పథకం పరిచయం :
Talliki Vandanam scheme 2026: తల్లికి వందనం పథకం అనేది ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సూపర్ సిక్స్ పథకాల్లో ముఖ్యమైన పథకం. ఈ పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థుల యొక్క తల్లి ఖాతాలకు 13,000 చొప్పున జమ చేయబడుతుంది. ఈ పథకానికి సంబంధించిన పూర్తి అర్హతలను మరియు లబ్ధిదారుల యొక్క జాబితాను తెలుసుకొనుటకు ఈ సమాచారాన్ని పూర్తిగా చదవండి.
Talliki Vandanam scheme 2026 ముఖ్యమైన అంశాలు
| పథకం పేరు | తల్లికి వందనం |
| రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం (కూటమి ప్రభుత్వం) |
| ప్రధాన లక్ష్యం | విద్యార్థుల తల్లులకు ఆర్థిక సహాయం అందించడం |
| సంబంధిత శాఖ | మహిళా శిశు సంక్షేమ శాఖ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం |
| లబ్ధిదారులు | విద్యార్థుల యొక్క తల్లులు (తల్లి లేని పక్షంలో సంరక్షకులు) |
| ఆర్థిక సహాయం | 13 వేల రూపాయలు |
| చెల్లింపు విధానం | నేరుగా లబ్ధిదారుని ఖాతాల్లోకి జమ |
| అధికారిక వెబ్సైట్ | అందుబాటులో లేదు |
🎯ప్రధాన లక్ష్యాలు
ఈ పథకానికి సంబంధించిన ప్రధాన లక్ష్యము గురించి మనలో చాలామందికి తెలియదు అయితే ఈ క్రింది తెలిపిన ముఖ్యమైన అంశాలు ఈ పథకానికి ప్రధాన అంశాలుగా ఉన్నాయి.
- విద్యార్థులకు చదువుకొనుటకు నేరుగా ఆర్థిక సహాయం అందించడం.
- విద్యార్థుల తల్లులకు ఆర్థిక సహాయం అందించడం.
- కుటుంబానికి ఆర్థిక సహాయం అందించడం.
- విద్యార్థులను బడికి పంపుటకు ఆర్థిక సహాయం అందించడం.
- ఈ పథకం ద్వారా విద్యార్థులు చదువుకొనుటకు చొరవ చూపేందుకు ప్రభుత్వం ద్వారా నేరుగా ఆర్థిక సహాయం అందించబడుతుంది.

🟢వీరికి మాత్రమే పథకం
మీరు సులభంగా ఈ పథకానికి అర్హులా? కాదా? ఈ క్రింద తెలుపబడిన అంశాలను పరిశీలించండి.మీకే సులభంగా ఈ పథకానికి సంబంధించిన అర్హత తెలుస్తుంది.
- విద్యార్థులు మరియు విద్యార్థి తల్లి ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ నివాసితులై ఉండాలి.
- విద్యార్థులు విద్యా సంవత్సరంలో కచ్చితంగా 75% హాజరు తప్పనిసరి.
- బలహీనవర్గాలకు చెందిన కుటుంబాలకు మాత్రమే ఈ పథకం అందించబడుతుంది.
- ఆధార్ కార్డు లోని చిరునామా ఆంధ్రప్రదేశ్ కు చెందినదై ఉండాలి.
- విద్యార్థి యొక్క తల్లికి ఖచ్చితంగా బ్యాంకు ఖాతా ఉండాలి.
- బ్యాంకు ఖాతాకు తప్పనిసరిగా ఆధార్ లింక్ అయ్యి ఉండాలి.
🔴పథకం వీరికి రాదు
మనలో చాలామందికి తెలియని కొన్ని సందర్భాలు ఈ పథకానికి అనర్హుల జాబితాలోకి మన వివరాలు చేర్చబడతాయి ఆ వివరాలు ఈ క్రింది విధంగా ఉన్నవి.
👉 ఇతర రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు మరియు విద్యార్థి తల్లి.
👉 ఆధార్ కార్డు లోని చిరునామా ఆంధ్రప్రదేశ్ కు చెందని వారు.
👉 ప్రభుత్వ ఉద్యోగి ఉన్న విద్యార్థులు.
👉 కుటుంబంలో నాలుగు చక్రాల వాహనం కలిగిన విద్యార్థులు (Auto,Taxi,Tractor) మినహాయింపు ఉంది.
👉 3 యూనిట్లు కంటే ఎక్కువ విద్యుత్ వినియోగం ఉపయోగించిన వారు.
👉 7 ఎకరాల కంటే ఎక్కువ వ్యవసాయ భూమి కలిగిన కుటుంబాలు.
👉 పట్టణ ప్రాంతాల్లో 1000 చదరపు అడుగుల కంటే విస్తీర్ణం ఎక్కువ స్థలం కలిగిన విద్యార్థులు.

💻దరఖాస్తు విధానం
ఈ పథకానికి దరఖాస్తు చేయాలి అనుకుంటే కచ్చితంగా మీరు ఈ క్రింది అంశాలను పరిశీలించాలి.
- దరఖాస్తులను మీరు నేరుగా గ్రామ వార్డు సచివాలయం ద్వారా సమర్పించవచ్చు.
📝అవసరమైన పత్రాలు
👉 తల్లి మరియు విద్యార్థి యొక్క ఆధార్ కార్డు
👉 విద్యార్థి యొక్క పాఠశాల మరియు కళాశాల వివరాలు
👉 రేషన్ కార్డు
👉 కుల ధ్రువీకరణ పత్రం
👉 తల్లి యొక్క బ్యాంకు ఖాతా
👉పని చేస్తున్న మొబైల్ నెంబర్
15 వేల రూపాయలు కాదు 13వేల రూపాయలు మాత్రమే
👉 తల్లికి వందనం పథకానికి (Talliki Vandanam scheme 2026 ) సంబంధించి లబ్ధిదారులకు 15 వేల రూపాయలను ప్రకటించినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వము కేవలం 13 వేల రూపాయలు మాత్రమే విద్యార్థి యొక్క తల్లి ఖాతాల్లోకి జమ చేస్తుంది.
💵Talliki Vandanam scheme 2026 పేమెంట్ చూసుకునే విధానం
👉 తల్లికి వందనం పథకానికి సంబంధించిన డబ్బులను మీరు మీ Bank ఖాతాలకు పడినప్పుడు మీకు బ్యాంకు లింక్ అయినటువంటి మొబైల్ నెంబర్ కి మెసేజ్ రావడం జరుగుతుంది.
👉 NBM పోర్టల్ ద్వారా మీ పేమెంట్ స్టేటస్ చెక్ చేసుకోవచ్చు.
👉 తల్లికి వందనం డబ్బులు మీకు పడకపోతే మీరు ఫిర్యాదులు కూడా చేసుకోవచ్చు.
NBM పోర్టల్ ద్వారా ఇలా చూసుకోండి
Step 1: మీ మొబైల్ లో గూగుల్ క్రోమ్ ఓపెన్ చేయండి.
Step 2: search లో ఏపీ సేవ పోర్టల్ టైప్ చేసి సెర్చ్ చేయండి.
Step 3: పోర్టల్ చివరలో “BM Application Status” పైన click చేయండి.
Step 4: Scheme Option లో Talliki vandanam సెలెక్ట్ చేసుకోండి.
Step 5: Year Option లో ప్రస్తుత సంవత్సరాన్ని సెలెక్ట్ చేయండి.
Step 6: Adhar Number Option లో తల్లి యొక్క ఆధార్ నెంబర్ ను నమోదు చేయండి.
Step 7: Get Otp మీద క్లిక్ చేయండి.
Step 8: ఓటిపిని నమోదు చేయండి.
📌Talliki Vandanam scheme 2026 పేమెంట్ రాని సందర్భాలు
👉 ఇతర రాష్ట్రాల విద్యార్థులకు తల్లికి వందనం పథకానికి సంబంధించిన అర్హత ఉండదు.
👉 ఇచ్చిన బ్యాంకు ఖాతాకు ఆధార్ లింక్ లేకపోవడం వల్ల కూడా ఈ పథకానికి సంబంధించిన డబ్బులు మీ ఖాతాలకు పడవు.
👉 NPCI Status Active లో లేకపోవడం.
👉 Talliki Vandanam scheme 2026 పథకం విద్యార్థికి హాజరు శాతము 75% కంటే ఎక్కువగా ఉండకపోవడము.
Talliki Vandanam scheme 2026 Important Links
BM Poral Link Click here
🔰ముగింపు
తల్లికి వందనం పథకం ద్వారా విద్యార్థుల యొక్క తల్లి ఖాతాలకు డబ్బులు జమ చేయడమే కాదు, ఆర్థిక భరోసా అందించడం ఈ పథకానికి ప్రధాన లక్ష్యంగా కూటమి ప్రభుత్వము అమలు చేస్తోంది.
📍తరచుగా అడిగే ప్రశ్నలు
🟢 తల్లికి వందనం పథకం ద్వారా ఎప్పుడు ప్రారంభించారు?
జవాబు: ఈ పథకాన్ని కూటమి ప్రభుత్వము జూన్ 12 2025 సంవత్సరంలో ప్రారంభించింది.
🟢 తల్లికి వందనం పథకం ద్వారా ఎంత డబ్బులు వస్తాయి?
జవాబు: 13 వేల రూపాయలు మాత్రమే విద్యార్థి యొక్క తల్లి ఖాతాలకు జమవుతాయి.
🟢 ఈ పథకం ద్వారా ఏ విద్యార్థులకు అర్హత లభిస్తుంది?
జవాబు: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గుర్తించబడినటువంటి పాఠశాల లేదా కళాశాలలో ఒకటవ తరగతి నుంచి 12వ తరగతి అంటే ఇంటర్మీడియట్ వరకు చదువుతున్నటువంటి విద్యార్థులకు మాత్రమే జమవుతాయి.
🟢 ఈ పథకం ద్వారా ఇంట్లో ఎంతమందికి డబ్బులు వస్తాయి ?
జవాబు: ఇంట్లో ఎంతమంది చదువుకుంటూ ఉంటే అంతమందికి డబ్బులను వేస్తారు.
🟢 బ్యాంకు అకౌంట్ తప్పనిసరి ఉండాలా ?
జవాబు: ఉండాలి ఉంటేనే మీ ఖాతాలకు DBT విధానంలో డబ్బులు జమ అవుతాయి.
🟢 DBT అంటే ఏమిటి ?
జవాబు: Direct Beneficiary Transfer ( నేరుగా లబ్ధిదారునికి చెల్లింపులు ).
🟢 మనమిత్ర వాట్సాప్ గవర్నమెంట్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చా?
జవాబు: అవును. ఫిర్యాదు చేయవచ్చు.










