Sadabainama lands free Registartion – 2026: Registration process

Table of Contents

Table of Contents

Sadabainama lands free Registartion – 2026: ఏపీ ప్రభుత్వము ఉచితంగా సాదా బైనామా భూముల రిజిస్ట్రేషన్ ప్రారంభించడం జరిగింది. ఈ సాదా బైనామా భూముల రిజిస్ట్రేషన్ ద్వారా మీ భూమి వివరాలు ఆన్లైన్లో పొందుపరచడం జరుగుతుంది. ఈ రిజిస్ట్రేషన్ ద్వారా భూమి యొక్క యజమాని వివరాలు మీ పేరున చేర్చబడతాయి. దీనికి సంబంధించి మీరు రిజిస్ట్రేషన్ చేయాలి అనుకుంటే ఈ పోస్టును పూర్తిగా చదవండి. 

2024 june 14 లోపల జరిగిన కొనుగోళ్లుకు మాత్రమే సాదా బైనామా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చును.

సాదా బైనామా భూములు అంటే: సాదా బైనమా భూముల అంటే మన పూర్వీకులు ఎవరి దగ్గర అయినా వారి భూమిని కేవలం ఒక పేపర్ మీద సంతకాలు చేయించుకొని రాసుకున్నట్లయితే వాటిని చాదా బైనామా భూములు అంటారు. వీటి ద్వారా భూమి యజమాని కేవలము పంటను మాత్రమే పండించగలరు. కానీ ఎలాంటి ప్రభుత్వ సబ్సిడీలు పథకాలు పొందలేరు. 

NTR Bharosa Pensions Scheme 2026
NTR Bharosa Pensions Scheme 2026: పింఛన్ల రకాలు-పూర్తి వివరాలు

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము గ్రామ వార్డు సచివాలయాల ద్వారా ఆన్లైన్లో భూమి యొక్క వివరాలను మీ పేరు మీదకి మార్చబడుతుంది.

ఈ సాదా బైనామా భూముల రిజిస్ట్రేషన్ కేవలం గ్రామీణ ప్రాంతాల్లోని వ్యవసాయ భూములకు మాత్రమే జరుపబడుతుంది. చిన్న సన్న కారు రైతులకు మాత్రమే అర్హత కల్పించారు. 

Sadabainama lands free Registartion – 2026 – Overview

అంశంవివరాలు
అర్థం (Meaning)రిజిస్ట్రేషన్ లేకుండా కాగితం మీద రాసిన భూమి కొనుగోలు/అమ్మకం ఒప్పందం.
లీగల్ స్టేటస్ (Legal Status)రిజిస్ట్రేషన్ చేస్తేనే చట్టపరమైన హక్కు ఉంటుంది. రిజిస్ట్రేషన్ లేకపోతే కోర్టు, ప్రభుత్వం గుర్తించదు.
అవసరమైన పత్రాలు (Required Documents)Aadhaar, PAN, Sada Bainama copy, పాస్బుక్/పట్టాదారు రికార్డు, పన్నుల రసీదులు, FMB స్కెచ్.
ప్రయోజనం (Benefits)రిజిస్ట్రేషన్ తర్వాత భూమిపై హక్కు, అమ్మకాలు, రుణాలు, నిర్మాణ అనుమతి, పాస్‌బుక్ పొందడం.
ఎక్కడ రిజిస్టర్ చేయాలి (Where to Register)ప్రభుత్వ Sub-Registrar Office లేదా రాష్ట్ర e-Registration Portal ద్వారా అపాయింట్‌మెంట్ తీసుకుని రిజిస్టర్ చేయవచ్చు.

Sadabainama lands free Registartion – 2026: Benefits

  • భూమి పూర్తిగా చట్టబద్ధం అవుతుంది. 
  • బ్యాంకు రుణాలు లభిస్తాయి. 
  • వారసత్వ హక్కుల స్పష్టత ఉంటుంది. 
  • ఎలాంటి ఫీజు లేకుండా ఉచిత రిజిస్ట్రేషన్. 
  • ప్రభుత్వ పథకాలు మరియు సబ్సిడీలు లభిస్తాయి. 
  • వేరొకరికి అమ్ముకొనుటకు సులభం అవుతుంది.
చిన్నకారు రైతు 2.5 to 5 acres
సన్నకారు రైతు 1.25 to 2.5 acres

Sadabainama lands free Registartion – 2026: Registration

  • ముందుగా మీరు గ్రామ వార్డు సచివాలయం లేదా మీసేవ కేంద్రాల ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చును. 
  • Form-10 అప్లికేషన్ పూర్తి చేసి దరఖాస్తు సమర్పించాలి. 
  • అప్లికేషన్ తో పాటుగా తగిన డాక్యుమెంట్స్ ని అందించాలి.
  • తర్వాత వివిధ దశల్లో మీ అప్లికేషన్ విచారించబడుతుంది. 
  • 90 రోజుల వ్యవధిలో మీ దరఖాస్తు దశలవారీగా ప్రక్రియ పూర్తి చేసుకొని మీ భూమిపై పూర్తిగా చట్టబద్ధం చేయించబడుతుంది. 

ఎక్కడ చేయించాలి

  • మీసేవ కేంద్రాలు 
  • గ్రామ వార్డు సచివాలయాలు
Sadabainama lands free Registartion - 2026

Sadabainama lands free Registartion – 2026: Required documents

  • రైతు యొక్క ఆధార్ కార్డు 
  • సాదా బైనమా పత్రం 
  • ROR 1B
  • శిస్తు కట్టిన రసీదులు
  • భూమి రైతు యొక్క ఆధీనంలో ఉందనే దానికి ప్రూఫ్ 
  • ఈ క్రాప్ నమోదు వివరాలు. 

Sadabainama lands free Registartion – 2026: Inquiry

  • దరఖాస్తు చేయడం. 
  • MRO గారు అప్లికేషన్ పరిశీలన, విచారణ.
  • భూమి రైతు దే అని నిర్ధారణ.
  • 1B, ఈ-Crop వివరాలు పరిశీలన.
  • సాదా బైనామా పత్రం సబ్ రిజిస్టార్ వద్దకు జమ.
  • తుది దృవీకరణ పత్రం అందుకొనుట.

Join Our telegram group click here

FAQs

సాధా బైనామా అంటే ఏమిటి?

సమాధానం:
సాధా బైనామా అంటే రిజిస్ట్రేషన్ లేకుండా కాగితం మీద రాసిన భూమి కొనుగోలు/అమ్మకం ఒప్పందం. ఇది ప్రభుత్వ రికార్డులలో ఉండదు కాబట్టి ఇది లీగల్‌గా పూర్తిగా గుర్తింపు పొందదు.

సాధా బైనామా భూమిని రిజిస్ట్రేషన్ చేయించుకోవచ్చా?

సమాధానం:
అవును. ప్రభుత్వం అనుమతించిన షరతుల ప్రకారం రెగ్యులర్ రిజిస్ట్రేషన్ చేయించుకోవచ్చు.

సాధా బైనామా భూమి రిజిస్ట్రేషన్‌కు అవసరమైన డాక్యుమెంట్స్ ఏమేం?

సమాధానం:

  • సాధా బైనామా కాపీ
  • అమ్ముతున్న వ్యక్తి Aadhaar, PAN
  • కొనుగోలుదారుని Aadhaar, PAN
  • భూమి పాస్‌బుక్ / రికార్డ్ ఆఫ్ రైట్స్ (ROR)
  • భూమి FMB / భూసర్వే స్కెచ్
  • పన్నుల రసీదులు

సాధా బైనామా భూమి రిజిస్ట్రేషన్ ఫీజు ఎంత?

సమాధానం:
స్టాంప్ డ్యూటీ మరియు రిజిస్ట్రేషన్ ఫీజు భూమి విలువ, ప్రాంతం (గ్రామం, మున్సిపాలిటీ, కార్పొరేషన్) ప్రకారం మారుతుంది.

Talliki Vandanam scheme 2026
Talliki Vandanam scheme 2026-తల్లికి వందనం పథకం వివరాలు

సాధా బైనామా భూమిని e-Registration చేయొచ్చా?

సమాధానం:
అవును. మీ రాష్ట్ర Dharani / Registration Portal ద్వారా అపాయింట్‌మెంట్ తీసుకుని రిజిస్ట్రేషన్ చేయొచ్చు.

సాధా బైనామా భూమిని అమ్మగలమా?

సమాధానం:
లేదు. రిజిస్ట్రేషన్ లేకుండా సాధా బైనామా భూమికి లీగల్ హక్కు ఉండదు కాబట్టి అమ్మడం సాధ్యం కాదు.

సాధా బైనామా భూమిపై లోన్ తీసుకోవచ్చా?

సమాధానం:
లేదు. బ్యాంకులు రిజిస్టర్ చేసిన భూమిపైనే లోన్ ఇస్తాయి.

సాధా బైనామా భూమిపై హక్కు నిరూపించడానికి ఎలాంటి రుజువులు అవసరం?

సమాధానం:

  • తపాలా బిల్లులు
  • యుటిలిటీ బిల్లులు (కాలానుగుణ చెల్లింపులు)
  • రైతు పాస్‌బుక్ (ఉంటే)
  • పొరుగువారి ధృవీకరణ

సాధా బైనామా భూమి రిజిస్ట్రేషన్ చేయకపోతే సమస్య ఏమిటి?

సమాధానం:
అదే భూమిని ఇంకొకరికి అమ్ముతున్నా, కోర్టులో కేసు వచ్చినా హక్కు నిరూపించడం కష్టం అవుతుంది.

సాధా బైనామా భూమి రిజిస్ట్రేషన్ తర్వాత ఏమి జరగాలి?సమాధానం:

  • మ్యూటేషన్ (పేరుమార్పు)
  • డిజిటల్ భూ రికార్డులో అప్డేట్
  • రైతు పాస్‌బుక్ / పతాదారు పాస్‌బుక్ పొందడం

Leave a Comment