Kalalaku rekkalu Scheme 2026:eligiblity&Application Process

Table of Contents

Kalalaku rekkalu Scheme 2026: కళలకు రెక్కలు పథకం ద్వారా ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం ఆడపిల్లల పై చదువుల కొరకు ఆర్ధిక సహాయం మరియు లోన్ సదుపాయం,విదేశీ విద్య కొరకు ఆర్ధిక సహాయం అందించే పథకం. ఈ పథకం ద్వారా ఆడపిల్లలు ఉన్నత విద్యను ఆర్దికంగా బలపరచడమే లక్ష్యం గా కలిగి ఉన్నది. ఈ పథకానికి సంభందించిన పూర్తి వివరాలకు ఈ పోస్ట్ ని పూర్తిగా చదవండి.

“కలలకు రెక్కలు” అనేది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకొచ్చిన మహిళల ఉన్నత విద్య కోసం ప్రత్యేక పథకం.

ఈ పథకం ముఖ్య లక్ష్యం:
“డబ్బుల్లేక చదువును ఆపేసే అమ్మాయిలకు ఆర్థికంగా సహాయం చేసి, వారి కలలకు రెక్కలు పెట్టడం.”

Kalalaku Rekkalu Scheme 2026 – Overview

విషయంవివరాలు
పథకం పేరుకలలకు రెక్కలు పథకం
ప్రారంభించినదిఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం
ఎవరికి ప్రయోజనంఇంటర్ తర్వాత ఉన్నత చదువు కొనసాగించాలనుకునే అమ్మాయిలకు మాత్రమే.
పథకం ఉద్దేశ్యం“డబ్బుల్లేక చదువు ఆపకుండా, అమ్మాయిల కలలకు రెక్కలు పెట్టేలా చేయడం.”
ఎలా సహాయం చేస్తారు?ప్రభుత్వం education loan కు guarantee ఇస్తుంది + లోన్‌పై వచ్చే interest ని ప్రభుత్వం భరిస్తుంది.
ఎవరికి సరిపోతుంది?డిగ్రీ, ఇంజనీరింగ్, మెడిసిన్, మేనేజ్మెంట్, విదేశీ చదువు వంటి ఉన్నత విద్య చదవాలనుకునే అమ్మాయిలకు 📚
ఎప్పుడు ప్రారంభం?2025–26 అకాడెమిక్ సంవత్సరంలో అమలు అవుతుంది.
ఎవరికి ఎక్కువ ఉపయోగపడుతుంది?డబ్బులేక చదువు ఆపేయాలనుకునే లేదా బ్యాంక్‌ గ్యారంటీ లేక లోన్ రాక ఇబ్బంది పడే అమ్మాయిలకు.
తిరిగి చెల్లించాల్సిందేమిటి?కేవలం అసలు లోన్ మొత్తం మాత్రమే (వడ్డీ ప్రభుత్వం చెల్లిస్తుంది).
అప్లికేషన్ విధానంఆన్‌లైన్ పోర్టల్ ద్వారా (త్వరలో ప్రకటించబడుతుంది).

Kalalaku Rekkalu Scheme 2026-Eligibility

  • ఆంధ్రప్రదేశ్ నివాసితులు అయ్యి ఉండాలి.
  • విద్యార్ధునులకు మాత్రమే ఈ పథకం.
  • విద్యార్ధునులు ఇంటర్ పూర్తి చేసుకుని ఉండాలి.
  • డిగ్రీ, ప్రొఫెషనల్ కోర్సులు, PG లేదా విదేశీ చదువు చేయాలనుకునే విద్యార్థినులు.ఉన్నత విద్యలో చేరాలనుకునే ప్రతి అమ్మాయికి ఈ పథకం అవకాశాన్ని ఇస్తుంది.
Kalalaku Rekkalu Scheme 2026

Kalalaku Rekkalu Scheme 2026 – Benefits

ఈ పథకం ద్వారా విద్యార్థినులు:

  • బ్యాంక్ ఎడ్యుకేషన్ లోన్ సులభంగా పొందగలరు.
  • లోన్ కోసం గ్యారంటీ లేదా పత్రాలు చూపాల్సిన అవసరం లేదు.
  • లోన్‌పై వచ్చే వడ్డీ మొత్తాన్ని ప్రభుత్వం చెల్లిస్తుంది.
  • విద్య పూర్తయ్యాక కేవలం అసలు రుణం మాత్రమే తిరిగి చెల్లించాలి.

ఇలా చూస్తే ఈ పథకం తల్లిదండ్రుల ఆర్థిక భారాన్ని తగ్గించి, అమ్మాయిల భవిష్యత్తును ఉన్నత స్థాయికి తీసుకెళ్తుంది.

Kalalaku Rekkalu Scheme 2026- Application Process

ఈ పథకం 2025–26 అకాడెమిక్ ఇయర్ నుండి అధికారికంగా అమల్లోకి వస్తుంది.
అప్లికేషన్ పోర్టల్, రిజిస్ట్రేషన్ స్టెప్పులు, అవసరమైన డాక్యుమెంట్లు త్వరలో ప్రభుత్వం ప్రకటిస్తుంది.

Required documents

NTR Bharosa Pensions Scheme 2026
NTR Bharosa Pensions Scheme 2026: పింఛన్ల రకాలు-పూర్తి వివరాలు
  • Addhar card
  • Ration card
  • Inter Marks memo
  • Bank account deatils
  • working mobile number

Example:

స్వాతి ఇంటర్‌ పూర్తి చేసి BDS (Dentistry) చదవాలనుకుంటోంది.
ఫీజు ఎక్కువగా ఉండటంతో కుటుంబం సపోర్ట్ చేయలేకపోయింది.
బ్యాంకు లోన్‌కు ప్రాపర్టీ మరియు గ్యారంటీ అవసరం అని చెప్పారు.

కానీ కలలకు రెక్కలు పథకం తరువాత:

  • బ్యాంకు ప్రభుత్వం హామీతో లోన్ మంజూరు చేసింది
  • వడ్డీ కూడా ప్రభుత్వం చెల్లిస్తుంది

ఇలా స్వాతి ఇప్పుడు తన కలను చదువుగా మార్చుకుంటోంది.

For more Schemes updates Join Here click here

FAQs

1. ఇది ఎవరికీ అందుతుంది?

ఈ పథకం కేవలం మహిళా విద్యార్థినులకే.
వారు ఇంటర్ / 12th పూర్తి చేసి ఉన్నత చదువు చేయాలనుకుంటే ఈ పథకం పొందవచ్చు.

2. ఏ ఏ చదువులకు వర్తిస్తుంది?

ఈ పథకం క్రింది కోర్సులకు వర్తిస్తుంది:

  • డిగ్రీ (Degre)
  • ఇంజినీరింగ్ (Engineering)
  • మెడిసిన్ (MBBS, BDS మొదలైనవి)
  • లా (Law)
  • MBA/PG కోర్సులు
  • డిప్లొమా / ITI
  • విదేశీ చదువు (Higher Studies Abroad)

3. లోన్ తిరిగి చెల్లించాలా?

అవును — కానీ కేవలం అసలు మొత్తం మాత్రమే తిరిగి చెల్లించాలి.
వడ్డీ మొత్తం ప్రభుత్వం చెల్లిస్తుంది.

4. లోన్ కోసం గ్యారంటీ అవసరమా?

లేదు.
ఈ పథకం ముఖ్య ప్రయోజనం:
ప్రభుత్వమే బ్యాంకు లోన్‌కు గ్యారంటీగా ఉంటుంది.

5. కుటుంబ ఆదాయం మీద ఎలాంటి పరిమితి ఉందా?

ప్రస్తుతం ప్రభుత్వం ఆదాయ పరిమితి ఫిక్స్ చేయలేదు.
ఫైనల్ గైడ్‌లైన్స్ విడుదలయ్యాక ఖచ్చితమైన వివరాలు తెలుస్తాయి.

6. ఏ బాంకులు ఈ పథకం కింద లోన్ ఇస్తాయి?

అన్ని రాష్ట్ర మరియు జాతీయ బ్యాంకులు, అలాగే ప్రభుత్వ అనుమతితో ఉన్న ప్రైవేట్ బ్యాంకులు కూడా ఈ పథకంలో పాల్గొంటాయి.

7. విదేశీ చదువు చేయాలనుకునే విద్యార్థినులు కూడా దరఖాస్తు చేయవచ్చా?

అవును.
విదేశీ విద్యకు కూడా ఈ పథకం వర్తిస్తుంది.

Talliki Vandanam scheme 2026
Talliki Vandanam scheme 2026-తల్లికి వందనం పథకం వివరాలు

8. ఈ పథకానికి ఎలా దరఖాస్తు చేయాలి?

దరఖాస్తు ఆన్‌లైన్‌లో చేయాలి.
ప్రభుత్వం త్వరలో అధికారిక వెబ్ పోర్టల్ మరియు అప్లికేషన్ ప్రక్రియ ప్రకటిస్తుంది.

9. అవసరమైన డాక్యుమెంట్లు ఏమిటి?

సాధారణంగా కావాల్సిన పత్రాలు:

  • ఆధార్ కార్డు (aadhar card)
  • ఇంటర్ / 12th సర్టిఫికేట్ (study certificates)
  • కాలేజ్ అడ్మిషన్ ప్రూఫ్ / ఫీజు స్ట్రక్చర్ (college admission&fees details)
  • బ్యాంక్ డిటైల్స్ (bank details)
  • తల్లిదండ్రుల ఐడి ప్రూఫ్ (parents aadhars)
  • కుల / ఆదాయం ధృవీకరణ (అవసరం ఉంటే) (caste certificates if needed)

ఫైనల్ లిస్ట్ ప్రభుత్వం విడుదల చేస్తుంది.

10. ఇది ఎప్పుడు ప్రారంభమవుతుంది?

ఈ పథకం 2025–26 విద్యా సంవత్సరం నుంచే అధికారికంగా ప్రారంభం అవుతుంది.

11. ప్రైవేట్ కాలేజీలకు కూడా వర్తిస్తుందా?

అవును — గుర్తింపు పొందిన ప్రైవేట్, ప్రభుత్వం, ఆటోనమస్, మరియు విదేశీ విద్యాసంస్థలకు వర్తిస్తుంది.

12. మళ్లీ renew చేయాలా?

అవును.
చదువు కొనసాగుతున్న ప్రతి ఏడాదికీ అకాడెమిక్ ప్రోగ్రెస్‌తో పాటు నవీకరించాలి.

13. మధ్యలో చదువు ఆపేస్తే?

అలా చేస్తే:
👉 లోన్‌కు విద్యార్థినే బాధ్యత వహించాలి
👉 ప్రభుత్వం ఇకపై వడ్డీ చెల్లించదు

14. ఇది స్కాలర్‌షిప్‌నా?

లేదు — ఇది లోన్ సహాయం పథకం, కానీ ప్రభుత్వం వడ్డీ భరిస్తుంది కాబట్టి వడ్డీయిలేని లోన్‌లా పనిచేస్తుంది.

Leave a Comment