Ap Unified Family survey 2025-26: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలకు అన్ని శాఖలకు ఉపయోగపడే విధంగా డేటాను ఒకే చోట చేర్చే విధంగా సర్వేను ప్రారంభించింది. ప్రభుత్వం ద్వారా నియమింపబడిన సిబ్బంది ద్వారా ప్రతి కుటుంబానికి సంబంధించిన సమాచారాన్ని సేకరించి ఒక కార్డు రూపంలో పొందుపరచనున్నారు. భవిష్యత్తులో వచ్చి అన్ని ప్రభుత్వ పథకాలు మరియు సేవలు ఈ కార్డు ద్వారానే జరగనున్నాయి.
ప్రస్తుతం ప్రభుత్వం ద్వారా నింపబడిన సిబ్బంది ప్రతి కుటుంబ సభ్యుల వివరాలను వారికి ఇచ్చిన యాప్ నందు నమోదు చేసుకుంటారు. డిసెంబర్ 15 నుంచి జనవరి 12వ తేదీ వరకు ఈ సర్వే జరుపబడుతుంది. సర్వేలో పాల్గొని మీ వివరాలను నమోదు చేయించుకోండి.
గమనిక: Ap Unified Family survey 2025-26 ఈ సర్వేలో కుటుంబ సభ్యులు అందరూ ఉండాల్సిన అవసరం లేదు కుటుంబంలో ఉన్న ఎవరైనా సరే వారి కుటుంబ సభ్యుల వివరాలను నమోదు చేయించుకోవచ్చును.

Ap Unified Family survey 2025-26 – Overview
| Item | Details |
|---|---|
| Survey Name | AP Family Benefit Card Survey / Unified Family Survey (UFS) |
| Department | Government of Andhra Pradesh |
| Aim of the Survey | To collect details of every family in the state and ensure transparent and efficient delivery of government welfare schemes |
| Applicable Areas | All villages and urban areas across Andhra Pradesh |
| Who It Is For | Every family residing in the state of Andhra Pradesh |
| Survey Method | Door-to-door data collection using a mobile application |
| Card Usage | To consolidate details of all government welfare schemes into a single Family Benefit Card |
Ap Unified Family survey 2025-26 : Benefits
- కుటుంబ సభ్యుల వివరాలు ఒకే కార్డ్ లోకి చేర్చడం ద్వారా కుటుంబ పథకాల మరియు ప్రభుత్వ ప్రయోజనాలు సులభంగా తెలుసుకోవటం.
- సులభంగా పథకాలకు ధరఖాస్తు చేయడం.
- అన్నీ శాఖలకు ఉపయోగపడేలా రికార్డ్ నమోదు.
- డూప్లికేట్ లబ్ధిదారులు తొలగింపు
- సేవలు త్వరగా పొందే అవకాశం
- పారదర్శకత పెరుగుతుంది
- కుటుంబ వివరాల అప్డేట్ సులభం.
- భవిష్యత్ ప్రభుత్వ పథకాలకు ఉపయోగం
- డిజిటల్ సేవలకు మద్దతు
- పేద & మధ్యతరగతి కుటుంబాలకు ఎక్కువ లాభం
- ప్రభుత్వ–ప్రజల మధ్య విశ్వాసం
Ap Unified Family survey 2025-26 : Survey
సర్వేను రెండు భాగాలుగా నమోదు చేస్తారు.
- కుటుంబ సభ్యుల వివరాల నమోదు
- కుటుంబ వివరాలు నమోదు
Ap Unified Family survey 2025: Survey Guide
A. కుటుంబ సభ్యుల వివరాలు నమోదు
కుటుంబ సభ్యుల వివరాలు నమోదుకు సంబంధించి ప్రభుత్వం సిబ్బంది ఈ ప్రశ్నలను అడుగుతారు. కుటుంబ సభ్యుడికి సంబంధించిన వివరాలను 4 విభాగాలుగా అడుగుతారు.
Basic Profile
- కుటుంబ సభ్యుని ఆధార్ నంబర్?
- కుటుంబ సభ్యుని పేరు?
- కుటుంబ సభ్యుని లింగము?
- కుటుంబ సభ్యుని మొబైల్ నెంబర్?
- ఎన్ని సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్ లో నివసిస్తున్నారు?
- వివాహిక స్థితి.?
- తండ్రి లేదా భర్త పేరు?
- తండ్రి లేదా భర్త ఆధార్ నెంబర్?
Social Profile
- కుటుంబ సభ్యుని కులము?
- కుటుంబ సభ్యుని మతం?
Education & Skill
- ప్రస్తుతం చదువుకుంటున్నారా.?
- చదువుకుంటున్నట్లయితే ఏం చదువుకుంటున్నారు?
- ఎక్కడ చదువుకుంటున్నారు?
- కుటుంబ సభ్యుని విద్యార్హత..?
- చదువు మధ్యలో ఆపేసి ఉన్నారా?
- ఏదైనా Skill ట్రైనింగ్ తీసుకున్నారా?
- ఏ విభాగంలో ట్రైనింగ్ తీసుకున్నారు?
Employment & Livelihood
- కుటుంబ సభ్యుడు ఉద్యోగం చేస్తున్నారా?
- సొంతంగా వ్యాపారం చేస్తున్నారా?
- నెలసరి ఆదాయం ఎంత?
B. కుటుంబం వివరాలు నమోదు
- Househlod ID
- మీ కుటుంబ సభ్యులు Househlod మ్యాపింగ్ చేయబడ్డారా?
- తప్పుగా కుటుంబ సభ్యులు హౌస్ ఓల్డ్ మ్యాపింగ్ నందు నమోదు చేయబడ్డారా?
- ప్రస్తుతం ఉన్న చిరునామా?
- శాశ్వత చిరునామా?
- Door No?
- Capture Geo-Coordinate?
- కుటుంబం ఇంటి పరిస్థితి ఏంటి?
- బాడుగ ఇంట్లో ఉన్నారా లేక సొంత ఇంట్లో ఉన్నారా?
- నీటి కులాయి కనెక్షన్ ఉన్నదా?
- Lpg కనెక్షన్ కలిగి ఉన్నారా?
- Wifi కనెక్షన్ కలిగి ఉన్నారా?
- మొబైల్ ఫోన్ కలిగి ఉన్నారా?
- టాయిలెట్ ఫెసిలిటీ ఉందా?
- విద్యుత్ పరికరాలు వినియోగించుచున్నారా?
- వాహనాలు కలిగి ఉన్నారా?
- వాహనాలు కలిగి ఉంటే రిజిస్ట్రేషన్ నంబర్లు ఉన్నాయా? ఫోటో తీసుకుంటారు.
- పశు సంపదకు సంబంధించిన పరికరాలు కలిగి ఉన్నారా?
- ఇతర పరికరాలు కలిగి ఉన్నారా?
మరిన్ని ప్రభుత్వ పథకాలకు ఈ గ్రూప్ లో జాయిన్ అవ్వండి Click Here
FAQs
AP Family Benefit Card అంటే ఏమిటి?
ఇది ఒక ఫిజికల్ కార్డ్. దీని ద్వారా ప్రభుత్వం కుటుంబ వివరాలను ఒక కార్డ్ లోకి చేర్చుతుంది.
ఈ కార్డ్ వల్ల ప్రయోజనం ఏమిటి?
ఈ కార్డ్ వల్ల కుటుంబం యొక్క వియవరాలను సులభంగా వెంటనే తెలుసుకోవచ్చు.
ఈ సర్వే ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ప్రారంబం?
ఈ సర్వే డిసెంబర్ 15 నుంచి ప్రారంబం అయ్యి జనవరి 12 కి ముగుస్తుంది.
కార్డ్ ఎప్పుడు ఇస్తారు ?
ఈ కార్డ్ ని ప్రభుత్వం ఏప్రిల్ నెల నుంచి పంపిణీ చేస్తుంది.
సర్వే లో అందరూ పాల్గొనాలా?
సర్వే లో కుటుంబ సభ్యులు ఒక్కరైనా పాల్గొని వివరాలను నమోదు చేయించవచ్చు.
AP Family Benefit Card కి ఫీజు చెల్లించాలా?
లేదు. ఉచితంగా పంపిణీ చేయబడుతుంది.












