Table of Contents
Kalalaku rekkalu Scheme 2026: కళలకు రెక్కలు పథకం ద్వారా ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం ఆడపిల్లల పై చదువుల కొరకు ఆర్ధిక సహాయం మరియు లోన్ సదుపాయం,విదేశీ విద్య కొరకు ఆర్ధిక సహాయం అందించే పథకం. ఈ పథకం ద్వారా ఆడపిల్లలు ఉన్నత విద్యను ఆర్దికంగా బలపరచడమే లక్ష్యం గా కలిగి ఉన్నది. ఈ పథకానికి సంభందించిన పూర్తి వివరాలకు ఈ పోస్ట్ ని పూర్తిగా చదవండి.
“కలలకు రెక్కలు” అనేది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకొచ్చిన మహిళల ఉన్నత విద్య కోసం ప్రత్యేక పథకం.
ఈ పథకం ముఖ్య లక్ష్యం:
“డబ్బుల్లేక చదువును ఆపేసే అమ్మాయిలకు ఆర్థికంగా సహాయం చేసి, వారి కలలకు రెక్కలు పెట్టడం.”
Kalalaku Rekkalu Scheme 2026 – Overview
| విషయం | వివరాలు |
|---|---|
| పథకం పేరు | కలలకు రెక్కలు పథకం |
| ప్రారంభించినది | ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం |
| ఎవరికి ప్రయోజనం | ఇంటర్ తర్వాత ఉన్నత చదువు కొనసాగించాలనుకునే అమ్మాయిలకు మాత్రమే. |
| పథకం ఉద్దేశ్యం | “డబ్బుల్లేక చదువు ఆపకుండా, అమ్మాయిల కలలకు రెక్కలు పెట్టేలా చేయడం.” |
| ఎలా సహాయం చేస్తారు? | ప్రభుత్వం education loan కు guarantee ఇస్తుంది + లోన్‌పై వచ్చే interest ని ప్రభుత్వం భరిస్తుంది. |
| ఎవరికి సరిపోతుంది? | డిగ్రీ, ఇంజనీరింగ్, మెడిసిన్, మేనేజ్మెంట్, విదేశీ చదువు వంటి ఉన్నత విద్య చదవాలనుకునే అమ్మాయిలకు 📚 |
| ఎప్పుడు ప్రారంభం? | 2025–26 అకాడెమిక్ సంవత్సరంలో అమలు అవుతుంది. |
| ఎవరికి ఎక్కువ ఉపయోగపడుతుంది? | డబ్బులేక చదువు ఆపేయాలనుకునే లేదా బ్యాంక్ గ్యారంటీ లేక లోన్ రాక ఇబ్బంది పడే అమ్మాయిలకు. |
| తిరిగి చెల్లించాల్సిందేమిటి? | కేవలం అసలు లోన్ మొత్తం మాత్రమే (వడ్డీ ప్రభుత్వం చెల్లిస్తుంది). |
| అప్లికేషన్ విధానం | ఆన్లైన్ పోర్టల్ ద్వారా (త్వరలో ప్రకటించబడుతుంది). |
Kalalaku Rekkalu Scheme 2026-Eligibility
- ఆంధ్రప్రదేశ్ నివాసితులు అయ్యి ఉండాలి.
- విద్యార్ధునులకు మాత్రమే ఈ పథకం.
- విద్యార్ధునులు ఇంటర్ పూర్తి చేసుకుని ఉండాలి.
- డిగ్రీ, ప్రొఫెషనల్ కోర్సులు, PG లేదా విదేశీ చదువు చేయాలనుకునే విద్యార్థినులు.ఉన్నత విద్యలో చేరాలనుకునే ప్రతి అమ్మాయికి ఈ పథకం అవకాశాన్ని ఇస్తుంది.

Kalalaku Rekkalu Scheme 2026 – Benefits
ఈ పథకం ద్వారా విద్యార్థినులు:
- బ్యాంక్ ఎడ్యుకేషన్ లోన్ సులభంగా పొందగలరు.
- లోన్ కోసం గ్యారంటీ లేదా పత్రాలు చూపాల్సిన అవసరం లేదు.
- లోన్‌పై వచ్చే వడ్డీ మొత్తాన్ని ప్రభుత్వం చెల్లిస్తుంది.
- విద్య పూర్తయ్యాక కేవలం అసలు రుణం మాత్రమే తిరిగి చెల్లించాలి.
ఇలా చూస్తే ఈ పథకం తల్లిదండ్రుల ఆర్థిక భారాన్ని తగ్గించి, అమ్మాయిల భవిష్యత్తును ఉన్నత స్థాయికి తీసుకెళ్తుంది.
Kalalaku Rekkalu Scheme 2026- Application Process
ఈ పథకం 2025–26 అకాడెమిక్ ఇయర్ నుండి అధికారికంగా అమల్లోకి వస్తుంది.
అప్లికేషన్ పోర్టల్, రిజిస్ట్రేషన్ స్టెప్పులు, అవసరమైన డాక్యుమెంట్లు త్వరలో ప్రభుత్వం ప్రకటిస్తుంది.
Required documents
- Addhar card
- Ration card
- Inter Marks memo
- Bank account deatils
- working mobile number
Example:
స్వాతి ఇంటర్ పూర్తి చేసి BDS (Dentistry) చదవాలనుకుంటోంది.
ఫీజు ఎక్కువగా ఉండటంతో కుటుంబం సపోర్ట్ చేయలేకపోయింది.
బ్యాంకు లోన్‌కు ప్రాపర్టీ మరియు గ్యారంటీ అవసరం అని చెప్పారు.
కానీ కలలకు రెక్కలు పథకం తరువాత:
- బ్యాంకు ప్రభుత్వం హామీతో లోన్ మంజూరు చేసింది
- వడ్డీ కూడా ప్రభుత్వం చెల్లిస్తుంది
ఇలా స్వాతి ఇప్పుడు తన కలను చదువుగా మార్చుకుంటోంది.
For more Schemes updates Join Here click here
FAQs
1. ఇది ఎవరికీ అందుతుంది?
ఈ పథకం కేవలం మహిళా విద్యార్థినులకే.
వారు ఇంటర్ / 12th పూర్తి చేసి ఉన్నత చదువు చేయాలనుకుంటే ఈ పథకం పొందవచ్చు.
2. ఏ ఏ చదువులకు వర్తిస్తుంది?
ఈ పథకం క్రింది కోర్సులకు వర్తిస్తుంది:
- డిగ్రీ (Degre)
- ఇంజినీరింగ్ (Engineering)
- మెడిసిన్ (MBBS, BDS మొదలైనవి)
- లా (Law)
- MBA/PG కోర్సులు
- డిప్లొమా / ITI
- విదేశీ చదువు (Higher Studies Abroad)
3. లోన్ తిరిగి చెల్లించాలా?
అవును — కానీ కేవలం అసలు మొత్తం మాత్రమే తిరిగి చెల్లించాలి.
వడ్డీ మొత్తం ప్రభుత్వం చెల్లిస్తుంది.
4. లోన్ కోసం గ్యారంటీ అవసరమా?
లేదు.
ఈ పథకం ముఖ్య ప్రయోజనం:
ప్రభుత్వమే బ్యాంకు లోన్‌కు గ్యారంటీగా ఉంటుంది.
5. కుటుంబ ఆదాయం మీద ఎలాంటి పరిమితి ఉందా?
ప్రస్తుతం ప్రభుత్వం ఆదాయ పరిమితి ఫిక్స్ చేయలేదు.
ఫైనల్ గైడ్‌లైన్స్ విడుదలయ్యాక ఖచ్చితమైన వివరాలు తెలుస్తాయి.
6. ఏ బాంకులు ఈ పథకం కింద లోన్ ఇస్తాయి?
అన్ని రాష్ట్ర మరియు జాతీయ బ్యాంకులు, అలాగే ప్రభుత్వ అనుమతితో ఉన్న ప్రైవేట్ బ్యాంకులు కూడా ఈ పథకంలో పాల్గొంటాయి.
7. విదేశీ చదువు చేయాలనుకునే విద్యార్థినులు కూడా దరఖాస్తు చేయవచ్చా?
అవును.
విదేశీ విద్యకు కూడా ఈ పథకం వర్తిస్తుంది.
8. ఈ పథకానికి ఎలా దరఖాస్తు చేయాలి?
దరఖాస్తు ఆన్‌లైన్‌లో చేయాలి.
ప్రభుత్వం త్వరలో అధికారిక వెబ్ పోర్టల్ మరియు అప్లికేషన్ ప్రక్రియ ప్రకటిస్తుంది.
9. అవసరమైన డాక్యుమెంట్లు ఏమిటి?
సాధారణంగా కావాల్సిన పత్రాలు:
- ఆధార్ కార్డు (aadhar card)
- ఇంటర్ / 12th సర్టిఫికేట్ (study certificates)
- కాలేజ్ అడ్మిషన్ ప్రూఫ్ / ఫీజు స్ట్రక్చర్ (college admission&fees details)
- బ్యాంక్ డిటైల్స్ (bank details)
- తల్లిదండ్రుల ఐడి ప్రూఫ్ (parents aadhars)
- కుల / ఆదాయం ధృవీకరణ (అవసరం ఉంటే) (caste certificates if needed)
ఫైనల్ లిస్ట్ ప్రభుత్వం విడుదల చేస్తుంది.
10. ఇది ఎప్పుడు ప్రారంభమవుతుంది?
ఈ పథకం 2025–26 విద్యా సంవత్సరం నుంచే అధికారికంగా ప్రారంభం అవుతుంది.
11. ప్రైవేట్ కాలేజీలకు కూడా వర్తిస్తుందా?
అవును — గుర్తింపు పొందిన ప్రైవేట్, ప్రభుత్వం, ఆటోనమస్, మరియు విదేశీ విద్యాసంస్థలకు వర్తిస్తుంది.
12. మళ్లీ renew చేయాలా?
అవును.
చదువు కొనసాగుతున్న ప్రతి ఏడాదికీ అకాడెమిక్ ప్రోగ్రెస్‌తో పాటు నవీకరించాలి.
13. మధ్యలో చదువు ఆపేస్తే?
అలా చేస్తే:
👉 లోన్‌కు విద్యార్థినే బాధ్యత వహించాలి
👉 ప్రభుత్వం ఇకపై వడ్డీ చెల్లించదు
14. ఇది స్కాలర్‌షిప్‌నా?
లేదు — ఇది లోన్ సహాయం పథకం, కానీ ప్రభుత్వం వడ్డీ భరిస్తుంది కాబట్టి వడ్డీయిలేని లోన్‌లా పనిచేస్తుంది.












