Ap Free Land Registration-2026:Succession Agriculture land Registration Process

Table of Contents

Ap Free Land Registration-2026: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము వారసత్వ భూముల రిజిస్ట్రేషన్ల కొరకు దరఖాస్తు ప్రక్రియలను ప్రారంభించింది. కేవలం 100/- నుంచి 1,000/-  ఫీజుతో రిజిస్ట్రేషన్ జరపబడుతున్నవి. మీరు మీ వారసత్వ భూమిని రిజిస్ట్రేషన్ చేసుకోవాలనుకుంటే ఈ పోస్టును పూర్తిగా చదవండి. 

వారసత్వ భూములు మీ పూర్వీకులు గనక మరణించినట్లయితే వారి వారసత్వంగా వచ్చినటువంటి వ్యవసాయ భూమిని మాత్రమే రిజిస్ట్రేషన్ చేసుకునేదనుకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. దీనివల్ల కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు తొలగి చట్టబద్ధంగా వారి యొక్క వారసత్వ భూములను చాలా తక్కువ ఖర్చుతో పంచుకొనవచ్చు.

గమనిక : వారసత్వ వ్యవసాయ భూములకు మాత్రమే రిజిస్ట్రేషన్ జరపబడును.

Ap Free Land Registration-2026 : Succession Agriculture land Registration

అంశంవివరాలు
పథకం పేరు₹100 వారసత్వ భూముల రిజిస్ట్రేషన్ పథకం
అమలు రాష్ట్రంఆంధ్రప్రదేశ్
వర్తించే భూములువారసత్వంగా లభించిన వ్యవసాయ భూములు
రిజిస్ట్రేషన్ ఫీజుభూమి విలువ ₹10 లక్షల లోపు అయితే ₹100
విలువ ₹10 లక్షల పైగా అయితే₹1,000 రిజిస్ట్రేషన్ ఫీజు
వర్తించే వారికిచట్టపరమైన వారసులకు మాత్రమే (Legal Heirs)
వర్తించని లావాదేవీలుకొనుగోలు, అమ్మకం, ఒప్పంద పత్రాలు, గిఫ్ట్ డీడ్ మొదలైనవి
రిజిస్ట్రేషన్ చేసే స్థలంగ్రామ / వార్డు సచివాలయం లేదా రిజిస్ట్రార్ కార్యాలయం
పథకం లక్ష్యంరైతులకు భారం తగ్గించడం, భూమి రికార్డులు అప్‌డేట్ చేయడం, వివాదాలు తగ్గించడం
అవసరమైన పత్రాలువారసుల ధృవీకరణ, ఆధార్, భూమి పాస్బుక్, రోఆర్ రికార్డులు మొదలైనవి

రిజిస్ట్రేషన్ చేసుకునే విధానం

  • రిజిస్ట్రేషన్ చేయుట కొరకు సబ్ రిజిస్టర్ ఆఫీస్ నందు మాత్రమే రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. 
  • కుటుంబ సభ్యులు వారసత్వ ఆస్తి ( వ్యవసాయ భూములను ) పంచుకోవాలి అనుకుంటే ఒక అంగీకార పత్రంతో ఆస్తిని పంచుకొని రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. 
Ap Free Land Registration-2026

రిజిస్ట్రేషన్ కు ఫీజు

  • మార్కెట్ విలువ 10 లక్షల లోపల ఉండి నట్లయితే 100/- (స్టాంప్ డ్యూటీ) ఫీజుతో రిజిస్ట్రేషన్ చేయబడును. 
  • ప్రస్తుతం మీకు వారసత్వంగా వచ్చిన వ్యవసాయ భూమిని రిజిస్ట్రేషన్ చేసుకోవాలనుకుంటే ప్రస్తుతం ఉన్న మార్కెట్ విలువ ( వారసత్వంగా వచ్చిన భూమి విలువ ) 10 లక్షల కంటే పైగా ఉంటే దానికి రిజిస్ట్రేషన్ ఫీజు 1000/- (స్టాంప్ డ్యూటీ) వసూలు చేయబడుతుంది. 
10,00,000 Below Land Value100/-
10,00,000 Above Land Value1000/-

Ap Free Land Registration-2026 రిజిస్ట్రేషన్ నిబంధనలు

  • వారసత్వ భూమిని రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అనుకుంటే వారసత్వ భూమి యజమాని మరణించి ఉండాలి. 
  • వారసులు పేరు మీద వీలునామా లేని భూములకు మాత్రమే రిజిస్ట్రేషన్ జరపబడును. 
  • వారసులు భూమిని పంచుకోవాలంటే కచ్చితంగా ఒక అంగీకార పత్రం పై పంచుకున్న భూముల వివరాలుతోపాటు సాక్షుల సంతకాలు తప్పనిసరి.
  • పార్టిషన్ డీడ్ రిజిస్ట్రేషన్ తప్పనిసరి.Mutation సరిపోదు.

సమర్పించాల్సిన డాక్యుమెంట్స్

  • చట్టబద్ధమైన భూమి వివరాలు 
  • వారసత్వ ధ్రువీకరణ పత్రం
  • పట్టాదారు పాస్ బుక్ 
  • కుటుంబ సభ్యుల ఆధార్ కార్డులు 
  • కుటుంబ సభ్యుల అంగీకార పత్రం

లాభాలు

  • చాలా తక్కువ ఖర్చుతో రిజిస్ట్రేషన్ పూర్తవుతుంది.
  • ఇలా రిజిస్ట్రేషన్ చేసుకోవడం ద్వారా భవిష్యత్తులో కుటుంబాలం మధ్య భూమి విషయంలో వివాదాలు ఉండవు. 
  • Mutation ఆలస్యం వంటి సమస్యలు తగ్గిపోతాయి. 
  • ప్రస్తుతము అందించిన స్టాంపు డ్యూటీ ఫీజు అందరికీ అందుబాటులో ఉంది. (100 – 1000).

For More Schemes Updates Join here

Ap Free Land Registration-2026 FAQs

₹100 రిజిస్ట్రేషన్ పథకం ఎవరికీ వర్తిస్తుంది?

ఈ పథకం వారసత్వంగా వచ్చిన వ్యవసాయ భూములకు మాత్రమే వర్తిస్తుంది. భూమి యజమాని మరణించిన తర్వాత చట్టపరమైన వారసులు ఈ పథకం ద్వారా రిజిస్ట్రేషన్ చేయించుకోవచ్చు.

భూమి కొనుగోలు చేసినప్పుడు కూడా ₹100 కి రిజిస్టర్ చేయించుకోవచ్చా?

కాదు.
ఈ పథకం కొనుగోలు, అమ్మకం, గిఫ్ట్ డీడ్, ఒప్పందాలు వంటి లావాదేవీలకు వర్తించదు.

భూమి విలువ పది లక్షల కంటే ఎక్కువైతే ఎంత రిజిస్ట్రేషన్ ఫీజు?

భూమి మార్కెట్ విలువ ₹10 లక్షల పైగా అయితే రిజిస్ట్రేషన్ ఫీజు ₹1,000 ఉంటుంది.

ఈ రిజిస్ట్రేషన్ ఎక్కడ చేయించుకోవాలి?

రిజిస్ట్రేషన్ కార్యాలయంలో రిజిస్టర్ చేసుకోవచ్చు.

రిజిస్ట్రేషన్ కోసం అవసరమైన పత్రాలు ఏమి?

  • ఆధార్ కార్డు
  • వారసత్వ ధృవీకరణ (Legal heir certificate)
  • భూమి రోఆర్ / ఆర్ఓఆర్ రికార్డు
  • పాస్‌బుక్ / అధికారం పత్రాలు
  • మరణ ధృవీకరణ పత్రం

ఈ పథకం ద్వారా రిజిస్టర్ చేస్తే భూమి రికార్డులు వెంటనే అప్‌డేట్ అవుతాయా?

అవును. రిజిస్ట్రేషన్ జరిగిన వెంటనే MeeBhoomi / Dharani / Land records portal లో రికార్డులు అప్‌డేట్ అవుతాయి.

ఈ పథకం రైతులకు ఎలా ఉపయోగం?

ఈ పథకం ద్వారా:

  • రిజిస్ట్రేషన్ ఖర్చు తగ్గుతుంది
  • భూమిపై యజమాన్యం చట్టపరంగా స్పష్టత వస్తుంది
  • భవిష్యత్తులో రుణాలు, అమ్మకం లేదా పన్ను సంబంధిత సమస్యలు ఉండవు

ఈ పథకం కరోనా కాలం లేదా తాత్కాలిక పథకమా?

కాదు. ఇది ప్రభుత్వం శాశ్వత విధానంగా అమలులోకి తెచ్చిన పథకం.

ఒక కుటుంబంలో పలువురు వారసులు ఉంటే ఎలా?

అన్ని వారసుల పేర్లకు రిజిస్ట్రేషన్ చేయించుకోవచ్చు
లేదా
ఒకరికి హక్కులు బదిలీ చేసేలా ఒప్పందం ఉంటే ఒకరిపేరుతో కూడా చేయించుకోవచ్చు.

Leave a Comment