్యాంగులు,వికలాంగులు ( మగవారు కూడా ) ఉచిత బస్సు సౌకర్యము పొందనున్నారు.
Overview of Ap Indradhanassu Scheme – 2026
| పథకం పేరు | ఇంద్రధనస్సు |
| ప్రయోజనం | వికలాంగులకు, దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణం |
| అర్హులు | వికలాంగులు,దివ్యాంగులు(మగవారు కూడా) |
| వికలాంగత్వం % | కనీసము 40% |
| గుర్తింపు కార్డు | సదరం, UDID Card |
Ap Indradhanassu Scheme – 2026 Key Points
- ఈ పథకం ద్వారా మగవారికి కూడా ఉచిత బస్సు ప్రయాణము కల్పించునున్నారు.
- వికలాంగులు దివ్యాంగులు కనీసము 40% వికలాంగత్వం కలిగి ఉండాలి.
- ఈ పథకం ద్వారా ఐదు రకాల బస్సుల్లో ఉచిత ప్రయాణము ఉంటుంది.
ఈ బస్సులలో మాత్రమే ఉచితం
| పల్లె వెలుగు (Palle velugu) | పూర్తిగా ఉచితం |
| అల్ట్రా పల్లె వెలుగు (Ultra Palle Velugu) | పూర్తిగా ఉచితం |
| ఎక్స్ ప్రెస్ (Express) | పూర్తిగా ఉచితం |
| మెట్రో ఎక్స్ ప్రెస్ (Metro Express) | పూర్తిగా ఉచితం |
| సిటీ ఆర్డినరీ (City Ordinary) | పూర్తిగా ఉచితం |
ఈ బస్సులలో 50% రాయితీ
| నాన్ స్టాప్ (Non Stop) | 50% Free Charge |
| అంతర్ రాష్ట్ర బస్సు (Inter State Vises) | 50% Free Charge |
| సప్తగిరి ఎక్స్ప్రెస్ (Sapthagiri Express) | 50% Free Charge |
| అల్ట్రా డీలక్స్ (Ultra Deluxe) | 50% Free Charge |
ప్రయాణానికి గుర్తింపు కార్డు
- ఇంద్రధనస్సు పథకం ద్వారా లబ్ధి పొందాలి అనుకున్న వారు కచ్చితంగా 40% కంటే ఎక్కువ వికలాంగత్వం కలిగి ఉండాలి.
- దీన్ని రుజువు కొరకు సదరం సర్టిఫికెట్/UDID కార్డు తప్పనిసరి.
- మీరు ప్రయాణం చేస్తున్న సమయంలో ఈ కార్డును చూపించాల్సి ఉంటుంది.
ప్రయోజనాలు
- ఈ పథకం ద్వారా మగవారికి కూడా ఉచిత బస్సు ప్రయాణం అందుతుంది.
- విద్యార్థులకు పాఠశాలలకు, ఉద్యోగులు ఆఫీసులకు ఉచిత బస్సు ప్రయాణం పొందవచ్చు.
- మెడికల్ సర్వీసెస్ కొరకు దూర ప్రయాణాలు చేసేందుకు ఉచిత ప్రయాణం పొందవచ్చు.
FOR MORE DETAILS FOLLOW TELEGRAM CLICK HERE
FAQ’s Ap Indradhanassu Scheme – 2026
1.ఈ పథకం మగవారికి కూడా వస్తుందా?
అవును. ఈ పథకం ద్వారా మగవారికి కూడా ఉచిత బస్సు ప్రయాణము కల్పించబడుతుంది. అయితే మగవారు వికలాంగులు లేదా దివ్యాంగులు అయి ఉండాలి.
2. ఎంత శాతం వికలాంగత్వం ఉండాలి?
40% కంటే ఎక్కువ
3. అన్ని బస్సుల్లో ఉచిత ప్రయాణం ఉంటుందా?
కొన్ని బస్సులలో మాత్రమే ఉచిత ప్రయాణము. కొన్ని ప్రత్యేకమైన బస్సులలో 50% రాయితీ ఉంటుంది.
4. గుర్తింపు కార్డు ఉండాలా?
అవును. కేంద్రం లేదా రాష్ట్రం అందించే గుర్తింపు కార్డు తప్పనిసరి. (Sadarem/UDID)












