Andhra Pradesh Farmers 7000:అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించిన నిధులను రాష్ట్ర ప్రభుత్వం,పిఎం కిసాన్ నిధులను కేంద్ర ప్రభుత్వము రైతులు యొక్క ఖాతాలకు జమ చేస్తాయి.అయితే ఈ రెండు పథకాల డబ్బులు మీ ఖాతాలకు చేరాయా?లేదా? అనేది తెలుసుకొనుటకు ఈ సమాచారం పూర్తిగా చదవండి. చివరిలో మీకు పేమెంట్ స్టేటస్ చెక్ చేసుకునే లింక్స్ ఉన్నవి.
Andhra Pradesh Farmers 7000- Annadatha Sukhibava and PM Kisan Payment Status
అన్నదాత సుఖీభవ పథకం ద్వారా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సంవత్సరానికి మూడు విడతల సాయంగా 14,000 రూపాయలను రైతులు యొక్క ఖాతాలకు జమ చేస్తుంది.
పీఎం కిసాన్ పథకం ద్వారా రైతులకు కేంద్ర ప్రభుత్వము మూడు విడతల సాయంగా 6000 రూపాయలను రైతులు యొక్క ఖాతాలకు జమ చేస్తుంది.
ప్రస్తుత సమాచారం: 19/11/2025 ఈ రోజున రైతులకు కేంద్ర ప్రభుత్వం ద్వారా PM కిసాన్ 21వ విడత నిధులు అన్నదాత సుఖీభవ 2 వ విడత నిధులు రైతులకు జమ కానున్నవి.
Andhra Pradesh Farmers 7000 – 2nd Payment Status
అన్నదాత సుఖీభవ పథకం ద్వారా రెండవ విడత నిధులను కడప జిల్లా నుంచి సీఎం చంద్రబాబు నాయుడు గారు విడుదల చేయనున్నారు.46.62 లక్షల మంది రైతులు యొక్క ఖాతాలకు ఈ పథకం ద్వారా లబ్ధి చేకూరనున్నది. ఈ పథకానికి సంబంధించిన నిధులను మీ ఖాతాలకు వచ్చాయా?లేదో? తెలుసుకొనుటకు ఈ క్రింది విధంగా ప్రయత్నం చేయండి.

payment status checking process
- ముందుగా అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించిన Official Web page ని ఓపెన్ చేయండి. Website link
- Know Your Status లేదా Check Your Status Link పైన క్లిక్ చేయండి.
- రైతు యొక్క ఆధార్ నెంబర్ నమోదు చేయండి.
- పక్కన కనిపిస్తున్న Captcha (పసుపు రంగులో ఉన్న అక్షరాలు) Captcha బాక్సులో నమోదు చేయండి.
- Search అనే ఆప్షన్ ని క్లిక్ చేయండి.
- ముందుగా రైతు యొక్క వివరాలు కనిపిస్తాయి. చివరలో పేమెంట్ వివరాలు కనిపిస్తాయి.
గమనిక
ప్రభుత్వం నిధులు విడుదల చేసిన రోజున పేమెంట్ స్టేటస్ ఓపెన్ కాదు, ప్రభుత్వం నిధుల విడుదల డేటాను వెబ్ సైట్ లో నమోదు చేసిన తర్వాతనే కనిపిస్తాయి.
PM Kishan 21st installment Payment Status
పీఎం కిసాన్ పథకం ద్వారా రైతులకు ఇప్పటికే 20 విడతల సాయం రైతుల యొక్క ఖాతాలకు చేరినది. తాజాగా తమిళనాడు నుంచి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు 21వ విడతకు సంబంధించిన నిధులను రైతుల యొక్క ఖాతాలకు జమ చేయనున్నారు.
పిఎం కిసాన్ నిధులు మీ ఖాతాలకు చేరినవా లేదా తెలుసుకొనుటకు ఈ క్రింది విధంగా ప్రయత్నించండి.
Payment Status checking process
- ముందుగా PM Kishan వెబ్సైట్ సందర్శించండి.Website link
- Know Your Status అనే ఆప్షన్ ఎంచుకోండి.
- మీ పిఎం కిసాన్ ఖాతాకు సంబంధించిన రిజిస్ట్రేషన్ నెంబర్ను నమోదు చేయండి. Eg: (AP12345678)
- పక్కన కనిపిస్తున్న Captcha కోడ్ Enter Captcha Code బాక్సులో నమోదు చేయండి.
- Get aadhar Otp మీద క్లిక్ చేయండి.
- పిఎం కిసాన్ నమోదు చేయబడిన మొబైల్ నెంబర్ కి ఓటిపి వెళ్తుంది.
- OTP వెరిఫై చేసుకోండి.
- మీయొక్క పేమెంట్ వివరాలు కనిపిస్తాయి.
గమనిక
పీఎం కిసాన్ నిధులు విడుదల చేసిన రోజున పేమెంట్ వివరాలు కనిపించవు. ఒక వారం రోజుల తర్వాత పేమెంట్ స్టేటస్ కనిపిస్తుంది.
పిఎం కిసాన్ పేమెంట్ రాకపోతే ఏం చేయాలి?
- పిఎం కిసాన్ నిధులు మీకు రాకపోయినా ఎడల మీరు బెనిఫిషరీ లిస్టులో ఉన్నారా?లేదా? Check చేసుకోండి.
- బెనిఫిషరీ లిస్టులో మీ పేరు లేకపోతే పేమెంట్ రాదు.
Website Links
Anndatha sukhibava
Pm kishan
FAQs
1. Annadatha Sukhibhava పథకం అంటే ఏమిటి?
Annadatha Sukhibhava పథకం అనేది రైతులకు ఆర్థిక సహాయం అందించడానికి ప్రభుత్వం అందిస్తున్న ఒక ప్రయోజనకరమైన స్కీమ్. ఈ పథకం ద్వారా అర్హత కలిగిన రైతులకు నేరుగా వారి బ్యాంక్ అకౌంట్‌కి ఆర్థిక సాయం డిపాజిట్ చేస్తారు.
ఈ పథకం ద్వారా రైతులకు ఎంత మొత్తం వస్తుంది?
ఈ పథకం ద్వారా 3 విడతల్లో 14,000 మరియు పిఎం-కిసాన్ ద్వారా 6,000 రైతుల ఖాతాలకు చేరుతుంది.
Aadhaar-KYC తప్పనిసరా?
అవును. Annadatha Sukhibhava తో సహా చాలా రైతు పథకాలకూ Aadhaar e-KYC తప్పనిసరి.
e-KYC పూర్తిగా అవ్వకపోతే payment నిలిచిపోతుంది.
Payment failed అని చూపిస్తే ఏమి చేయాలి?
Failed అంటే సాధారణంగా:
- పేరులో spelling తప్పు
- IFSC code తప్పు
- A/C number mismatch
- Aadhaar mismatch
ఇలాంటి సమస్యలు.
ఈ సమస్యను RBK లో వెంటనే రిపేర్ చేయించాలి.
Payment రాకపోయినా portal లో “Credited” అని చూపిస్తే?
ఇది బ్యాంక్ technical delay.
24–72 గంటల్లో amount reflect అవుతుంది.
అయినా రాకపోతే బ్యాంక్ బ్రాంచ్ లో మిని స్టేట్‌మెంట్ తీసుకోండి.
రైతు మరణించాక payment ఎవరికైనా వస్తుందా?
చాలా పథకాలలో, రైతు మరణించినట్లయితే హక్కుదారుల పేరుతో కొత్త నమోదు చేయాల్సి ఉంటుంది. పాత ఖాతాకు ప్రభుత్వం డబ్బు పంపదు.
Mobile number మార్చితే ఏమైనా సమస్యలు వస్తాయా?
పోర్టల్ OTP మరియు e-KYC కోసం మొబైల్ నంబర్ అవసరం.
కాబట్టి కొత్త నంబర్‌ను RBK లో అప్డేట్ చేయడం మంచిది.











